Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ధవళ సత్యం. ఈయన ఎంతో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈయన కూడా దాసరి శిష్యుడు. ఇలా దాసరి శిష్యుడుగా ఇండస్ట్రీలో కొనసాగిన ధవళ సత్యం దర్శకుడిగా మారిన తరువాత మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవితో జాతర అనే సినిమా తెరకెక్కించారు.
ఇక ఈ సినిమా తెరకెక్కే సమయంలో అందరూ కొత్తవాళ్ళే. ప్రొడ్యూసర్ నుంచి మొదలుకొని డైరెక్టర్, కెమెరా మెన్స్ అందరూ కూడా కొత్త వాళ్లే. ఇక ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంపిక చేశాను. అయితే గతంలో తన సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని హీరోగా చూపిస్తానని ఆయనకు మాటిచ్చాను. ఈ క్రమంలోనే జాతర సినిమాలో తనను హీరోగా తీసుకున్నానని తెలిపారు.
ఇక ఈ సినిమాలో చిరంజీవిను తీసుకోవడం అందరికీ
ఇష్టమే అయితే దాసరి గారు వచ్చి అందరూ కొత్తవాళ్ళే చిరంజీవి కాకుండా వేరే హీరోను తీసుకోవచ్చు కదా అంటే తనకు సలహా ఇచ్చారు. ఆ సమయంలో నేను మాట్లాడుతూ అతని మొహంలో ఏదో ఫెయిర్ ఉంది. ఈ పాత్రకు కరెక్టుగా సరిపోతాడని నమ్మకం ఉందని చెప్పాను.ఏంట్రా నమ్మకం చిరంజీవిని తీసేసి చంద్రమోహన్ ని పెట్టుకో అంటూ చెప్పారు.
గురువుగారు అలా చెప్పినప్పటికీ జాతర సినిమాలో చిరంజీవి గారిని హీరోగా తీసుకుని సినిమా చేశామని ఈ సందర్భంగా ధవళ సత్యం జాతర సినిమా గురించి తెలిపారు.ఈ సినిమా రంగస్థలం సినిమా ఒకటే కాన్సెప్ట్ అని ప్రశ్నించగా… నిజం చెప్పాలంటే ఆ రెండు ఒకే కథ అంటూ ధవళ సత్యం ఈ సందర్భంగా తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…