ప్రేమ ఖైదీ ఫేమ్ మాలాశ్రీ చెల్లెలు శుభశ్రీ. అందరూ కన్నడ అమ్మాయి అనుకునే శుభ శ్రీ అచ్చమైన తెలుగు అమ్మాయి. వీరి కుటుంబం మద్రాస్ వెళ్లి సెటిల్ కావడం జరిగింది. అక్క మాలాశ్రీ కన్నడంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. 1993 శంకర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ డబ్బింగ్ జెంటిల్మెన్ సినిమాతో శుభశ్రీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
అందం,ఆకర్షణ గల శుభశ్రీ గ్లామర్ పాత్రలతో కుర్రకారు అభిమానాన్ని అనతికాలంలోనే సంపాదించుకోగలిగింది. కానీ ఆమె తెలుగులో నేరుగా వినోద్ కుమార్ సరసన ‘అందరూ అందరే’ చిత్రంలో నటించారు. నేషనల్ ఆర్ట్ మూవీస్, మౌళి దర్శకత్వంలో 1994లో అందరూ అందరే చిత్రం విడుదలయింది. గ్లామర్ తోనే కాకుండా మంచి నటిగా కూడా పేరు తెచ్చుకున్న శుభశ్రీ.. హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రెండు సినిమాలు విజయవంతమయ్యాయి. 1995 లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో పెదరాయుడు చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు, భానుప్రియ, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో శుభశ్రీ పెదరాయుడు గ్రామానికి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయురాలి పాత్రలో నటించారు.
ఈ సినిమాలో శుభశ్రీ ధరించిన పాత్ర సినిమాను మలుపు తిప్పుతుంది. అయినప్పటికీ ఆమె తన గ్లామర్ డోస్ తో ప్రేక్షకులను హీటెక్కించింది. పెదరాయుడు చిత్రం శుభశ్రీకి మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
1997, రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్, శరత్ దర్శకత్వంలో పెద్దన్నయ్య చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ, రోజా, ఇంద్రజ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో శుభశ్రీ, బాలకృష్ణ తమ్ముడి భార్యగా నటించారు.
పై రెండు చిత్రాల్లో హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఆమె హీరోయిన్ గా నటించిన తదుపరి తెలుగు చిత్రాలను పరిశీలిస్తే.. తెలుగులో అందరూ అందరే సినిమా అనంతరం పోకిరి రాజా, పుణ్యభూమి నాదేశం, గ్యాంగ్ మాస్టర్, కలియుగంలో గందరగోళం అల్లరిపెళ్ళికొడుకు, ఊహ, అక్క బాగున్నావా, హలో నీకు నాకు పెళ్ళంట, అత్త నీ కొడుకు జాగ్రత్త, కుర్రాళ్ళరాజ్యం లాంటి చిత్రాల్లో నటించింది.
విక్రమ్, అలీ, ఉదయ్ బాబు లాంటి చిన్న హీరోలతో శుభ శ్రీ హీరోయిన్ గా నటించారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కావడం చిన్న హీరోలతో నటించడం లాంటి కారణాలతో ఆమె స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయారు. నటించిన ఆ కొద్ది సినిమాలు కూడా బాక్స్ ఆఫీసు వద్ద తీవ్ర పరాజయాన్ని మూట కట్టుకున్నాయి. 2000 సంవత్సరం తర్వాత ఆమె తెలుగు సినిమాలలో పూర్తిగా కనుమరుగయ్యారు. అక్క మాలశ్రీకి వచ్చినటువంటి పేరు కూడా శుభశ్రీకి రాకపోవడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…