Tag Archives: collector

Smitha Sabharwal: ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసిల్దార్.. ఏంతో చాక చక్యంగా నన్ను నేను రక్షించుకున్నా..: స్మితా సబర్వాల్

Smitha Sabharwal: ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన విధులను ఎంతో చాకచక్యంగా నిర్వర్తిస్తున్న స్మిత సబర్వాల్ గత రెండు రోజుల క్రితం ఒక డిప్యూటీ ఎమ్మార్వో నుంచి చేదు అనుభవం ఎదురైన విషయం మనకు తెలిసిందే.

అర్ధరాత్రి సమయంలో సదరు డిప్యూటీ తహసిల్దార్ కలెక్టర్ ఇంటికి చేరుకొని ఉద్యోగ నిమిత్తం ఇంటికి వచ్చాను అంటూ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇంటిలోకి ప్రవేశించారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఐఏఎస్ అధికారిని స్మిత చేసే ట్వీట్లకు ఈయన ఒక రెండు సార్లు రిప్లై ఇచ్చారట. అయితే తన స్నేహితుడితో కలిసి ఉద్యోగ పని నిమిత్తం ఐఏఎస్ అధికారిని ఇంట్లోకి చొరబడటంతో ఆమె ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తనని తాను రక్షించుకున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇలా రాత్రి సమయంలో డిప్యూటీ తహసిల్దార్ తన ఇంటి తలుపు తట్టి ఉద్యోగ పని నిమిత్తం మాట్లాడాలని చెప్పడంతో ఎవరు నువ్వు బయటకు వెళ్ళు అంటూ స్మిత గట్టిగా కేకలు వేయడంతో సెక్యూరిటీ వచ్చి తనని పట్టుకోవడం అలాగే పోలీసులు వచ్చి కూడా తనని అరెస్టు చేశారు. అలాగే తాను వచ్చిన కారును కూడా జప్తు చేసినట్లు తెలిపారు. అయితే ఈ ఘటన పై స్పందించిన ఐఏఎస్ అధికారిని స్మిత సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

Smitha Sabharwal: చాకచక్యంగా నన్ను నేను రక్షించుకున్నాను…

అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురయింది. ఒక వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారు. ఎంతో ధైర్యం చాకచక్యంతో నన్ను నేను రక్షించుకోగలిగాను. ఎంత భద్రత ఉన్నా మనల్ని మనం కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. రాత్రివేళ తలుపులు తాళాలను ఒకసారి పరిశీలించుకోవాలని, అత్యవసర స్థితిలో 100 కి డయల్ చేయాలి అంటూ ఈ సందర్భంగా ఈమె ఆ ఘటనపై చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Collector Marraige: ఆర్టీసీ బస్సులో పెళ్లి మండపానికి వెళ్ళిన కలెక్టర్..! సజ్జనార్ రియాక్షన్ ఇదే!

Collector Marraige: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాలి. వారిని చూసి చాలా మంది ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. దేశంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ చేతల ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు.

Collector Marraige: ఆర్టీసీ బస్సులో పెళ్లి మండపానికి వెళ్ళిన కలెక్టర్..! సజ్జనార్ రియాక్షన్ ఇదే!

ప్రజల మన్నన పొందుతున్నారు. ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో జాయిన్ చేయడంతో పాటు.. ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్నారు. ఇలా చేయడం ద్వారా.. ప్రభుత్వ సేవలపై ప్రజలకు మరింతగా అవగాహన, నమ్మకం పెరుగుతాయి. 

తెలంగాణాలోని ఓ జిల్లా కలెక్టర్‌ తన ప్రత్యేకతను చాటుకుని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన దంపతులు సురేశ్‌, నిర్మల తనయుడు మంద మకరంద్‌ ప్రస్తుతం నిజామాబాద్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా చేస్తున్నారు.

ఆర్టీసీ ఎండీ బాజిరెడ్డి గోవర్థన్..


