Mega Brothers: సినిమా ఇండస్ట్రీలో రీమేక్ చిత్రాల హవా గత కొంత కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. ఒక భాషలో హిట్ అయిన సినిమాల రీమేక్ హక్కులను కొనుగోలు చేసి ఇతర భాషలలో రీమేక్ చేయడం సర్వసాధారణం. ఇప్పటికే ఈ విధంగా ఎన్నో సినిమాలు రీమేక్ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకుంటున్నాయి.
ముఖ్యంగా మెగా బ్రదర్స్ రీమేక్ చిత్రాలలో ఎక్కువగా నటిస్తున్నారు.ఇలా రీమేక్ చిత్రాల్లో నటించి తెలుగులో కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఇతర హీరో అభిమానులు మెగా బ్రదర్స్ పై తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. మెగా బ్రదర్స్ రీమేక్ సినిమాలు తప్ప పూర్తిస్థాయి తెలుగు చిత్రాలలో నటించలేరా?అలా తెలుగు సినిమాలలో నటించే దమ్ము ధైర్యం మెగా హీరోలకు లేదా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ వరసగా రీమేక్ చిత్రాలు చేయడంతో కొందరు అభిమానులు ఈయనని పవర్ స్టార్ గా కాకుండా రీమేక్ స్టార్ గా పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే ఈ విధంగా మెగా బ్రదర్స్ రీమేక్ చిత్రాలలో నటించడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. తాజాగా మెగా స్టార్ నటించిన ఆచార్య సినిమా పూర్తిస్థాయి తెలుగు చిత్రమే.అయితే ఈ సినిమా తెరకెక్కిన తరువాత ఒక యువ దర్శకుడు వచ్చి ఈ సినిమా నాది నా సినిమాను కాపీ కొట్టారు అంటూ పెద్ద ఎత్తున వివాదం సృష్టించారు.
ఇలా తెలుగు సినిమాలలో నటిస్తే ఈ విధమైనటువంటి వివాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది కనుక వీరు పరభాషా చిత్రాలను ఎంపిక చేసుకొని ఆ సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ విధంగా ఒక భాషలో తెరకెక్కి సూపర్ హిట్ అందుకున్న సినిమాని తెలుగులో రీమేక్ చేయడం వల్ల పెద్ద ఎత్తున ప్రమోషన్ చేయడానికి అలాగే బిజినెస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎవరి నుంచి ఏ విధమైనటువంటి కాపీ అనే వివాదం రాదని అందుకే మెగా బ్రదర్స్ ఎక్కువగా రీమేక్ చిత్రాల వైపు మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తోంది.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…