Smitha Sabharwal: ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన విధులను ఎంతో చాకచక్యంగా నిర్వర్తిస్తున్న స్మిత సబర్వాల్ గత రెండు రోజుల క్రితం ఒక డిప్యూటీ ఎమ్మార్వో నుంచి చేదు అనుభవం ఎదురైన విషయం మనకు తెలిసిందే.
అర్ధరాత్రి సమయంలో సదరు డిప్యూటీ తహసిల్దార్ కలెక్టర్ ఇంటికి చేరుకొని ఉద్యోగ నిమిత్తం ఇంటికి వచ్చాను అంటూ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇంటిలోకి ప్రవేశించారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఐఏఎస్ అధికారిని స్మిత చేసే ట్వీట్లకు ఈయన ఒక రెండు సార్లు రిప్లై ఇచ్చారట. అయితే తన స్నేహితుడితో కలిసి ఉద్యోగ పని నిమిత్తం ఐఏఎస్ అధికారిని ఇంట్లోకి చొరబడటంతో ఆమె ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తనని తాను రక్షించుకున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఇలా రాత్రి సమయంలో డిప్యూటీ తహసిల్దార్ తన ఇంటి తలుపు తట్టి ఉద్యోగ పని నిమిత్తం మాట్లాడాలని చెప్పడంతో ఎవరు నువ్వు బయటకు వెళ్ళు అంటూ స్మిత గట్టిగా కేకలు వేయడంతో సెక్యూరిటీ వచ్చి తనని పట్టుకోవడం అలాగే పోలీసులు వచ్చి కూడా తనని అరెస్టు చేశారు. అలాగే తాను వచ్చిన కారును కూడా జప్తు చేసినట్లు తెలిపారు. అయితే ఈ ఘటన పై స్పందించిన ఐఏఎస్ అధికారిని స్మిత సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురయింది. ఒక వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారు. ఎంతో ధైర్యం చాకచక్యంతో నన్ను నేను రక్షించుకోగలిగాను. ఎంత భద్రత ఉన్నా మనల్ని మనం కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. రాత్రివేళ తలుపులు తాళాలను ఒకసారి పరిశీలించుకోవాలని, అత్యవసర స్థితిలో 100 కి డయల్ చేయాలి అంటూ ఈ సందర్భంగా ఈమె ఆ ఘటనపై చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…