Tag Archives: corona

ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులో నెగటివ్ వచ్చిందా… అయితే ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందే!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వల్ల ప్రతిరోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. అయితే సెకండ్ వేవ్ లో కరోనా కొత్త వేరియంట్లగా రూపాంతరం చెందటం వల్ల ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులలో వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ కాలేదు. దీంతో బాధితులకు పాజిటివ్ అని నిర్ధారణ చేయడం ఎంతో కష్టతరం అవుతుంది. పాజిటివ్ అని నిర్ధారణ కాకపోయినప్పటికీ వారిలో కరోనా లక్షణాలు ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పాజిటివ్ నిర్థారణ కాకపోతే తప్పకుండా ఇతర పరీక్షలు చేయించుకోవాలని,ఈ పరీక్షల ద్వారా వైరస్ వ్యాప్తి చెందినదా లేదా అనే విషయం తెలుస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ పరీక్షలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

డి-డైమర్ టెస్ట్: ఇది ఒక రక్త నమూనా పరీక్ష. ఈ పరీక్ష వల్ల మన శరీరంలో రక్తంలో ఎక్కడైనా ఉన్న బ్లడ్ క్లాట్ గురించి తెలియజేస్తుంది. దీని విలువ లీటర్ కు 0.5 కన్నా ఎక్కువగా ఉంటే కోవిడ్ గా అనుమానించాలి.

సిఆర్ పీ: దీన్నే సి రి-యాక్టివ్ ప్రోటీన్ అంటారు. ఇది లివర్‌లో తయారవుతుంది. శరీరంలో ఇన్‌ఫెక్షన్ ఉందని చెప్పడానికి ఈ టెస్ట్ చేస్తారు. ఈ టెస్టులో ఫ్లూయిడ్ శాతం100 ఎంజీ కన్నా ఎక్కువగా ఉంటే ఎంతో ప్రమాదకరం.

ఫెర్రీటిన్: ఈ టెస్ట్ ద్వారా వచ్చే ఫలితం 500కు మించి ఉంటే మన శరీరంలో ఎంతో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం.

ఇంటర్ లూకిన్-6: ఈ పరీక్ష ద్వారా మన చాతిలో ఇన్ఫెక్షన్ ఉన్నది, లేనిది తెలుస్తుంది. ఈ పరీక్ష ద్వారా మనం కరోనా బారిన పడ్డామా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులలో నెగెటివ్ అని నిర్ధారణ అయితే తప్పకుండా పై తెలిపిన పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల ద్వారా కరోనా పాజిటివ్ లేదా నెగిటివ్ అని నిర్ధారణ అవుతుంది.

వారికి అక్కడ బిర్యాని ఉచితం… ఎక్కడంటే?

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్రరూపం దాల్చడంతో ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.కొన్ని ప్రాంతాలలో ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కర్ఫ్యూ కూడా విధిస్తున్నారు. అనవసరంగా బయట తిరగటం వల్ల వైరస్ వ్యాప్తి ఉదృతం అవుతుంది. కనుక అనవసరంగా ఎవరూ బయటకు రాకుండా అందరూ ఇంట్లోనే ఉండి మహమ్మారిని కట్టడి చేయాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి.

this-coimbatore-woman-is-distributing-free-biryani-to-poor-people

కరోనా ప్రభావం వల్ల ఇంట్లోనే కూర్చుని ఉంటే ఎంతో మందికి పూట గడవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే ఉంటే కడుపు నిండక ఎంతోమంది పేదవారిలో ఆకలి చావు కేకలు వినిపిస్తాయని పలువురు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ మహిళ పేద వారి పట్ల తన మానవత్వం చాటుకుంది.కరోనా మహమ్మారి వల్ల బయటకు రాలేక తినడానికి తిండి లేక ఎంతో బాధపడుతున్న పేదవారికి ఉచితంగా బిర్యాని పంపిణీ చేస్తోంది.

ఈ విధంగా పేదవారికి ఉచితంగా బిర్యాని పంచుతూ పేద వారి పట్ల ఆమె చూపుతున్న మానవత్వాన్ని ఓ వ్యక్తి ఆమె ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఓ చెట్టుకింద చిన్న బండి పెట్టుకొని పేదలకు బిర్యానీ అందిస్తుంది. అదేవిధంగా ఆ బండి పక్కన ఒక బోర్డు కూడా పెట్టి ఉంది. అందులో “ఆకలిగా ఉందా? వచ్చి బిర్యాని తీసుకెళ్లండి”అంటూ రాసి ఉంది.

ఈవిధంగా పేదల పట్ల ఈమె చూపే అభిమానం చూస్తుంటే మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలి ఉందని ఆ వ్యక్తి ట్వీట్ చేయగా.. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఏదిఏమైనా ఈ భయంకరమైన మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వీలైనంతవరకు అన్ని జాగ్రత్తలను పాటిస్తూ, ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టాలని అధికారులు తెలియజేస్తున్నారు.

భారత్ లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ మృతి.. కానీ..?

భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ రెండు రోజుల క్రితం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌ కు చెందిన మహిపాల్ సింగ్ అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల తరువాత మృతి చెందాడు. వార్డ్ బాయ్ గా పని చేసే మహిపాల్ సింగ్ ఛాతీలో నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో మృతి చెందాడు. దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన తరువాత ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదట కరోనా వ్యాక్సిన్ ను ఇచ్చారు.

46 సంవత్సరాల వయస్సు ఉన్న మహిపాల్ సింగ్ శనివారం మధ్యాహ్నం కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. వ్యాక్సిన్ ను తీసుకున్న 24 గంటల తరువాత ఊపిరి ఆడకపోవడం వల్ల చనిపోయాడని మహిపాల్ సింగ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందే జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నాడని సమాచారం. శనివారం కరోనా వ్యాక్సిన్ ను తరువాత మహిపాల్ మరింత అనారోగ్యానికి గురయ్యాడని మహిపాల్ కుమారుడు విశాల్ తెలిపారు.

జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎంసీ గార్గ్ మాత్రం కరోనా వ్యాక్సిన్ వల్ల మహిపాల్ మృతి చెందాడని అనుకోవడం లేదని మహిపాల్ మృతికి మరేదైనా కారణం ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మహిపాల్ సింగ్ పోస్టుమార్టం రిపోర్ట్ లో అతను కార్డియో-పల్మనరీ డిసీజ్ వల్ల చనిపోయాడని వెల్లడైందని తెలిపారు. శనివారం రోజున యూపీ రాష్ట్రంలో 22,643 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని జనవరి 22వ తేదీన రెండో విడత టీకా పంపిణీ జరుగుతుందని అన్నారు.

మహిపాల్ కు గతంలో కరోనా వైరస్ సోకలేదని తెలుస్తోంది. పోస్ట్ మార్టం నివేదిక వెల్లడైనా అతని కుటుంబ సభ్యులు మాత్రం కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను మహిపాల్ సింగ్ తీసుకున్నారని సమాచారం.

జ్వరంతో బాధ పడేవారికి షాకింగ్ న్యూస్.. ఆ రెండు పరీక్షలు తప్పనిసరి..!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య తగ్గినా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి రావాల్సి ఉంది. ఎవరైనా కరోనాతో పాటు డెంగీ బారిన పడితే చికిత్స అందించడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో కేంద్రం తాజాగా మరోసారి మార్గదర్శకాలను విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి వెలువడిన నూతన మార్గదర్శకాల వల్ల ఇకపై జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరూ కరోనా, డెంగీ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కరోనా, డెంగీ బారిన పడినప్పటికీ చాలామందిలో ఆయా వ్యాధులకు సంబంధించిన లక్షణాలు కనిపించడం లేదు. దీంతో అధికారులు పరీక్షల ద్వారా మాత్రమే వ్యాధుల నిర్ధారణ సాధ్యమవుతుందని.. లేకపోతే ఆ వ్యాధుల వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని చెబుతున్నారు.

కరోనా, డెంగీ వ్యాధులకు చికిత్స లేకపోవడంతో లక్షణాల ఆధారంగా రోగులకు చికిత్స చేస్తున్నారు. జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికీ కరోనా, డెంగీ పరీక్షలు నిర్వహించాలని క్ 80 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదని తెలిసిందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా, డెంగీ రోగులకు వేర్వేరు చికిత్సా విధానాలు అమలులో ఉన్నాయని ఏ మాత్రం నిర్లక్ష్య్ం వహించినా రోగి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని.. ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకుంటూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆక్సిజన్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

కరోనా విషయంలో మరో శుభవార్త.. యాంటీబాడీలు ఎన్ని నెలలు ఉంటాయంటే..?

ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి గురించి వేర్వేరు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ద్వారా కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రజల్లో భయాందోళనకు తగ్గిస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా యాంటీబాడీల గురించి పరిశోధనలు చేసి కీలక ప్రకటన చేశారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ఏడు నెలలు యాంటీబాడీలు ఉంటాయని చెప్పారు.

పోర్చుగల్ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారిపై పరిశోధనలు చేసి 90 శాతం మందిలో ఏడు నెలలు యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. అయితే వయస్సుతో యాంటీబాడీలకు సంబంధం లేదని అందరిలోనూ ఒకే విధంగా యాంటీబాడీలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్ ఇమ్యునాలజీలో ఈ విషయాలను వెల్లడించారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ మాలిక్యులర్‌ పరిశోధకులు ఈ పరిశోధనలు చేశారు.

వైరస్‌ తీవ్రత ప్రభావాన్ని బట్టి యాంటీబాడీల ఉత్పత్తి జరుగుతోందని తాము గుర్తించామని పేర్కొన్నారు. ఏదైనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందని.. వైరస్ పై పోరాటానికి యాంటీబాడీలు దోహదపడతాయని పేర్కొన్నారు. 300 మంది బాధితులు, వైద్య సిబ్బంది, 200 కరోనా నుంచి కోలుకున్న వాలంటీర్లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.

కరోనా నుంచి కోలుకున్న మూడు వారాల తర్వాత యాంటీబాడీలు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే వేగంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని వెల్లడించారు.