Tag Archives: bhahubali

S.S Rajamouli: సాయం చేయమని కోరిన జక్కన్న..మీరే చేయొచ్చుగా అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

S.S Rajamouli: దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన దృష్టి మొత్తం సినిమాల పై మాత్రమే ఉండటం వల్ల ఎలాంటి అనవసర విషయాలలో తలదూర్చకుండా తన పని తాను చేసుకు వెళ్లే స్వభావం కలవాడు.ఇక రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రాజమౌళి తాజాగా సోషల్ మీడియా వేదికగా సాయం చేయమని నెటిజన్లను కోరారు.అయితే బాహుబలి సినిమా కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో భాగంగా సినిమాకి ఎంతో కష్టపడి పని చేసిన దేవికారాణి అనే మహిళ దురదృష్టవశాత్తు బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ప్రతి ఒక్కరూ ఆమెకు సహాయం చేయాలని జక్కన్న సోషల్ మీడియా వేదికగా కోరారు.

దీంతో నెటిజన్లు రాజమౌళి చేసిన ట్వీట్ పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు మీరు సహాయం చేశారా అంటూ కొందరు ప్రశ్నించగా మరికొందరు మాత్రం ఎంతో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే మీరు అదే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఇలా కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకొనే మీకు తనకు సహాయం చేయడం పెద్ద కష్టం కాదు.

మీరు తలుచుకుంటే పెద్ద కష్టం కాదు…

మీరు తలుచుకుంటే దేవికారాణికి ఆపరేషన్ చేయించడం పెద్ద ఖర్చు కాదు. ఆ సహాయం ఏదో మీరే చెయ్యొచ్చుగా ఇలా అందరినీ అడగడం దేనికి అంటూ నెటిజన్లు పెద్దఎత్తున రాజమౌళి పై కామెంట్ లు పెడుతూ అతనిని ట్రోల్ చేస్తున్నారు.మొత్తానికి మంచి చేయాలని భావించిన రాజమౌళికి ఇలా సోషల్ మీడియా వేదికగా చేదు అనుభవం ఎదురైంది.మరి ఈ విషయం పై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి.

ఒకప్పుడు రూపాయి సంపాదన లేదు.. నా భార్య జీతంపై ఆధారపడ్డ: రాజమౌళి

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినిమాల గురించి, తెలుగు ఇండస్ట్రీ గురించి చులకనగా మాట్లాడుకునే బాలీవుడ్ వాళ్లని కూడా జయహో రాజమౌళి అనేలా చేసిన డైరెక్టర్ రాజమౌళి. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాతో జాతీయ స్థానంలో కాదు అంతర్జాతీయంగా కూడా తెలుగు సినిమాలు గుర్తింపు తీసుకువచ్చిన ఘనత మాత్రం రాజమౌళిదే అని చెప్పవచ్చు.తెలుగులో ఇంత మంచి దర్శకులు ఉన్నారా అనే అంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు.

రాజమౌళి తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీశారు. రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి త్వరలో రాబోతున్న త్రిబుల్ ఆర్ సినిమా వరకు చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక రాజమౌళి తన కెరీర్ లో మొదటి లో పడిన కష్టాల గురించి ఒక విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్ లో పంచుకున్నాడు.

తనకు చదువు అంతగా రాలేదని, అలాగే తనకు చిన్నప్పటి నుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అప్పటికే సినీ ఇండస్ట్రీలో ఉండటంతో అని క్రాప్ట్స్ లో పని చేశానని తెలిపారు.అయితే మధ్యలో తనకు పైసా సంపాదన లేని సమయంలో తన భార్య రమా రాజమౌళి జీవితం మీద ఆధారపడి బతకానని, ఆమె తనని పోషించిందని రాజమౌళి తెలిపాడు.

అలా చెప్పుకోవడం తనకు సిగ్గుగా లేదని సంతోషంగా ఉందని తెలిపాడు. ఉదయం లేవగానే తన భార్య రమాను ఆఫీసులో డ్రాప్ చేయడం, ఆ తరువాత కథలు, డైలాగ్స్ రాసుకోవడం, మళ్లీ ఆమెను ఇంటికి తీసుకురావడం అనేది మా లవ్ స్టోరీ అని జక్కన్న తన జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేసుకున్నాడు . అలాంటి పరిస్థితుల నుంచి నేడు భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా మారాడు రాజమౌళి.

దగ్గుపాటి రానా 25 రోజులకు అన్ని రూ. కోట్ల రెమ్యూనరేషనా..? షాక్ అవుతున్న నెటిజన్లు..

పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం భీమ్లా నాయక్ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీనిలో రానా దగ్గుపాటి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దీని నుంచి వచ్చిన టీజర్, సాంగ్ మరియు రానా చెప్పే డైలాగ్ ఓ రేంజిలో పాపులర్ అయ్యాయి.

