దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. కొన్ని వేల పాటలను పాడారు. ఏ వేరియేషన్లో పాడాలన్నా అతడికి అతనే సాటి. అంత అద్భుతంగా పాడతారు. అతడి పాటలు నచ్చని వారంటూ ఉండరు. పాత తరం దగ్గర నుంచి కొత్త తరం వరకు.. ఎవరి అభిరుచులకు తగ్గట్టూ అలా పాడుతారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ లోకాన్ని విడిచి పెట్టాల్సి వచ్చింది.. ఈ సంగీత శిఖరం.
కానీ ఆయన చనిపోయి సంవత్సరం గడిచి పోతున్నా.. అతడి పాటలు మాత్రం ప్రతీ ఒక్కరి గుండెల్లో నాటుకుపోయాయి. ఇక బుల్లితెరపై అతడు పాడుతా.. తీయగా అనే ప్రోగ్రాంను రన్ చేసిన విషయం తెలిసిందే. అతడు మరణించిన తర్వాత కాస్త దానికి బ్రేక్ వచ్చింది. 25 సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులతో ఈ కార్యక్రమం అనుబంధం ఉంది.
ఈ పాడుతా తీయగా 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుందని ఈటీవీ పేర్కొంది. 25 ఏళ్లక్రితం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎందరో యువ గాయకులను సమాజానికి పరిచయం చేసింది. 18 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని, త్వరలో ప్రారంభంకానున్న 19వ సీజన్ పాడుతా తీయగా కోసం ఈటీవీ భారీ కసరత్తు చేస్తున్నట్లు ఈటీవీ యాజమాన్యం పేర్కొంది.
కరోనా కారణంగా మధ్యలో గ్యాప్ వచ్చింది. దానిలోనే ఆన్‌లైన్ ఆడిషన్స్ నిర్వహించింది. 4 వేలమంది గాయనీగాయకుల స్వరాలను నిర్ణేతల పరీక్షించి వారిలో నుంచి 16 మంది కళాకారులను ఎంపిక చేసినట్లు ఈటీవీ యాజమాన్యం తెలిపింది. షోను నిర్వహించే బాధ్యతను బాలు కుమారుడు ఎస్‌పీ చరణ్ స్వీకరిస్తున్నట్లు పేర్కొంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…