Shyla Shri: 1960 -70 కాలంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నటిమని షీలా శ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈమె తెలుగు, హిందీ, తమిళ కన్నడ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా నటిగా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి షీలా శ్రీ ప్రస్తుతం దీన పరిస్థితులలో ఉన్నారు. 1969 తెలుగులో భలే అబ్బాయిలు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె దాదాపు దశబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో ఓవెలుగు వెలిగారు.
ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి ఈమె ప్రముఖ నటుడు ఆర్. సుదర్శన్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఈయన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ 2017 వ సంవత్సరంలో మరణించారు. అప్పటినుంచి ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నటువంటి నటి షీలా తాజాగా క్యాన్సర్ బారిన పడినట్టు తెలుస్తుంది.
ఈమె క్యాన్సర్ బారిన పడ్డారనే విషయం తెలియగానే ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడానికి కూడా తన వద్ద సరైన డబ్బు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. క్యాన్సర్ కు చికిత్స తీసుకోవడం కోసం ఈమె బెంగుళూరులోని ఆర్ ఆర్ నగర్ లోని క్యాన్సర్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరినప్పటికీ చికిత్స కు మందులకు సరిపడ డబ్బులు లేక ఇబ్బంది పడుతోంది.
ఈ క్రమంలోనే కొందరు దాతలు ఈమెకు ఆర్థికంగా సహాయం చేయడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈమెకు క్యాన్సర్ చికిత్స కోసం మరెవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఎదురుచూస్తున్నారు అయితే ఈ దంపతులు తనకు ఆర్థిక సహాయం చేయడంతో నటి షీలా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ మధ్యకాలంలో వరుసగా సెలబ్రిటీలు క్యాన్సర్ బారినపడి సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకున్న అనంతరం ఈ వ్యాధి నుంచి బయటపడుతున్న సంగతి మనకు తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…