Nagarjuna: సమంత నాగచైతన్య విడాకులపై స్పందించిన నాగార్జున.. ఎంతో బాధాకరం అంటూ!
Nagarjuna: అక్కినేని నాగ చైతన్య, సమంత జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు వీరికి అధికారికంగా విడాకులు వెలువడలేదు.
వీరు విడాకులు తీసుకొని సుమారు నాలుగు నెలలు కావస్తున్న తరుణంలో మొదటిసారిగా నాగార్జున వీరి విడాకులపై స్పందించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా నాగార్జున వీరిద్దరి విడాకుల ప్రస్తావన గురించి మాట్లాడారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. వారిద్దరి విడాకులు తీసుకోవడం ఎంతో బాధాకరమని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఏ వ్యక్తికైనా ఎంతో కష్టమని కానీ నాగచైతన్య మాత్రం ఈ విషయంలో ఎంతో హుందాగా ప్రవర్తించారని నాగార్జున తెలిపారు.
ఈ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి చైతన్య ఎలా గట్టేక్కిస్తాడా అని ఎంతో కంగారుపడ్డాను అయితే చైతన్య ఎంతో పరిపక్వత చెందాడని, తనకు పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగే ధైర్యం ఉందని తాను ధైర్యంగా ఉంటూ నాకే ఎంతో ధైర్యం చెప్పాడని నాగార్జున తెలియజేశారు. నాగ చైతన్య ఇంత తొందరగా ఈ సంఘటన నుంచి బయటపడి ఇలా సంతోషంగా ఉండడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…