Tag Archives: cooking oil

Good News: సామాన్యుడికి గుడ్ న్యూస్ ..! మరింత దిగిరానున్న వంట నూనెల ధరలు.. !

Edible Oil Prices: గత కొన్ని రోజులుగా సామాన్యుడికి వంటనూనెల రేట్లు చుక్కలు చూపెడుతున్నాయి. ఒక లీటర్ నూనె ప్యాకెట్ ధర వంద రూపాయలను మించి పోయింది. దీంతో నూనెల రేట్ల వల్ల సామాన్యుడు చాలా ఇబ్బందలు పడుతున్నాడు. దేశంలో నూనె గింజల సాగు, ఉత్పత్తి తక్కువగా ఉండటంతో పాటు పామాయిల్ ను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో.. నూనెల రేట్లు పెరుగుతున్నాయి. 

Good News: సామాన్యుడికి గుడ్ న్యూస్ ..! మరింత దిగిరానున్న వంట నూనెల ధరలు.. !

కాగా తాజాగా సామాన్య ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కేంద్రం వంట నూనెల దిగుమతి సుంకాలు తగ్గించడంతో.. ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. క్రూడాయిల్ పామాయిల్ దిగుమతిపై సుంకాలను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.

Good News: సామాన్యుడికి గుడ్ న్యూస్ ..! మరింత దిగిరానున్న వంట నూనెల ధరలు.. !

ఈ నిర్ణయం వల్ల ఇండియాలో పెరుగుతున్న వంట నూనెల ధరలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. కేంద్రం ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని 8.25 శాతం నుంచి 5.5శాతానికి తగ్గించింది. ఇక ముడివ పామాయిల్ పూ ప్రాథమిక కస్టమ్స్ సుంకం జీరో చేసింది.

క్రూడ్ ఆయిల్ పై తగ్గించిన సుంకాన్ని …

ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ నోటిఫికేషన్ ద్వారా అగ్రి ఇన్ ఫ్రా డెవలప్మెంట్ సెస్ ని ఫిబ్రవరి 13 నుంచి 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. క్రూడ్ ఆయిల్ పై తగ్గించిన సుంకాన్ని సెప్టెంబర్ 30 వరకు ఆరు నెలలు పాటు పొడగించినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక శుద్ది చేసిన పామ్ ఆయిల్ పూ ఇంపోర్ట్ డ్యూటీ 13.75 శాతంగా ఉంది. గత సంవత్సరం నుంచి వంట నూనెల ధరలు దేశంలో అధికంగా ఉన్నాయి. దీన్ని తగ్గించేందుకు దేశీయంగా లభ్యత పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం పలుమార్లు పామాయిల్ పై దిగుమతి సుంకాలను తగ్గించుకుంటూ వస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశీయ రిఫైనరీలు స్వాగతించాయి.

ఠారెత్తిస్తున్న టమాటా ధరలు.. కిలో రూ. 100..

గత కొన్ని రోజుల నుంచి నిత్యావసర వస్తువల ధరలు పెరుగుతున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా చుక్కలు కపడతున్నాయి. దీనికి తోడు వంట నూనె, గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ అయితే మాత్రం రెక్కలు వచ్చిన పక్షిలా ధరల విషయంలో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదిలా ఉంటే.. నిత్యావసర సరుకుల ధరలు ఎఫెక్ట్ ఇటు కూరగాయలపై కూడా పడింది.

అందులో ముఖ్యంగా టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. మొన్నటి వరకు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు పలికిన టమాటా ధరలు నేడు కిలో రూ. 100 కి విక్రయిస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో కిలో టమాట వందరూపాయలు పలికింది. ఇలా రికార్టు స్తాయిలో ధర పలకడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు.

ఆ రేట్లకు తాము ఏం కొనలేని పరిస్థితి ఏర్పడిందని.. ప్రభుత్వాలు ధరలను అదుపుచేయడంలో విఫలం అయ్యాయని విమర్శిస్తున్నారు. కర్టాటక సరిహద్దు నంచి తెచ్చిన టమాటాల్లో ఏ రకం కిలో రూ.60 నుంచి రూ. 100 పలికింది. బీ గ్రేడ్ రకం కిలో రూ.16 నుంచి రే. 58 రూపాయల వరకు ధర పలికింది.

ఇక మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు టమాటాలు ఎగుమతి అవుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కిలో టమాటా ఏకంగా రూ. 100 పలికింది. అయితే టామాటా పండించిన రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో తాము తీవ్రంగా నష్టపోయామని.. ప్రస్తతం లాభాలు వస్తున్నాయని వారు అంటున్నారు.

వేస్ట్ నుంచి బయో డీజిల్ తయారీ.. ఎక్కడో తెలుసా..?

శిలాజ ఇంధనాల నుంచే పెట్రోల్, డీజిల్ వంటి వాటిని తీస్తున్నారు. అయితే వాటికి అయ్యే ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో పాటే.. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దీని కారణంగానే కొన్ని సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్నొని.. ఇంధన ఉత్పత్తిపై దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగానే కొన్ని సంస్థలు బయో డీజిల్ ను ఉత్పత్తి చేశాయి. దీనిలో రామెన్‌ సూప్‌ బ్రాత్‌ తో బయో డీజిల్ తయారు చేయడానికి సిద్ధమవుతోంది. ఇది జపాన్ కు చెందిన సంస్థ. నిషిదా షౌన్‌ ట్రాన్స్‌పోర్టు సంస్థ ఈ తరహా ఏర్పాట్లు చేస్తోంది.

తినగా వదిలేసిన టొంకాట్సు రామెన్ సూప్ బ్రాత్ నుంచి బయో డీజిల్ ను తయారు చేస్తున్నారు. పునరుత్పాదక శక్తిగా ఈ రామెన్‌ సూప్‌ బ్రాత్‌ ఉపయోగపడుతుందని నిషిదా షౌన్‌ ట్రాన్స్‌పోర్టు సంస్థకు చెందిన మసూమి నిషిదా (74) గుర్తించారు. బ్రాత్ నుంచి సేకరించిన లార్డ్ ను, వంట నూనె నుంచి తీసేసిన వేస్ట్ ను కలిపి బయో డీజిల్ రూపొందిస్తున్నారట.

రామెన్‌ బ్రాత్‌ను పంది మాంసం ఎముకల నుంచి సేకరించేవారు. ఇప్పటివరకు 170 ట్రక్కుల డీజిల్ తయారీని ప్రారంభించింది. దీనిని వచ్చే నెలలో టెస్టింగ్ చేయనున్నారు. ఇలా లార్డ్ ను వేరు చేసే ఓ డివైజ్ ను వసూమి కొనుగొన్నారట. దానిలోని వేస్ట్‌ కుకింగ్‌ ఆయిల్‌ను కలపొచ్చట. తద్వారా బయో డీజిల్‌ సిద్ధం చేయొచ్చని మసూమి చెబుతున్నారు.

మొదట్లో దీనిలో కొన్ని మిస్టేక్స్ చాలా వచ్చాయన.. తర్వాత కొన్ని మార్పులు చేసుకుంటూ ఇప్పుడు తయారీకి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ బయో డీజిల్ కోసం రోజుకు 2000 రెస్టారెంట్ల నుంచి వేస్ట్ ను తీసుకొచ్చి.. మూడు వేల లీటర్లకుపైగా వేస్ట్‌ కుకింగ్‌ ఆయిల్‌, లార్డ్‌ను కొనుగోలు చేస్తున్నారట. దీని ద్వారా అతడి ప్లాంట్ లో బయో డీజిల్ ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇది విజయవంతం అయితే మాత్రం ఇలాంటివి చాలా ప్రయోగాలు ముందుకు రానున్నాయి.