Mega Family: భోగి సంబరాలలో మెగా కుటుంబం.. వరుణ్ తేజ్ ను చూసి కుళ్లుకుంటున్న చిరు.. వీడియో వైరల్!
Mega Family: దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలను పెద్దఎత్తున ప్రారంభించారు. నేడు భోగి కావడంతో ఇప్పటికే ఎంతో మంది భోగి సంబరాలలో నిమగ్నమయ్యారు.కేవలం సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం సంక్రాంతి సంబరాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఇక ఏదైనా ప్రత్యేక పండుగ లేదా కార్యక్రమం వస్తే మెగా కుటుంబం అంతా ఒకే చోటకు చేరి పెద్ద ఎత్తున సందడి చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా కుటుంబం భోగి సంబరాలలో నిమగ్నమయ్యారు. మెగా కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట చేరి పెద్ద ఎత్తున నేడు ఉదయం భోగి మంటలు వేశారు.
ఇలా భోగిమంటల వేడుకలో పాల్గొన్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి వరుణ్ తేజ్ ఇంటి సభ్యులకు దోశలు వేసి పెట్టారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి వరుణ్ తేజ్ మధ్య ఓ సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి వరుణ్ తేజ్ ను చూసి కుళ్లుకుంటున్నట్లు తెలిపారు.
ఇలా మెగాస్టార్ చిరంజీవి వరుణ్ తేజ్ దోసెలు వేస్తూ ఉన్నటువంటి వీడియోని వరుణ్ తేజ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి దోసే చెడిపోగా వరుణ్ దోసే ఎంతో అద్భుతంగా వచ్చింది. అది చూసి కుళ్లుకుంటున్న చిరంజీవి నాకు కుళ్ళు వస్తోంది.. అంటూ వరుణ్ వేసిన దోసెను చెడగొట్టి మొత్తం ఉప్మాలా తయారు చేశాడు. అది చూసిన వరుణ్ తేజ్ నవ్వుతూ ఉండిపోయారు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘బాస్ చిరంజీవితో దోస మేకింగ్ 101.. 2022 భోగి’ శుభాకాంక్షలు అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…