Tag Archives: cash back

ఈ ఆఫర్ ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందవచ్చు.. ఎలానో తెలుసుకోండి?

ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్లధరలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులకు ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఇది వరకు ఈ ఆఫర్ మే 31 వరకు ఉండగా తాజాగా ఈ ఆఫర్ జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది.

పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి 800 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల రూపాయలు ఉండడంతో ఈ ఆఫర్ ద్వారా మనము ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందగలుగుతాము. అయితే ఈ ఆఫర్ పొందాలనుకునే వారు తప్పకుండా వారి ఫోన్ లో పేటీఎం యాప్ ఉండాలి.

ముందుగా మన స్మార్ట్ ఫోన్ లో పేటీఎం యాప్ డౌన్లోడ్ చేసుకుని”బుక్ గ్యాస్ సిలిండర్” సెక్షన్ కు వెళ్లి తమ డీలర్ షిప్ ఎంచుకోవాలి. ఈ క్రమంలోనే భారత్ గ్యాస్, హెచ్ పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం గ్యాస్ సిలిండర్ కంపెనీ ఎంచుకున్న తర్వాత గ్యాస్ ప్రొవైడర్ వివరాలు, కన్జ్యూమర్ ఐడి, ఫోన్ నెంబర్ తదితర వివరాలను నమోదు చేసి బుకింగ్ ప్రారంభం చేయాలి. ఈ విధంగా పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి గ్యాస్ మనకు డెలివరీ అయ్యేలోగా ఎనిమిది వందల రూపాయల క్యాష్ బ్యాక్ అమౌంట్ పొందవచ్చు. మరెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇప్పుడే వినియోగించుకోండి.

పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ కార్డ్ తో ఇంటి అద్దె చెల్లించే ఛాన్స్..?

డిజిటల్ పేమెంట్స్ సంస్థలలో ఒకటైన పేటీఎం సంస్థ కస్టమర్లకు గత కొన్ని నెలల నుంచి కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. తాజాగా పేటీఎం క్రెడిట్ కార్డ్ సహాయంతో ఇంటి అద్దె చెల్లించే అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా క్రెడిట్ కార్డుల సహాయంతో టికెట్ల బుకింగ్, రీఛార్జ్, ఆన్ లైన్ పేమెంట్స్, షాపింగ్ చేస్తూ ఉంటాం. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా రూమ్ రెంట్ కూడా చెల్లించే ఛాన్స్ అంటే కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుంది.

గతంలో పలు యాప్స్ ద్వారా ఇంటి ఓనర్లకు క్రెడిట్ కార్డ్ సహాయంతో ఇంటి రెంట్ చెల్లించే అవకాశం ఉండేది. అయితే పేటీఎం ఆ యాప్స్ అవసరం లేకుండా డైరెక్ట్ గా రూమ్ రెంట్ చెల్లించే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం. అయితే పేటీఎం క్రెడిట్ కార్డ్ ద్వారా ఎవరైతే రూమ్ రెంట్ ను చెల్లిస్తారో వాళ్లు అదనంగా 2 శాతం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే అదనంగా 2 శాతం చెల్లించినా రివార్డ్ పాయింట్లు లేదా క్యాష్ బ్యాక్ రూపంలో డబ్బులు లభిస్తాయి.

1,000 రూపాయలకు 20 రూపాయల చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్లు ఎవరైనా పేటీఎం యాప్ ను ఓపెన్ చేసి ఆల్ సర్వీసెస్ ఆప్షన్ ను ఓపెన్ చేసి ఆ తరువాత మంత్లీ బిల్స్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అక్కడ రెంట్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇంటి ఓనర్ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా సులభంగా లావాదేవీలు జరిపే అవకాశం ఉంటుంది.

అయితే రూమ్ రెంట్ ను డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా చెల్లిస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. కానీ క్రెడిట్ కార్డును ఎక్కువగా వినియోగించే వాళ్లకు పేటీఎం కొత్త సర్వీసుల ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. అన్ని ఫీచర్లతో మైక్రోమాక్స్ బడ్జెట్ మొబైల్..!

దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. అయితే చైనాతో గొడవల నేపథ్యంలో దేశంలోని చాలామంది దేశీ మొబైల్స్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాళ్లకు మైక్రోమాక్స్ సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. మైక్రోమాక్స్ ఇన్ 1బీ పేరుతో ఈరోజు సంస్థ మొబైల్ ఫోన్ ను లాంఛ్ చేసింది. ఈ ఫోన్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా ఫోన్ లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

6.52 అంగుళాల హెచ్‌డీ + మినీ డ్రాప్ డిస్ ‌ప్లే తో మైక్రోమాక్స్ సంస్థ మైక్రోమాక్స్ ఇన్ 1బి ఫోన్ ను లాంఛ్ చేసింది. . ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ తో ఈ ఫోన్ పని చేస్తుంది. 4 జీబీ మరియు 2 జీబీ ర్యామ్ లలో ఏదో ఒక ఆప్షన్ ను ఎంచుకుని ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. 4జీబీ ర్యామ్ కు మైక్రోమాక్స్ కంపెనీ 64 జీబీ సామర్థ్యంతో ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.

