Tag Archives: constituency

Mohan Babu: రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు.. ఆ నియోజకవర్గ నుంచి పోటీ!

Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోయారు. గతంలో దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఈయన అహర్నిశలు కృషి చేస్తూ పార్టీకి తన సేవలను అందించారు.

ఈయన సేవలను గుర్తించిన అధిష్టానం ఈయనని ఏకంగా రాజ్యసభ సభ్యునిగా గెలిపించారు. అన్నగారి మరణం అనంతరం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు తన చేతిలోకి తీసుకోవడంతో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు.ఈ క్రమంలోనే తన పెద్ద కుమారుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు కుమార్తెను పెళ్లి చేసుకోవడంతో ఈయనతో బంధుత్వం ఏర్పడటమే కాకుండా వైయస్సార్ కి మద్దతుగా నిలబడ్డారు.

ఇక ప్రస్తుతం జగన్ స్థాపించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలిపిన మోహన్ బాబు గత కొద్దిరోజులుగా చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా ఉండటం వల్ల ఈయన తిరిగి రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తున్నారని, తిరిగి తెలుగుదేశం పార్టీకి తన మద్దతు తెలిపే సూచనలు ఉన్నాయంటూ పలువురు భావిస్తున్నారు. తిరుపతి సమీపంలో మోహన్ బాబు నిర్మించిన సాయిబాబా ఆలయ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మోహన్ బాబు కలిశారు.

Mohan Babu: జగన్ పై అసంతృప్తి కారణమా…

ఇలా వీరిద్దరి భేటీ కన్నా ముందుగా మోహన్ బాబు టిడిపి నేతలతో కలిసి మంతనాలు చేస్తున్నట్టు సమాచారం.ఇక సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం టిడిపి పార్టీ తరపున మోహన్ బాబు చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై ఈయన వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వైయస్ జగన్ వ్యవహరి శైలి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి ఈయన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారని వార్తలు వస్తున్నాయి.

పవన్ నియోజక వర్గం భీమవరంపై.. పూనమ్ హాట్ కామెంట్స్..!

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు చాలామంది అతడి వెన్నంటే ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అతడిపై టార్గెట్ చేసి మరీ మాటల బాంబులు పేలుస్తున్నారు కొంతమంది. 2019 ఎన్నికల ముందు వరకు కూడా ఇలానే అతడిపై వ్యక్తిగతంగా కూడా దూషణలకు దిగారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాయితేజ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్లో మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి.

రాజకీయంగా చాలామంది ఆ విషయాలపై మాట్లాడారు. ఇలా చాలాకాలం తర్వాత మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మళ్లీ మాటల యుద్ధాలు మొదలయ్యాయి. పోసాని అయితే ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు. వ్యక్తిగతంగా కూడా విమర్శలు గుప్పించాడు. దీనిపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే పోసాని పంజాబీ అమ్మాయి అని పూనమ్ కౌర్ ను పరోక్షకంగా ప్రస్తావించి.. ఆమెను మోసం చేశాడని పేర్కొనగా అది పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

అప్పటి నుంచి పూనమ్ కౌర్ పై పవన్ కి లింక్ పెట్టి కూడా పలు ట్రోల్స్ ఇప్పటికీ నడుస్తాయి. తాజాగా పూనమ్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూస్తే.. పవన్ కళ్యాణ్ వైపే పూనమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏం జరిగిందంటే.. ఇటీవల అంతర్జాతీయంగా రాజకీయాలపై ఓ సర్వే నిర్వహించారు. దానిలో ఏ రాష్ట్రంలో సిట్టింగ్ నేతలు ఆ పార్టీల పట్ల అసంతృప్తిగా ఉన్నారు అనే ప్రశ్న వేశాడు. దానికి సమాధానంగా ఆమె ఏపీ గట్టిగానే ఉంది అంటూ ట్వీట్ చేసింది.

దానికి పవన్ పోటీ చేసి ఓడిపోయిన భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని టాగ్ చేసింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె దీనిని ఏ కోణంలో ట్వీట్ చేశారో తెలియదు కానీ.. పవన్ అభిమానులు మాత్రం ఈ ట్వీట్ తో ప్రతి ఒక్కరికీ క్లారిటీ వచ్చినట్టేగా అని అంటున్నారు. ఈ ట్వీట్ తో పవన్ కు ఆమె సపోర్ట్ గా నిలిచిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.