సినిమా ప్రమోషన్ కి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే రానా దగ్గుపాటి ఏ సినిమాలో అయినా.. ఏ పాత్ర ఇచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమను షేక్ చేసిన బాహుబలి సినిమాలో భ‌ళ్లాల‌ దేవుడి పాత్రతో ఆయన నటన ప్రతీ ఒక్కరిని మెప్పించింది. దాంతోనే అతడి స్థాయి బాగా పెరిగిందనడంలో సందేహం లేదు.

అయితే భీమ్లా నాయక్ సినిమాకు రానా రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు అతడు 25 రోజులకు కాల్ షీట్స్ ఇచ్చారట. దానికి అతడు రూ.4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలితో రేంజ్‌ పెరిగిన తరుణంలో ఆ మాత్రం తీసుకునే స్థాయి రానాకు ఉందని ఫిల్మీ వర్గాల టాక్.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం రిమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సాగర్ కె చంద్ర. దీనికి తమన్ సంగీతం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నిత్యా మీనన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాను 2022 సంక్రాంతి బరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

జక్కన్నకు ఆ సినిమాతో గట్టి షాక్.. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ ఆలస్యం..

రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ‘బాహుబలి’ ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్‌తో తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్‌కు తెలుగులో కంటే హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది రెండో పార్ట్ కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెరో రూ.100 కోట్ల చొప్పును రూ.200 కోట్లను షేర్ సాధించింది. ఇక తమిళం,కన్నడ, మలయాళంలో దాదాపు రూ. 150 కోట్ల వరకు కలక్షన్స్ వచ్చాయి. ఇక హిందీ వెర్షన్ మొత్తం కలిపి రూ. 1400 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. బాహుబలి పాన్ ఇండియా లెవల్లో విజయవంతం కావడంలో హిందీ ప్రేక్షకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి.

పైగా గ్రాఫిక్స్ వర్క్ బాగా ఉండటంతో ఈ సినిమాను థియేటర్స్‌లో చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడ్డారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కూడా ఇందులో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలను ఆక్టోబర్ 13 న విడుదల చేద్దామని అనుకున్నా.. హీరో అక్షయ్ కుమార్ నీళ్లు చల్లాడనే చెప్పాలి.

ఎందుకంటే.. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’ సినిమాకు మంచి రివ్యూస్‌ వచ్చాయి. కానీ కలెక్షన్లలో మాత్రం ఎక్కువగా వసూలు కాలేదు. అక్షయ్ నటించిన సినిమాల్లో కంటే ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లలో పదో వంతు మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి చూస్తే హిందీ ప్రేక్షకుల్లో కరోనా భయం పోలేదని.. అందుకే థియేటర్లకు రాలేదని తెలుస్తోంది. ఆ సినిమాకు హిందీ ప్రేక్షకులు ఆదరించలేదంటే..ఆక్టోబర్ 13 న విడుదలయ్యే ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా ఇలాంటి ఎఫెక్ట్ వస్తుందేమోనని.. రాజమౌళి భయపడుతున్నట్లు తెలుస్తోంది.

అందుకే బాలీవుడ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను విడుదలను పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనకు రాజమౌళి వచ్చినట్టు సమాచారం. మధ్యలో ఏదైనా హిందీ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తే.. పరిస్థితులు చూసుకొని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. ఏదేమైన ఈ సినిమా విడుదల కోసం ఎదరుచూస్తున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైందని చెప్పాలి.

కట్టప్ప కొడుకు కూడా సినిమాలో హీరో అని మీకు తెలుసా.. అతడి కూతురు కూడా ఇప్పుడు..

బాహుబలి సినిమాలో ప్రభాస్ తర్వాత ఎక్కువగా పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది కట్టప్ప మాత్రమే. మొదటి భాగంలో అయినా రెండో భాగంలో అయినా అతడి రోల్ అద్భుతంగా ఉంటుంది. అయితే కట్టప్ప క్యారెక్టర్ చేసిన సత్యరాజ్ తమిళంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు.

తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో తండ్రిగా, మామగా , తాతగా ఎన్నో క్యారెక్టర్లు చేశాడు.. చేస్తున్నాడు కూడా. సత్యరాజ్ కు తెలుగులో ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం అతడిని సత్యరాజ్ అని కాకుండా కట్టప్ప అనే పిలుస్తున్నారంట. ఎప్పుడూ.. ఎక్కడా రాని ఫేమ్ రాజమౌళి పుణ్యమా అని అతడికి బాహుబలి ద్వారా దక్కింది. దీంతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు.

ఇదిలా ఉండగా.. సత్యరాజ్ కు ఒక కొడుకు.. ఒక కూతురు ఉన్నారు. కొడుకు ఇప్పటికే తమిళంలో పలు సినిమాలకు హీరోగా కూడా చేశారు. కూతురు దివ్య కూడా సినిమాల్లోకి రావాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇప్పటికే ఆమె షార్ట్ ఫిలిమ్స్ తీస్తుండగా.. ఆమె కూడా తన నాన్న సినిమాలో ఫేమస్ కావడంతో సినిమాలో నటించేందుకు ఇష్టపడుతుందట.

బాహుబలి తర్వాత కూడా అతడు తెలుగులో పలు సినిమాల్లో నిటించారు. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ప్రతీ రోజు పండగే’ సినిమాలో హీరో తాతగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా అతడు బాహుబలి కంటే ముందు కూడా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. నేను శైలజ, హైపర్, మిర్చి వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించి మెప్పించారు.

సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం సినిమా గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.! అప్పట్లో బాహుబలి రేంజ్..!

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో విజయవంతమైన సినిమాలలో “సింహాసనం” సినిమా ఒకటి అని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమా విడుదలై దాదాపు 35 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ తరం వారికి ఈ సినిమా గురించి బహుశా తెలియకపోయి ఉండొచ్చు.ఈ సినిమాలోని ప్రత్యేకత గురించి తెలిస్తే మాత్రం వెంటనే ఈ సినిమాను చూడకుండా ఉండలేరని చెప్పవచ్చు. మరి కృష్ణ గారు నటించిన “సింహాసనం” సినిమా ప్రత్యేకతలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

కృష్ణ సింహాసనం సినిమా దర్శకత్వం, నిర్మాత, ఎడిటర్, హీరో అన్ని సూపర్ స్టార్ కృష్ణ గారే వ్యవహరించారు. అంతేకాకుండా తెలుగులో మొట్టమొదటి 70 ఎంఎం స్టీరియోఫోనిక్‌ సౌండ్‌ సినిమా కూడా ఇదే అని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రత్యేకత గురించి సింపుల్ గా చెప్పాలంటే 80 సంవత్సర కాలంలో ఈ సినిమా కూడా ఒక బాహుబలి సినిమా అని చెప్పవచ్చు. సింహాచలం సినిమా వసూళ్ల విషయంలో కానీ, రికార్డుల విషయంలో కానీ బాహుబలి సినిమాకు ఏ మాత్రం తీసిపోదని చెప్పవచ్చు.

ఈ సినిమా విడుదలైన సమయంలో సినిమా టికెట్ల కోసం ప్రేక్షకులు 12 కిలోమీటర్ల మేరా లైన్లో వేచి ఉన్నారంటే ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఈ సినిమాను నిర్మించడం కోసం 3.5 కోట్ల రూపాయలు ఖర్చు కాగా ఈ కింద 5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ చెన్నైలో నిర్వహించగా కార్యక్రమానికి కృష్ణ అభిమానులు నాలుగు వందల బస్సులలో అక్కడికి చేరుకున్నారు. ఈ విధంగా 35 సంవత్సరాల క్రితమే అద్భుతమైన రికార్డులను సృష్టించిన సినిమా కృష్ణ నటించిన సింహాసనం సినిమా అని చెప్పవచ్చు.

శివగామి పాత్రలో నటిస్తున్న కుర్ర హీరోయిన్.. ఈ పాత్రకు న్యాయం చేస్తుందా!

ఒకప్పుడు టాలీవుడ్ చిత్రాలు అంటే కేవలం దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయ్యేవి. కానీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేసింది. ఈ సినిమా మంచి గుర్తింపును సంపాదించుకొని దేశవ్యాప్తంగా ఎంతో విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నటించిన తర్వాత ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నారు.

బాహుబలి సినిమా సంపాదించిన గుర్తింపును దృష్టిలో ఉంచుకొని మన తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కుతున్నాయి. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా బాహుబలి అందుకున్న విజయాలతో నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాపై ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది. అయితే ఈ వెబ్ సిరీస్ లో బాహుబలి సినిమాలో చర్చించనీ విషయాలను చూపిస్తారట.ఈ సిరీస్ ను బాహుబలి ది ఫస్ట్ బిగినింగ్ అంటూ తెరకెక్కిస్తున్నారు.

ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా వెర్షన్ లో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో నటీనటుల ఎంపిక విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎంతో అద్భుతంగా శివగామి పాత్ర కోసం ఈ సిరీస్‌లో యువ హీరోయిన్ వామికా గబ్బిను తీసుకున్నట్లు తెలుస్తోంది. వామిక గబ్బీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, పంజాబీ చిత్రాల్లో నటించింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ సౌజన్యంతో రాజమౌళి, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరించగా.. దేవకట్టా, ప్రవీణ్ సత్తారులు దర్శకత్వం చేస్తున్నారు. ఈ సిరీస్ తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ప్రసారం కానుంది. మరి ఈ సిరీస్ లో నటిస్తున్న శివగామి పాత్రలో వామికా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది… ఈ పాత్రకు న్యాయం చేస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.