కాగా అతని వివాహం కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సాయితేజితతో ఫిబ్రవరి 11న హైదరాబాద్‌ శివారులోని నార్సింగి వద్ద ఓం కన్వెన్షన్‌లో జరిగింది. అయితే ఓ కలెక్టర్ పెళ్లి అంటే.. భారీ కార్లు, హంగామా ఉంటుంది సాధారణంగా. అయితే మకరంద్ మాత్రం సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. కళ్యాణ మంటపానికి వరుడితో సహా అతని కుటుంబ సభ్యలు సిద్దిపేట ఆర్టీసీ బస్సులో చేరుకున్నారు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా కలెక్టర్ ను అభినందించారు. ఆర్టీసీ ఎండీ బాజిరెడ్డి గోవర్థన్ పెళ్లికి హాజరై ప్రశంసించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీపీ మహేశ్‌ భగవత్‌ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ వివాహానికి హాజరై కలెక్టర్‌ దంపతులను ఆశీర్వదించారు.

‘‘ఇంట్లో డబ్బులు లేవు.. ఎందుకు తాళం వేశావ్’’ అంటూ… కలెక్టర్ కు లేఖ రాసిన దొంగ..!

ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళ్తే తాళం వేసి పోవడం అనేది సహజం. చుట్టు పక్కల వవరూ గమనించకుండా ఉంటే.. ఏ దొంగ అయినా ఇంట్లో దొంగతనానికి వస్తాడు. ఇలా వచ్చి.. తాళం పగల కొట్టి ఇంట్లో విలువైన వస్తువలు లేదా డబ్బులు, నగలు పట్టుకొని వెళ్తాడు. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారి నివాసంలోకి చొరబడిన ఓ దొంగ..తాను ఊహించిన మొత్తంలో నగదు, ఆభరణాలు లభించకపోవడంతో నిరాశ చెందాడు.

దీంతో అక్కడ ఓ లేఖను రాసిపెట్టి వెళ్లాడు. ఆలేఖలో ఏముందో తెలుసా.. ఇంట్లో రూపాయి కూడా లేదు.. అలాంటి దానికి ఇంటికి తాళం ఎందుకు వేశావ్ అంటూ రాశాడు. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌కు స‌మీపంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌కు రెండున్న‌ర కిలోమీట‌ర్ల దూరంలోని సివిల్ లైన్స్‌లోని త్రిలోచ‌న్ గౌర్ బంగ్లాలో ఓ క‌లెక్ట‌ర్ నివాసం ఉంటున్నాడు.

అతడి ఇంట్లో కొద్ది రోజుల కిందట దొంగతనం జరిగింది. ఆ ఇంటిలో గత 15-20 రోజుల నుంచి లేరు. రూ. 30 వేలు, బంగారు ఆభ‌ర‌ణాలు దొంగల అపహరించారు. ఇక ఇంట్లో డ‌బ్బులు లేన‌ప్పుడు తాళం ఎందుకు వేయ‌డం.. క‌లెక్ట‌ర్ అని ఓ చిటీపై రాసి దొంగ‌లు వెళ్లిపోయారు. ఖాటేగావ్ ఎస్డీఎంగా విధులు నిర్వర్తిస్తున్న త్రిలోచన్ గౌర్.. రెండు రోజుల కిందట వచ్చిన ఆయన తన నివాసంలో దొంగతనం జరిగినట్టు గుర్తించారు.

ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి ఉండగా.. కొంత నగదు, వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అక్కడే అతడి ఓ లేఖ దొరికింది. అందులో ఇంట్లో డ‌బ్బులు లేక‌పోతే ఆ ఇంటికి తాళం ఎందుకు వేశావు? అని కలెక్టర్ ను ప్రశ్నించినట్లు రాసి ఉంది. దీనిని కూడా పోలీసులకు చూపించాడు కలెక్టర్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.