Categories: FeaturedGeneral News

ఠారెత్తిస్తున్న టమాటా ధరలు.. కిలో రూ. 100..

గత కొన్ని రోజుల నుంచి నిత్యావసర వస్తువల ధరలు పెరుగుతున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా చుక్కలు కపడతున్నాయి. దీనికి తోడు వంట నూనె, గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ అయితే మాత్రం రెక్కలు వచ్చిన పక్షిలా ధరల విషయంలో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదిలా ఉంటే.. నిత్యావసర సరుకుల ధరలు ఎఫెక్ట్ ఇటు కూరగాయలపై కూడా పడింది.

అందులో ముఖ్యంగా టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. మొన్నటి వరకు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు పలికిన టమాటా ధరలు నేడు కిలో రూ. 100 కి విక్రయిస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో కిలో టమాట వందరూపాయలు పలికింది. ఇలా రికార్టు స్తాయిలో ధర పలకడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు.

ఆ రేట్లకు తాము ఏం కొనలేని పరిస్థితి ఏర్పడిందని.. ప్రభుత్వాలు ధరలను అదుపుచేయడంలో విఫలం అయ్యాయని విమర్శిస్తున్నారు. కర్టాటక సరిహద్దు నంచి తెచ్చిన టమాటాల్లో ఏ రకం కిలో రూ.60 నుంచి రూ. 100 పలికింది. బీ గ్రేడ్ రకం కిలో రూ.16 నుంచి రే. 58 రూపాయల వరకు ధర పలికింది.

ఇక మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు టమాటాలు ఎగుమతి అవుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కిలో టమాటా ఏకంగా రూ. 100 పలికింది. అయితే టామాటా పండించిన రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో తాము తీవ్రంగా నష్టపోయామని.. ప్రస్తతం లాభాలు వస్తున్నాయని వారు అంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago