Tag Archives: award ceremony

Prem Rakshith: అవార్డు ప్రకటన రాగానే బాత్రూంలోకి వెళ్లి బోరున ఏడ్చాను… ప్రేమ్ రక్షిత్ కామెంట్స్ వైరల్!

Prem Rakshith: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలోని నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి ఆదరణ రావడమే కాకుండా ఈ సినిమాకు పని చేసినటువంటి వారికి కూడా ఎంతో మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పటివరకు ప్రేమ రక్షిత్ అంటే ఎవరో కూడా తెలియని వారికి కూడా ఈయన బాగా సుపరిచితమయ్యారు.

ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ప్రతి ఒక్కరు ఈయన కొరియోగ్రఫీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆస్కార్ అందుకున్న తర్వాత మొదటిసారి ఈయన ఒక మీడియా ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయనకు రాజమౌళి గారితో పరిచయం తనకు సినిమా అవకాశాలు రావడం గురించి కూడా తెలిపారు.

తాను ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నప్పటికీ ఆ విషయాన్ని దాచి తాను రాజమౌళి కుమారులకు డాన్స్ నేర్పించడం కోసం ట్యూషన్ మాస్టర్ వారి ఇంటికి వెళ్లే వాడినని తెలిపారు. అయితే తను సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేస్తున్నానని తెలుసుకున్నటువంటి రాజమౌళి గారు తనకు తన ప్రతి ఒక్క సినిమాలో అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ఇలా రాజమౌళి గారితో తన ప్రయాణం సై సినిమా నుంచి మొదలైందని తెలిపారు.

Prem Rakshith: మళ్లీ జన్మంటూ ఉంటే ఇలాగే పుట్టాలి…

ఈ విధంగా రాజమౌళి గారి ప్రతి సినిమాలో తాను బాగం అయ్యానని తెలిపారు. ఇక నాటు నాటు పాట కోసం భారీగా కష్టపడ్డామని ఈయన ఈ పాట వెనుక ఉన్న కష్టం గురించి చెబుతూ మా కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని తెలిపారు. ఇక ఈ పాట ఈ స్థాయిలో ఆదరణ సంపాదించుకుంటుందని తాను అస్సలు ఊహించలేదని ప్రేమ్ రక్షిత్ వెల్లడించారు. ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందని ఫోన్ రాగానే ఒకసారిగా ఎమోషనల్ అవుతూ బాత్రూంలోకి వెళ్లి గట్టిగా గుక్క పట్టి ఏడ్చానని తెలిపారు.ఇలా గోల్డెన్ గ్లోబ్ అవార్డు స్థాయికి ఈ పాట వెళ్తుందని నేను ఊహించలేదు. అలాంటి ఈ పాట ఆస్కార్ గెలుచుకోవడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అంటూ మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలా ప్రేమ్ రక్షిత్ గానే పుట్టాలని ఈయన కోరుకున్నారు.

HCA Awards: ఫ్యాన్ పేరుతో పరువు తీయకండి… హెచ్సీఏ అవార్డ్స్ పై చర్చలు అనవసరం!

HCA Awards: రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక గత ఏడాది విడుదలైన RRR సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను కూడా ప్రకటించింది. అయితే ఈ అవార్డు వేడుకలో రామ్ చరణ్ అవార్డు ప్రజెంటేటర్ గా నిలవడంతో ఒకసారిగా రామ్ చరణ్ స్థాయి ఇక ఈ సినిమాలు నటించిన నటీనటులకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను కూడా ప్రకటించింది.

ఈ అవార్డు వేడుకలో రామ్ చరణ్ అవార్డు ప్రజెంటేటర్ గా నిలవడంతో ఒకసారిగా రామ్ చరణ్ స్థాయి ఇక ఈ సినిమాలు నటించిన నటీనటులకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను కూడా ప్రకటించింది అయితే ఈ అవార్డు వేడుకలో రామ్ చరణ్ అవార్డు ప్రజెంటేటర్ గా నిలవడంతో ఒకసారిగా రామ్ చరణ్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతుంది.

ఇలా ఒక తెలుగు నటుడి పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపించడం అంటే మామూలు విషయం కాదు ఇది తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణం అని చెప్పాలి ఇలా తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతూ ఉంటే కొందరు మాత్రం ఫాన్స్ పేరిట తెలుగు చిత్ర పరిశ్రమ పరువు తీస్తూ ఉన్నారు.


HCA Awards: హీరోల పరువు తీయకండి..

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వేడుకకు రామ్ చరణ్ ఆహ్వానించి,ఎన్టీఆర్ ను ఆహ్వానించకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ని సైతం దారుణంగా అవమాన పరుస్తున్నారు. అయితే ఏకంగా సదరు అవార్డు సమస్త సోషల్ మీడియా వేదికగా స్పందించి మేము మీ హీరోని ఆహ్వానించిన ఆయన రాలేకపోయారు అంటూ స్పందించే స్థాయికి వెళ్ళింది అంటే మనం ఏ స్థాయిలో మన పరువును తీసుకుంటున్నామో అర్థమవుతుంది. ఇలా హీరోలందరూ ఒకటైనప్పుడు అభిమానులు మాత్రం వేరుపడి వారి పరువును తీయకండి రా బాబు అంటూ కొందరు ఈ రచ్చ గురించి స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Ramcharan: మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్.. అవార్డు వేడుక కోసం అమెరికా వెళ్లిన చరణ్!

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుస అవార్డులను అందుకుంటూ ఉన్నారు. ఈయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సైతం కొమరం భీం పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.

ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎన్నో అవార్డులను గౌరవాలను అందుకున్నారు. అయితే తాజాగా రాంచరణ్ మరొక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఎంతో ప్రెస్టీజీయస్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్స్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం రామ్ చరణ్ అమెరికా వెళ్లారు.

ఇప్పటికే రామ్ చరణ్ అమెరికా పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ అవార్డుల వేడుకకు రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందింది అయితే తన అన్నయ్య తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు. రామ్ చరణ్ ఈ వేడుకల్లో ఒక ప్రజెంటర్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ అవార్డుల కార్యక్రమం ఈ నెల 24 న జరగనుంది.

Ramcharan: నాలుగు విభాగాలలో పోటీపడుతున్న ఆర్ఆర్ఆర్…

HCA అవార్డుల్లో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా నాలుగు విభాగాలలో నామినేట్ అయింది. ఈ సినిమా ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ అంతర్జాతీయ సినిమా, యాక్షన్ సినిమా విభాగాలలో భాగంగా ఈ సినిమా హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడుతుంది. మరి ఈ అవార్డు వేడుకలలో భాగంగా RRR సినిమా ఎన్ని అవార్డులను సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.