శిలాజ ఇంధనాల నుంచే పెట్రోల్, డీజిల్ వంటి వాటిని తీస్తున్నారు. అయితే వాటికి అయ్యే ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో పాటే.. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దీని కారణంగానే కొన్ని సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్నొని.. ఇంధన ఉత్పత్తిపై దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగానే కొన్ని సంస్థలు బయో డీజిల్ ను ఉత్పత్తి చేశాయి. దీనిలో రామెన్ సూప్ బ్రాత్ తో బయో డీజిల్ తయారు చేయడానికి సిద్ధమవుతోంది. ఇది జపాన్ కు చెందిన సంస్థ. నిషిదా షౌన్ ట్రాన్స్‌పోర్టు సంస్థ ఈ తరహా ఏర్పాట్లు చేస్తోంది.
తినగా వదిలేసిన టొంకాట్సు రామెన్ సూప్ బ్రాత్ నుంచి బయో డీజిల్ ను తయారు చేస్తున్నారు. పునరుత్పాదక శక్తిగా ఈ రామెన్ సూప్ బ్రాత్ ఉపయోగపడుతుందని నిషిదా షౌన్ ట్రాన్స్‌పోర్టు సంస్థకు చెందిన మసూమి నిషిదా (74) గుర్తించారు. బ్రాత్ నుంచి సేకరించిన లార్డ్ ను, వంట నూనె నుంచి తీసేసిన వేస్ట్ ను కలిపి బయో డీజిల్ రూపొందిస్తున్నారట.
రామెన్ బ్రాత్‌ను పంది మాంసం ఎముకల నుంచి సేకరించేవారు. ఇప్పటివరకు 170 ట్రక్కుల డీజిల్ తయారీని ప్రారంభించింది. దీనిని వచ్చే నెలలో టెస్టింగ్ చేయనున్నారు. ఇలా లార్డ్ ను వేరు చేసే ఓ డివైజ్ ను వసూమి కొనుగొన్నారట. దానిలోని వేస్ట్ కుకింగ్ ఆయిల్‌ను కలపొచ్చట. తద్వారా బయో డీజిల్ సిద్ధం చేయొచ్చని మసూమి చెబుతున్నారు.
మొదట్లో దీనిలో కొన్ని మిస్టేక్స్ చాలా వచ్చాయన.. తర్వాత కొన్ని మార్పులు చేసుకుంటూ ఇప్పుడు తయారీకి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ బయో డీజిల్ కోసం రోజుకు 2000 రెస్టారెంట్ల నుంచి వేస్ట్ ను తీసుకొచ్చి.. మూడు వేల లీటర్లకుపైగా వేస్ట్ కుకింగ్ ఆయిల్, లార్డ్‌ను కొనుగోలు చేస్తున్నారట. దీని ద్వారా అతడి ప్లాంట్ లో బయో డీజిల్ ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇది విజయవంతం అయితే మాత్రం ఇలాంటివి చాలా ప్రయోగాలు ముందుకు రానున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…