Tag Archives: chandramohan

SPB – K Viswanath – Chandramohan : ఈ ముగ్గురు అత్యంత దగ్గరి బంధువులు.. వీరు కలిసి చేసిన చిత్రం చరిత్రలో నిలిచిపోయింది.!!

కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి దేశం గర్వించదగ్గ అద్భుతమైన కళాఖండాలను రూపొందించి జాతి కీర్తి బావుటాను దశదిశలా వ్యాపింప జేశారు.

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు. శాస్త్రీయ సంగీతం నేపథ్యంగా రూపొందించబడిన “శంకరాభరణం” చిత్రం ఎస్పీ బాలు కి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది.

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించాడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.
అయితే గుంటూరులో బీఎస్సీ పూర్తి చేసిన కె.విశ్వనాథ్ ను తన తండ్రి సుబ్రహ్మణ్యం వాహినీ స్టూడియోలో ఆడియో గ్రాఫర్ నియమించాడు.

1966 “ఆత్మ గౌరవం”చిత్రం ద్వారా కె. విశ్వనాథ్ దర్శకునిగా పరిచయమయ్యారు. ఇదే సంవత్సరంలో వాహినీ వారు నిర్మించిన (1966) “రంగులరాట్నం” చిత్రం ద్వారా చంద్రమోహన్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. వాహినీ సంస్థ తోనే కె.విశ్వనాథ్ చంద్రమోహన్ సినీ పరిశ్రమకు పరిచయమవడం గమనార్హం. ఒక సంవత్సరం తేడాతో 1967 “శ్రీ శ్రీ మర్యాద రామన్న” చిత్రం ద్వారా ఎస్పీ బాలసుబ్రమణ్యం గాయకుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఈ ముగ్గురు మధ్య ఉన్నది అన్నదమ్ముల సంబంధం. అవును అదెలాగంటే కె విశ్వనాథ్ తండ్రి సుబ్రహ్మణ్యం మొదటి భార్య చనిపోగానే రెండో పెళ్లి చేసుకున్నారు.

అయితే మొదటి భార్య చెల్లెల్ల కొడుకులే చంద్రమోహన్, బాలసుబ్రమణ్యం లు కాకపోతే సొంత అన్నదమ్ములు కాదు. వీరు కలిసి సినిమాలు చేస్తుండగానే వీరి మధ్య గల బంధుత్వం ఏమిటి అనే విషయం తెలియకుండా ఎవరి పని వారు చేసుకోవడం మంచిదనే ఉద్దేశ్యంతో దానికి కట్టుబడి వీరు అన్నదమ్ములనే విషయాన్ని గోప్యంగా ఉంచారు.కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన “శంకరాభరణం” చిత్రంలో చంద్రమోహన్ నటించగా ఎస్పీ బాలసుబ్రమణ్యం “శంకరా నాదశరీరాపరా” అనే అద్భుతమైన పాటను ఆలపించారు. అలా ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి చరిత్ర సృష్టించిన “శంకరాభరణం” చిత్రానికి పనిచేశారు.

Chiranjeevi: దాసరి వచ్చి చిరంజీవిని తీసేసి చంద్రమోహన్ ని హీరోగా పెట్టమన్నారు… డైరెక్టర్ దవళ సత్యం షాకింగ్ కామెంట్స్!

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ధవళ సత్యం. ఈయన ఎంతో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈయన కూడా దాసరి శిష్యుడు. ఇలా దాసరి శిష్యుడుగా ఇండస్ట్రీలో కొనసాగిన ధవళ సత్యం దర్శకుడిగా మారిన తరువాత మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవితో జాతర అనే సినిమా తెరకెక్కించారు.

Chiranjeevi: ఆ సినిమా విషయంలో దాసరి చిరంజీవి ని తీసేసి చంద్రమోహన్ నీ పెట్టమన్నారు… డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ఇక ఈ సినిమా తెరకెక్కే సమయంలో అందరూ కొత్తవాళ్ళే. ప్రొడ్యూసర్ నుంచి మొదలుకొని డైరెక్టర్, కెమెరా మెన్స్ అందరూ కూడా కొత్త వాళ్లే. ఇక ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంపిక చేశాను. అయితే గతంలో తన సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని హీరోగా చూపిస్తానని ఆయనకు మాటిచ్చాను. ఈ క్రమంలోనే జాతర సినిమాలో తనను హీరోగా తీసుకున్నానని తెలిపారు.

Chiranjeevi: ఆ సినిమా విషయంలో దాసరి చిరంజీవి ని తీసేసి చంద్రమోహన్ నీ పెట్టమన్నారు… డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ఇక ఈ సినిమాలో చిరంజీవిను తీసుకోవడం అందరికీ
ఇష్టమే అయితే దాసరి గారు వచ్చి అందరూ కొత్తవాళ్ళే చిరంజీవి కాకుండా వేరే హీరోను తీసుకోవచ్చు కదా అంటే తనకు సలహా ఇచ్చారు. ఆ సమయంలో నేను మాట్లాడుతూ అతని మొహంలో ఏదో ఫెయిర్ ఉంది. ఈ పాత్రకు కరెక్టుగా సరిపోతాడని నమ్మకం ఉందని చెప్పాను.ఏంట్రా నమ్మకం చిరంజీవిని తీసేసి చంద్రమోహన్ ని పెట్టుకో అంటూ చెప్పారు.

రంగస్థలం సినిమా కూడా అదే…

గురువుగారు అలా చెప్పినప్పటికీ జాతర సినిమాలో చిరంజీవి గారిని హీరోగా తీసుకుని సినిమా చేశామని ఈ సందర్భంగా ధవళ సత్యం జాతర సినిమా గురించి తెలిపారు.ఈ సినిమా రంగస్థలం సినిమా ఒకటే కాన్సెప్ట్ అని ప్రశ్నించగా… నిజం చెప్పాలంటే ఆ రెండు ఒకే కథ అంటూ ధవళ సత్యం ఈ సందర్భంగా తెలిపారు.