10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఈ ఫోన్ బ్యాటర్ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్. మైక్రోమాస్క్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ ను మైక్రోమాక్స్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ లో ప్రైమరీ కెమెరా 13 మెగా పిక్సెల్ కాగా సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కొరకు ఫోన్ ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

2 జీబీ ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ వేరియంట్‌ ధర 6,999 రూపాయలు కాగా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర 7,999 రూపాయలు కావడం గమనార్హం. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కస్టమర్లు 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కూడా 5 శాతం క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది.

రూమ్ రెంట్ ఇలా కడితే రూ.5000 లాభం.. ఏం చేయాలంటే..?

పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు వెళితే అక్కడ తప్పనిసరిగా ఇల్లు అద్దెకు తీసుకుని జీవించాల్సిందే. రోజురోజుకు నగరాల్లో , పట్టణాల్లో అద్దెలు సైతం భారీగా పెరిగిపోతున్నాయి. మంచి ఏరియాలలో ఇల్లు అద్దెకు దొరకాలంటే 10,000 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా రూమ్ రెంట్ కట్టినా అదిరిపోయే క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది.

మనలో చాలామంది అవసరాల నిమిత్తం క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే. క్రెడిట్ కార్డుల సహాయంతో ఈ కామర్స్ వెబ్ సైట్లలో షాపింగ్ చేయడం, బిల్ పేమెంట్లు చేయడం, ఆన్ లైన్ చెల్లింపులు చేయడం చేస్తూ ఉంటాం. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా రెంట్ కూడా చెల్లించవచ్చు. పలు మొబైల్ యాప్స్ ద్వారా రూమ్ రెంట్ చెల్లించి అదిరిపోయే క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.

అయితే రెడ్‌జిరాఫీ, క్రెడ్, నో బ్రోకర్ లాంటి యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ యాప్స్ ద్వారా హౌస్ రెంట్ పే చేసేవాళ్లు సర్వీస్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే సర్వీస్ చార్జీలను చెల్లించినా చాలా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మనం నష్టపోము. పైన చెప్పిన యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని రూమ్ రెంట్ చెల్లిస్తే 5,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.

మనం ఉపయోగించే క్రెడిట్ కార్డ్, చెల్లించే అద్దెను బట్టి ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. కొన్ని కార్డులు వాడితే క్యాష్ బ్యాక్ తో పాటు రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి. ఈ విధంగా రూమ్ రెంట్ చెల్లించి డబ్బులను సులభంగా ఆదా చేసుకోవచ్చు.

లోన్ మారటోరియం డబ్బులు ఖాతాలో పడలేదా.. అసలు కారణమిదే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొన్ని రోజుల క్రితం రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. మార్చి నెల నుంచి ఆగస్టు నెల వరకు రుణాలకు వడ్డీ మీద వడ్డీని వసూలు చేయడం లేదని.. వడ్డీ మాఫీ డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్రం వారం రోజుల క్రితమే వడ్డీ మాఫీ డబ్బులను బ్యాంకు ఖాతాలలో జమ చేసింది. అయితే కొందరు మాత్రం ఆ డబ్బులు ఇంకా ఖాతాలలో జమ కాలేదని చెబుతున్నారు.

కేంద్రం 2 కోట్ల రూపాయల లోపు రుణాలు తీసుకున్న వాళ్లందరికీ ప్రయోజనం కలిగే విధంగా వడ్డీ మీద వడ్డీ మాఫీ నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ లతో పాటు మరికొన్ని లోన్లు తీసుకున్న వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే కొందరు మాత్రం తమ ఖాతాలలో లోన్ మారటోరియం డబ్బులు ఇప్పటికీ జమ కాలేదని చెబుతున్నారు. ఇలా డబ్బులు జమ కాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

కేంద్రం కొన్ని నిబంధనల ప్రకారం లోన్ మారటోయానికి అర్హులను ఎంపిక చేస్తోంది. 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల 29 నాటికి లోన్ అకౌంట్ మొండి బకాయిగా మారకపోతే మాత్రమే కేంద్రం ఈ ప్రయోజనాన్ని అందిస్తోంది. వీళ్లు మాత్రమే లోన్ మారటోరియం వడ్డీ మాఫీని పొందడానికి అర్హులవుతారు. లేకపోతే వీళ్లు కేంద్రం అందిస్తున్న వడ్డీ మీద వడ్డీ మాఫీ ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉండవు.

వడ్డీ మాఫీ స్కీమ్ ప్రకారం ఎవరైతే లోన్ మారటోరియం ఎంచుకుంటారో వాళ్లు సాధారణ వడ్డీనే చెల్లించాల్సి ఉంటుంది. లోన్ మారటోరియం ఆప్షన్ ను ఎంచుకున్న వాళ్లకు కేంద్రం వడ్డీ మీద వడ్డీ వేయదు. ఆ ఆప్షన్ ఎంచుకోని పక్షంలో మాత్రమే క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది.