కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం జై భీమ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో పలువురు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం మరికొందరు మాత్రం హీరో దర్శక నిర్మాతలపై విమర్శలు కురిపిస్తున్నారు. జై భీమ్ చిత్రంలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ చేశారంటూ జై భీమ్ చిత్ర నిర్మాత దర్శకుడు పై చర్యలు తీసుకోవాలని పిఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీసులకి వినతిపత్రం అందించారు.వన్నియార్ కమ్యూనిటీని కించపరిచిన నటుడు సూర్యని కొట్టిన వారికి లక్ష రూపాయల బహుమానం ప్రకటించారు.
జై భీమ్ చిత్ర నిర్మాత 5 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని వన్నియార్ సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై చిత్ర బృందం స్పందిస్తూ ఒక వర్గానికి కించపరిచే విధంగా ఈ సినిమాను తీయలేదని ఒక వర్గానికి చెందిన మహిళ ఏ విధంగా న్యాయపోరాటం చేసిన ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు.
అయితే సూర్యకు బెదిరించడంతో మరికొందరు హీరో సూర్య కు మద్దతుగా నిలబడుతున్నారు. #WeStandWithSuriya అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. సూర్య అభిమానులు మాత్రమే కాకుండా ప్రముఖ సెలబ్రిటీలు సైతం సూర్యకు మద్దతుగా నిలబడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…