Tag Archives: bhogi festival

Mega Family: భోగి సంబరాలలో మెగా కుటుంబం.. వరుణ్ తేజ్ ను చూసి కుళ్లుకుంటున్న చిరు.. వీడియో వైరల్!

Mega Family: దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలను పెద్దఎత్తున ప్రారంభించారు. నేడు భోగి కావడంతో ఇప్పటికే ఎంతో మంది భోగి సంబరాలలో నిమగ్నమయ్యారు.కేవలం సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం సంక్రాంతి సంబరాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

Mega Family: భోగి సంబరాలలో మెగా కుటుంబం.. వరుణ్ తేజ్ ను చూసి కుళ్లుకుంటున్న చిరు.. వీడియో వైరల్!

ఇక ఏదైనా ప్రత్యేక పండుగ లేదా కార్యక్రమం వస్తే మెగా కుటుంబం అంతా ఒకే చోటకు చేరి పెద్ద ఎత్తున సందడి చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా కుటుంబం భోగి సంబరాలలో నిమగ్నమయ్యారు. మెగా కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట చేరి పెద్ద ఎత్తున నేడు ఉదయం భోగి మంటలు వేశారు.

Mega Family: భోగి సంబరాలలో మెగా కుటుంబం.. వరుణ్ తేజ్ ను చూసి కుళ్లుకుంటున్న చిరు.. వీడియో వైరల్!

ఇలా భోగిమంటల వేడుకలో పాల్గొన్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి వరుణ్ తేజ్ ఇంటి సభ్యులకు దోశలు వేసి పెట్టారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి వరుణ్ తేజ్ మధ్య ఓ సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి వరుణ్ తేజ్ ను చూసి కుళ్లుకుంటున్నట్లు తెలిపారు.

నీ దోసె చాలా బాగా వచ్చింది..

ఇలా మెగాస్టార్ చిరంజీవి వరుణ్ తేజ్ దోసెలు వేస్తూ ఉన్నటువంటి వీడియోని వరుణ్ తేజ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి దోసే చెడిపోగా వరుణ్ దోసే ఎంతో అద్భుతంగా వచ్చింది. అది చూసి కుళ్లుకుంటున్న చిరంజీవి నాకు కుళ్ళు వస్తోంది.. అంటూ వరుణ్ వేసిన దోసెను చెడగొట్టి మొత్తం ఉప్మాలా తయారు చేశాడు. అది చూసిన వరుణ్ తేజ్ నవ్వుతూ ఉండిపోయారు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘బాస్ చిరంజీవితో దోస మేకింగ్ 101.. 2022 భోగి’ శుభాకాంక్షలు అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

రేగు పండ్లు తినేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సింది..!

రేగుపండ్లు శీతాకాలంలో విరివిగా లభించే పండ్లలో ఒకటని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పండ్లను భోగి రోజు చిన్న పిల్లలపై వేయటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి పిల్లల్ని కాపాడుతుందని భావిస్తారు. అందుకే భోగి రోజు భోగి పళ్ళగా వీటిని పిల్లలపై పోయడం అనాదిగా వస్తున్న ఆచారంగా భావిస్తారు. రుచికి తీపి,పులుపు కలిపినట్టు ఉన్న ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ రేగు పళ్ళు చెట్టు నుంచి మొదలుకుని ప్రతి ఒక్కటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే రేగి పండ్లను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం.

ఈ రేగు పండ్లలో ఎక్కువగా విటమిన్ సి, ఏ, పొటాషియం అధికంగా లభిస్తాయి. విటమిన్ సి మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విటమిన్ ఏ వల్ల ఎటువంటి కంటి సమస్యలు లేకుండా కాపాడుతుంది. ఇవే కాకుండా రేగుపళ్లులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ రేగు పండ్లను తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.అదేవిధంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రేగు పండ్లను తినడం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

డయేరియా, నీళ్ల విరోచనాలు వంటి సమస్యతో బాధపడేవారు రేగు పండ్ల చెట్టు బెరడును తీసి కషాయం తయారుచేసి తాగించడం వల్ల తొందరగా ఈ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. అదేవిధంగా చర్మ అలర్జీలు ఉన్నవారు రేగుపళ్ళు ఆకును మెత్తగా రుబ్బి అంటించుకోవడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రేగు పండు విత్తనాలను బాగా ఎండబెట్టి పొడిచేసి నూనెలో కలిపి రాసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది. కానీ ఎర్రగా పండిన రేగుపండ్లను తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.పచ్చి రేగు పండ్లను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది.