Konda Polam: వెండితెరపై హిట్ కొట్టలేకపోయినా.. ఇక్కడ మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిన మెగాహీరో?
Konda Polam: మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ మెగా హీరోకి వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కొండ పొలం అనే నవల ఆధారంగా కొండపొలం అనే చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా ద్వారా గొర్రెలకాపరులు అడవిలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారు అనే విషయాలను దర్శకుడు ఎంతో అద్భుతంగా చూపించారు.
గొర్రెలకాపరులుగా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. దీంతో వైష్ణవ్ రెండవ సినిమానే ఫ్లాప్ గా నిలిచింది.
ఇలా థియేటర్ లో ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా జనవరి 2వ తేదీ స్మాల్ స్క్రీన్ పై ప్రసారం అయింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఐదు కోట్ల రూపాయలకు స్టార్ మా దక్కించుకుంది. ఈ క్రమంలోనే జనవరి 2వ తేదీ ప్రసారమైన ఈ సినిమా ఏకంగా 12. 34 టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా 12 కి పైన రేటింగ్స్ దక్కించుకోవడంతో ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లడమే కాకుండా స్టార్ మాకు లాభాలను కూడా తెచ్చిపెట్టింది.ఏది ఏమైనా థియేటర్ లో ప్రేక్షకులను సందడి చేయలేకపోయినా బుల్లితెరపై మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…