Featured

మన జబర్దస్త్ కమెడియన్స్ ఏం చదువుకున్నారో తెలుసా ?

బుల్లితెర మీద ఎన్ని కామెడీ షో లు వచ్చినా సరే ఈ టీవిలో జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ షోనే. ఈటీవీ TRP రేటింగ్స్ చాలా వరకు ఈ జబర్డస్ట్ వచ్చే టైంలోనే వస్తున్నాయి అంటే దాన్ని బట్టి అర్ధం అర్థంచేసుకోవచ్చు. జబర్దస్త్ షో క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో.. తెలుగులో ఒక కామిడి రియాలిటీ షో ఇంత అద్భుతమైన సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించని కూడా లేదు.

అంతేకాదు ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ జీవితాలు కూడా ఓ రేంజ్ లో మారిపోయాయి. ఒకే ఒక్క షో తోనే స్టార్స్ అయిపోయారు. అంతేకాదు ఈ కామెడీ షో ద్వారా చాలా మంది కొత్త కొత్త కమెడియన్స్ టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఒక్కసారిగా వీరి జీవితాలు మారిపోయాయి. డబ్బులు, క్రేజ్ బాగానే సంపాదించారు. కొంత మంది సినిమాల్లో హీరోలుగా వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మరి ఈ షోలో ఇంతగా మనందరినీ నవ్విస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ ఏం చదువుకున్నారో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే

బుల్లితెరలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు.. ఆ తరువాత కుటుంబ పోషణ కోసం ఆయన చదువు మానేసి, మ్యాజిక్ షోలు చేస్తూ ఉండేవాడు.

స్కిట్ మొదలైనప్పటి నుంచి ఎండింగ్ వరకు తనదైన పంచ్ డైలాగ్స్ తో అందరినీ కడుపుబ్బ నవ్వించే హైపర్ ఆది బీటెక్ పూర్తి చేశారు.

ఆటో రామ్ ప్రసాద్.. తన మార్క్ అటో పంచ్ లతో కడుపుబ్బ నవ్వించే రాం ప్రాసాద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదివారు.

గెటప్ శ్రీను యాక్టర్ గా, మిమిక్రి ఆర్టిస్ట్ కూడా అయిన శ్రీను కూడా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు.

ముక్కు అవినాష్.. బిగ్ బాస్ షో కోసం జబర్దస్త్ కి టాటా చెప్పిన అవినాష్ ఎంబీఏ చదువుకున్నారు.

ఇక చలాకీ చంటి డిగ్రీ చదువుతూ మద్యలో వదిలేశారట.

వర్షతో లవ్ ట్రాక్ నడిపిస్తూ ఫేమస్ అవుతున్న ఇమ్మానియేల్ డిగ్రీ వరకు చదువుకున్నాడు.

ఇక రాకెట్ రాఘవ.. జబర్దస్త్ తో పాటూ సినిమాలలో కూడా సత్తా చాటుతున్న రాఘవ డిగ్రీ చదువుకున్నారు. ఆపై టీచర్ ట్రైనింగ్ కూడా చేశారట.

బులెట్ భాస్కర్.. డిగ్రీ బికాం చేశారు.

మహేష్ డిగ్రీ వరకు చదివారట.

నరేష్.. డిగ్రీ చదువుతూ మధ్యలో మానేశారు.

కెవ్వు కార్తీక్.. డిగ్రీ వరకు చదివారు.

సునామి సుధాకర్.. డిగ్రీ పూర్తి చేసారట.

జబర్దస్త్ నుండి బయటికి వెళ్లిన చమ్మక్ చంద్ర.. ఇంటర్ వరకు చదివారు.

డైరెక్టర్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న అదిరే అభి ఇంజనీరింగ్ చదివారట..

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago