తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరేదు. ఈయనకు తెలుగులో,తమిళం లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాలో విజయ్ పాత్రకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న విజయ్ తెలుగులో అతనంటే పడిచచ్చే అభిమానులు ఉన్నారు.
అతన్ని ఎప్పుడెప్పుడు కలుస్తామని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ సేతుపతికి బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ఒక చేదు అనుభవం ఎదురైంది. విమానం దిగి వెళుతూ ఉండగా వెనక నుంచి ఒక ఆగంతకుడు వచ్చి విజయ్ సేతుపతి ఎగిరితన్నేందుకు ప్రయత్నించాడు. ఈ ఊహించని సంఘటనతో విజయ్ సేతుపతితో పాటుగా అతని చుట్టూ ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు.
వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయ్ సేతుపతిని క్షేమంగా తీసుకెళ్లారు. అయితే బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఈ సన్నివేశానికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ సేతుపతి ఇటీవలే మరణించిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నట్లు సమాచారం.
ఇక విజయ్ సేతుపతి పై దాడికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు ఆగంతుకుడు మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ విషయం పట్ల నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పునీత్ చనిపోయిన తర్వాత తమిళ హీరోలు స్పందించలేదు,అలాగే నివాళులర్పించడానికి కూడా రాలేదు. తెలుగు హీరోలు వచ్చినా కూడా తమిళ్ హీరోలు తమకేం పట్టనట్టుగా ఉన్నారు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…