Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుస అవార్డులను అందుకుంటూ ఉన్నారు. ఈయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సైతం కొమరం భీం పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.
ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎన్నో అవార్డులను గౌరవాలను అందుకున్నారు. అయితే తాజాగా రాంచరణ్ మరొక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఎంతో ప్రెస్టీజీయస్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్స్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం రామ్ చరణ్ అమెరికా వెళ్లారు.
ఇప్పటికే రామ్ చరణ్ అమెరికా పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ అవార్డుల వేడుకకు రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందింది అయితే తన అన్నయ్య తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు. రామ్ చరణ్ ఈ వేడుకల్లో ఒక ప్రజెంటర్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ అవార్డుల కార్యక్రమం ఈ నెల 24 న జరగనుంది.
HCA అవార్డుల్లో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా నాలుగు విభాగాలలో నామినేట్ అయింది. ఈ సినిమా ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ అంతర్జాతీయ సినిమా, యాక్షన్ సినిమా విభాగాలలో భాగంగా ఈ సినిమా హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడుతుంది. మరి ఈ అవార్డు వేడుకలలో భాగంగా RRR సినిమా ఎన్ని అవార్డులను సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…