తెలుగు సిని సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు రోజా గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి సూపర్ స్టార్ హీరోయిన్ లలో రోజా కూడా ఒకరు.మొదటి సారిగా ప్రేమ తపస్సు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. టాలీవుడ్ హీరో బాలకృష్ణతో కలిసి నటించిన భైరవ ద్వీపం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు విజయశాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ పాత్రలతో అలరించింది రోజానే.అయితే రోజా ఒకవైపు రాజకీయ నాయకురాలిగా సేవలు అందిస్తూనే మరోవైపు టీవీ షోలలో కనిపిస్తుంటారు రోజా. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.
ఈమె కేవలం తెలుగు భాషలోనే కాకుండా, తమిళంలోనూ చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. రోజా తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. మొదట రాజకీయాల్లో టిడిపి పార్టీలో చేరి ఆ తర్వాత వైసీపీలో చేరింది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె ఒకవైపు రాజకీయాల్లో, మరోవైపు ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కు జడ్జిగా వ్యవహరిస్తోంది.
రోజా కూతురు అన్షు మాలిక కూడా తల్లి బాటలోనే పయనిస్తోంది. చిన్న వయసులోనే మంచి మంచి అవార్డులు సాధించింది. ఇటీవలే రోజా తన కూతురు అన్షు గురించి మాట్లాడుతూ.. తన కూతురు ఒక ప్రముఖ ఎన్జీవో ఆర్గనైజేషన్ ద్వారా ఐదు మంది పిల్లలను దత్తత తీసుకొని చదివిస్తోంది అని తెలిపింది. ఇంత చిన్న వయసులోనే తన కూతురికి అలాంటి ఆలోచన వచ్చినందుకు తనకు చాలా గర్వంగా ఉందని తెలిపింది. తన కూతురికి చదువు అంటే చాలా ఇష్టమని ఎప్పుడూ చదువు పుస్తకాలను చదువుతూనే ఉంటుంది అని తెలిపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…