Tag Archives: Ayurveda

ఆయుర్వేద పద్ధతులతో ఇమ్యూనిటీని పెంచుకోండి.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..

శరీరంలో రోగనిరోధక శక్తి అనేది అత్యంత అవసరం. లేదంటే ఏ చిన్న జబ్బు చేసినా దాని నుంచి కోలుకోవడం అనేది చాలా కష్టం. కరోనా సమయంలో కూడా చాలా మంది ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కరోనా నివారణకు మందు లేదు కాబట్టి.. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు డ్రైప్రూట్స్ లాంటి వాటి కోసం ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటివే కాకుండా రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఆయుర్వేద పద్ధతులను కూడా పాటించవచ్చు. వాటి ద్వారా కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అందుకోసం కొన్ని రకాల మూలికలు, మసాలా దినుసులు తీసుకోవచ్చు. అవేంటంటే..వంటింట్లో వాడే పసుపు గురించి అందరికీ తెలిసిందే. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. దీనిలో కర్కుమిన్ అనే గుణం ఉన్నందున మెదడుకు కూడా మంచిది.

అరటీస్పూన్ పసుపును పాలల్లో వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా.. వివిధ మసాలా దినుసులు అనగా తులసి, దాల్చినచెక్క, నల్ల మిరియాలతో తయారు చేసిన మూలికా టీ తాగవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముక్కురంధ్రాలలో నెయ్యి లేదా నువ్వుల నూనెను వేయడం వల్ల ఇన్ ఫెక్షన్ ను నివారించవచ్చు. కొన్ని చుక్కల నెయ్యి, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను మీ ముక్కు రంధ్రాలలో వేయడం వల్ల ఇన్ఫెక్షన్ నివారించవచ్చు.

స్నానం చేయడానికి ఒక గంట ముందు ఖాళీ కడుపుతో ఇలా చేస్తే.. నాసికా భాగాలను క్లియర్ చేసి, ఇన్ఫెక్షన్‌ను తరిమికొడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది గొప్ప మార్గమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. బ్యాక్టీరియాను తొలగించడానికి, నోటి పరిశుభ్రతను కాపాడటానికి ఆయిల్ పుల్లింగ్ అనేది ఒక స్వదేశీ పద్ధతి. దీని ద్వారా మీ నోటి, నాసికా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.చ్యవన్‌ప్రాష్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది వైరస్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. ఇది కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లంతో ఆమ్లా, ఇతర మూలికలను కలపడం ద్వారా ఇంట్లో తయారుచేసుకోవచ్చు.

ఆహారం తినే సమయంలో ఇలాంటి తప్పులు చేయొద్దు.. ఎందుకో తెలుసుకోండి..!

ఆహారం అనేది భూమి మీద బతికే ప్రతీ జీవికి అవసరమే. అది లేకపోతే మానవ మనుగడ సాగదు. ఇష్టం వచ్చిన విధంగా.. ఏది పడితే అది తింటే అసలికే మోసం వస్తుంది. దీని వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆహారం తీసుకునే సమయంలో దాదాపు 99 శాతం మంది ఇలాంటి తప్పులే చేస్తుంటారు. ఇటువంటి తప్పులు చేయకుండా ఉండాలంటే మన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే వాటిని ఎలా మార్చుకోవాలి.. దానికి మనం ఏం తినాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1.పండ్లను తినే సమయంలో పాలను వాటితో కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం ద్వారా.. పాలలో ఉండే కాల్షియం అనేది పండ్ల ఎంజైమ్ లను గ్రహిస్తుంది. దీంతో మనం ఎన్ని పండ్లు తిన్నా శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు.

  1. బెండకాయ తీసుకునే సమయంలో ముల్లంగిని చాలా దూరం ఉంచాలి. ఇలా ముల్లంగి, బెండకాయలు కలిపి తింటే చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
  2. మార్కెట్లో విరివిగా లభించే వాటిల్లో బెండకాయ మరియు కాకరకాయ. ఈ రెండింటిని చాలామంది ఇష్టపడతారు. అయితే రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో విషం తయారవుతుంది. అది ప్రాణాంతకంగా పరిస్థితిని కలిగిస్తుంది. అందుకే ఇవి రెండు కలిపి ఎన్నడూ తీసుకోకూడదు.

4.పెరుగును తినడం చాలామందికి ఇష్టం. తిన్న ఆహారం మంచిగా అరగడానికి ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది పెరుగుతో పాటు ఉల్లిపాయను కూడా తింటారు. ఇలా తినడం వల్ల దురద, తామర, సోరియాసిస్ వంటి వ్యాధులు వస్తాయి. అందుకే ఈ రెండు కలిపి తినకూడదు.

  1. పప్పుతిన్న వెంటనే పాలు తాగడం అనేది శరీరానికి మంచిది కాదు. అంతేకాకుండా.. మాంసం, గుడ్డు, ముల్లంగి వంటివి తిన్న వెంటనే పాలను అస్సలు తాగకూడదు. దీని వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే ఒక 20 నుంచి 30 నిమిషాల తర్వాత వాటిని తీసుకోవచ్చు.

ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారా… అయితే ఈ మూలికలు వాడాల్సిందే!

మీకు పెళ్లయి సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టడం లేదా… గర్భధారణ కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే గర్భం కోసం ఎదురు చూసే వారు తప్పకుండా ఇది తెలుసుకోవాల్సిందే. తాజాగా కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ మూలికలను తీసుకోవటం వల్ల తొందరగా గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ మూలికలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం…

అశ్వగంధ: అశ్వగంధ అనే మూలికను ఆయుర్వేదంలో ఎంతో విరివిగా ఉపయోగిస్తారు. ఈ మూలిక ఫెర్టిలిటీ సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా పురుషులలో శృంగారపరమైన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది. అలాగే మగవారిలో శుక్రకణాల ఉత్పత్తిని పెంచడంలో అశ్వగంధ కీలక పాత్ర పోషిస్తుంది.

శతావరి: శతావరి అనే మూలకం మహిళలకి ఒక రిప్రొడక్టివ్ టానిక్ అని చెప్పవచ్చు. దీనిలో ఫైటో ఈస్ట్రోజెన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఈ మూలకం మహిళలలో అధిక ఒత్తిడి ఆందోళనలు తగ్గించి గర్భందాల్చడానికి అవకాశాలను కల్పిస్తుంది. అదేవిధంగా ఫర్టిలిటీ సమస్యను కూడా దూరం చేస్తుంది. కనుక గర్భం దాల్చాలంటే మహిళలకు శతావరి ఒక అద్భుతమైన మూలిక అని చెప్పవచ్చు.

చైనీస్ హెర్బ్స్: ఫర్టిలిటీ సమస్యలు అధికంగా ఉండే మహిళలు చైనీస్ హిట్స్ ఉపయోగించడం వల్ల ఈ సమస్యల నుంచి దూరం కావచ్చు. అయితే వీటిపై పూర్తిగా పరిశోధనలు జరగలేదు..

రోగనిరోధక శక్తిని పెంచే చికెన్ దమ్ బిర్యాని.. ఎలా చేస్తారు అంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో ప్రజలు ఎంతో భయాందోళనకు గురవుతున్నారు.తాము ఎక్కడ కరోనా బారినపడతామేమోనని అపోహలతోనే కొందరు ప్రాణాలు వదులుతున్నారు.మరి కొందరు మాత్రం మన శరీరంలో వైరస్ తో పోరాడే రోగనిరోధకశక్తి ఉంటే ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని రోగ నిరోధక శక్తి పెంచుకునే మార్గాలను ఎంచుకుంటున్నారు.

ఈ విధంగా రోగ నిరోధక శక్తి పెంచుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాపించదని ప్రచారం జరుగుతోంది. దీనినే ఆసరాగా చేసుకొని ఎంతోమంది వ్యాపారులు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. గత కొద్ది రోజుల వరకు కరోనా వైరస్ తో పోరాడే రోగనిరోధకశక్తి మెరుగుపడాలంటే చికెన్ తినాలనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలోని చికెన్ ధరలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా చికెన్ బిర్యాని తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఓ బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు సరికొత్త ప్రచారానికి తెర లేపాడు.ఈ క్రమంలోనే రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద చికెన్ బిర్యాని అంటూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఈ ఫ్లెక్సీ చూచిన నెటిజన్లు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అయింది.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు చికెన్ బిర్యానీలో వ్యాక్సిన్ కలిపారా? నిజమా? కరోనాకు మందు ఈ చికెన్ బిర్యానీ నేనా, ఇది మరో లెవెల్ మార్కెటింగ్ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ లో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నోటి దుర్వాసనకు జాజికాయ తో చెక్ పెట్టండి ఇలా..!

ఈ మధ్యకాలంలో నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల చాలా మందికి పళ్ళు పసుపు రంగులోకి మారుతుంటాయి.అలాంటివారు పళ్ళు తెల్లగా అవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరికొంతమందికి నోరు ఎల్లప్పుడూ దుర్వాసన వస్తుంటుంది. అలాంటి వారు నలుగురిలో మాట్లాడటానికి మొహమాట పడుతూ ఉంటారు.అయితే ఈ నోటి దుర్వాసన సమస్య పోగొట్టడానికి జాజికాయ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అంతే కాకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కోసం ఆయుర్వేదంలో ఈ జాజికాయను విరివిగా ఉపయోగిస్తుంటారు.అయితే జాజికాయను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

పళ్ళు పసుపు పచ్చగా ఉండి నోరు దుర్వాసన వచ్చేవారు తాంబూలంలో జాజికాయను తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య తొలగిపోతుంది. అదేవిధంగా పళ్ళ మీద ఏర్పడిన పసుపుపచ్చని గార కూడా తొలగిపోతుంది. ప్రతిరోజు గ్లాసు గోరువెచ్చని పాలలో జాజికాయ పొడిని కలుపుకుని తాగడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయి. కొద్ది పరిమాణంలో జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగడం వల్ల చర్మ కాంతి మెరుగు పడటమే కాకుండా, చర్మంపై ముడతలను సైతం నివారిస్తుంది.

నిత్యం ఈ జాజికాయను తీసుకోవటంవల్ల దాహాన్ని తగ్గించడంతో పాటు, జలుబు, దగ్గు, కఫం వంటి వాటికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.జాజికాయలో లభించే ‘మిరిస్టిసిన్’ అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. జాజికాయ పొడిని మిశ్రమంలా తయారు చేసుకొని మొహానికి స్క్రబ్ మాదిరిగా వాడటం వల్ల చర్మకాంతి రెట్టింపవుతుంది. అయితే ఈ జాజికాయను తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. పరిమితికి మించి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాజికాయను ఉపయోగించకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.