Tag Archives: country

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

Rahul: దేశం కోసం మా కుటుంబం(నెహ్రూ కుటుంబం) ప్రాణ త్యాగాలు చేసిందని కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, మోదీకి కౌంటర్ ఇచ్చారు. మా కుటుంబ త్యాగాలకు ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు.

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

పార్లమెంట్లో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలకు రాహుల్ ను మీడియా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. తాను లేవనెత్తిన అంశాలపై కాకుండా ఇతర అంశాలు మాట్లాడుతూ, తన ప్రశ్నల నుంచి తప్పించుకున్నారని రాహుల్ పేర్కొన్నారు.

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

చైనా- పాక్ ఏకమవడం, రాజ్యాంగ ఉల్లంఘనలు, దేశంలో విభజన రాజకీయాలపై ప్రశ్నించినా సమాధానమే రాలేదన్నారు. రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డాడు.

తెలంగాణ నుంచి తొలి దళిత ముఖ్యమంతిగా..

మూడు గంటలకు పైగా ఆయన ప్రసంగంలో ఆ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ కుటుంబ పాలనే(గాంధీల కుటుంబం) కారణమని తిట్టిపోశారు. దేశంలో అత్యవసర పరిస్థితికి, సిక్కుల ఊచకోతకు కారణం కాంగ్రెస్సే కారణమని విమర్శించారు. గతంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బలహీనపరిచిందన్నారు. ఈ సందర్భంగా 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను తప్పుపట్టారు. సరైన చర్చ లేకుండా రాష్ర్టంను విడదీశారని ఆక్షేపించారు. పార్లమెంట్ తలుపులు మూసి అప్రజాస్వమిక పద్ధతుల్లో నాటి బిల్లును ఆమోదించారన్నారు. లోక్ సభలో పెప్పర్ స్ర్ప ఘటనలతో ఆనాడు హింస ఘటనలూ చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకోకపోవడంతో నాటి సమస్యలు రెండు తెలుగు రాష్ర్టలలో ఇంకా నలుగుతూనే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో నాటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బలహీనపరచారన్నారు. తెలంగాణ నుంచి తొలి దళిత ముఖ్యమంతి టి.అంజయ్య మరణాంతరం జరిగిన అవమానాన్ని మోదీ గుర్తుచేశారు. ఈ ఆరోపణలకు మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అంటే భయమని, అందుకు నిదర్శనమే ఈ ప్రసంగమని ఆరోపించారు. తాను లేవనెత్తిన అంశాలను పక్కదోవపట్టించారన్నారు. ఈ ప్రభుత్వ విధానాలతో చైనా – పాకిస్తాన్ దేశాలు ఒక్కటవుతున్నాయని ఇది దేశానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాం. అయినప్పటికీ విషయమై సమాధానమే రాలేదన్నారు. ఈ వైఖరికి దేశ భద్రతకు మంచిది కాదన్నారు. కొవిడ్ మొదటి దశలోనూ మోదీ ప్రభుత్వానికి పలు చేసామన్నారు. అయినా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీనో, నెహ్రూ కుటుంబాన్నో విమర్శించడం కాదు మీరు(మోదీ) దేశ రక్షణకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Omicron Virus: ఒమిక్రాన్ వైరస్ మనిషి శరీరంపై ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా..?

Omicron Virus: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో దేశవ్యాప్తంగా శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వేరియంట్ శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎన్నో కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వేరియంట్ మానవ శరీరంపై ఎన్ని గంటల పాటు సజీవంగా ఉంటుంది అనే విషయాలను నిపుణులు వెల్లడించారు.

ఒమిక్రాన్ వైరస్ మనిషి శరీరంపై ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా..?

ఓ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ వేరియంట్ పై పరిశోధనలు జరిపిన అనంతరం ఈ వైరస్ మానవ శరీరంపై సుమారు 21 గంటల పాటు సజీవంగా ఉంటుందని నిపుణులు తెలియజేశారు. అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువుల పై సుమారు ఎనిమిది గంటల పాటు ఈ వైరస్ సజీవంగా ఉంటుందని తెలిపారు.

ఒమిక్రాన్ వైరస్ మనిషి శరీరంపై ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా..?

ఇలా ఈ వైరస్ ఎక్కువ సమయం పాటు మనిషి శరీరంపై, వస్తువులపై సజీవంగా ఉండటం వల్ల ఈ వేరియంట్ శర వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమౌతుందని నిపుణులు వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

మాస్క్ తప్పని సరి..

ఇలా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఉపయోగించాలని వీలైనంతవరకు N-95 మాస్క్ వాడటం ఎంతో ప్రయోజనకరం. శానిటైజర్ ఉపయోగిస్తూ సామాజిక దూరం పాటించాలని, అప్పుడే ఈ వైరస్ ను అరికట్టగలమని నిపుణులు చెబుతున్నారు.