Tag Archives: corona patients home

మీ ఇంట్లో కరోనా రోగులు ఉన్నారా.. అయితే ఇవి తప్పనిసరి!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న విపత్కర పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే మీ కుటుంబంలో ఎవరైనా కరోనా బారిన పడినట్టుయితే వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇక్కడ తెలుసుకుందాం. కరోనా వ్యాపించడానికి ప్రతి ఒక్కరు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మన ఇంట్లోనే ప్రత్యేకంగా ఒక గదిలో ఉండటం ద్వారా ఈ వైరస్ నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది సదుపాయం ఉండకపోవచ్చు.ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందవచ్చు.

పాటించాల్సిన పద్దతులు:
*కరోనా సోకిన వ్యక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు మొత్తం ఎల్లప్పుడు మాస్కు ధరించి ఉండాలి. ఎలాంటి పరిస్థితులలో కూడా మాస్క్ తొలగించకూడదు.

*కరోనా సోకిన వ్యక్తి ధరించిన బట్టలు ప్రత్యేకమైన క్రిమిసంహారక రసాయనాలతో ఉతకాలి. అతను ఉపయోగించిన వస్తువులను ఇతర కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితులలో ఉపయోగించకూడదు.

  • ఒకవేళ మన ఇంట్లో ప్రత్యేకమైన టాయిలెట్ లేకపోతే తరచూ టాయిలెట్ ను క్రిమిసంహారక మందులతో పిచికారీ చేస్తూ శుభ్రం చేస్తుండాలి.
  • కరోనా వ్యాపించిన వ్యక్తి వాడి పడేసిన వస్తువులను ఒక పసుపు రంగు బయో హజర్డాస్‌ బాక్స్‌లో వేయాలి.

చేయకూడని పనులు:

  • కరోనా బారిన పడిన వ్యక్తి గదిలోకి ఇతర కుటుంబ సభ్యులు నేరుగా ప్రవేశించకూడదు. ఎందుకంటే అతను నివశించే ఆ గది మొత్తం ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. దీని వల్ల వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది.
  • తరచూ చేతులను శానిటైజర్ చేస్తూ ఉండాలి. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడగాలి. ఎలాంటి పరిస్థితులలోనూ రోగి వాడి పడేసిన వస్తువులను చేతులతో తాకకూడదు.
  • కరోనా సోకిన వ్యక్తి ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడంటే ఇతర కుటుంబ సభ్యులు ఎవరు బయట వ్యక్తులతో కాంటాక్ట్ అవ్వకూడదు. ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించినప్పుడే వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉంటుంది.