ఒకప్పుడు టాలీవుడ్ చిత్రాలు అంటే కేవలం దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయ్యేవి. కానీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేసింది. ఈ సినిమా మంచి గుర్తింపును సంపాదించుకొని దేశవ్యాప్తంగా ఎంతో విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నటించిన తర్వాత ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నారు.
బాహుబలి సినిమా సంపాదించిన గుర్తింపును దృష్టిలో ఉంచుకొని మన తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కుతున్నాయి. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా బాహుబలి అందుకున్న విజయాలతో నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాపై ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది. అయితే ఈ వెబ్ సిరీస్ లో బాహుబలి సినిమాలో చర్చించనీ విషయాలను చూపిస్తారట.ఈ సిరీస్ ను బాహుబలి ది ఫస్ట్ బిగినింగ్ అంటూ తెరకెక్కిస్తున్నారు.
ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా వెర్షన్ లో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో నటీనటుల ఎంపిక విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎంతో అద్భుతంగా శివగామి పాత్ర కోసం ఈ సిరీస్‌లో యువ హీరోయిన్ వామికా గబ్బిను తీసుకున్నట్లు తెలుస్తోంది. వామిక గబ్బీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, పంజాబీ చిత్రాల్లో నటించింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ సౌజన్యంతో రాజమౌళి, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరించగా.. దేవకట్టా, ప్రవీణ్ సత్తారులు దర్శకత్వం చేస్తున్నారు. ఈ సిరీస్ తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ప్రసారం కానుంది. మరి ఈ సిరీస్ లో నటిస్తున్న శివగామి పాత్రలో వామికా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది… ఈ పాత్రకు న్యాయం చేస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…