Tag Archives: crona virus

ఇండియాకు డెల్టా ప్లస్ ముప్పు తప్పదా..? తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే!

ప్రస్తుతం మన అందరి పరిస్థితి కరోనాకి ముందు కరోనా తరువాత అన్నట్టుగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలందరి జీవితాలను అతలాకుతలం చేసింది. ఈ క్రమంలోనే ఈ వైరస్ వివిధ వేరియంట్ ల రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. ఇప్పుడిప్పుడే డెల్టా వేరియంట్ నుంచి ఇండియా కోల్పోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న అధికారులకు డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో మరోసారి ఆందోళన కలిగిస్తోంది.

దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ రెండవదశ రూపంలో వ్యాప్తి చెంది ప్రజలందరి జీవితాలను ఉక్కిరి బిక్కిరి చేసింది.అయితే అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించి ఈ మహమ్మారిని అరికట్టడంతో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కేసులు తగ్గాయి అనుకుంటున్న క్రమంలోనే డెల్టా వేరియంట్ సరికొత్త రూపం దాల్చి డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో దేశంలో చాపకింద నీరులాగా పాకిపోతోంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కాగా, మరణాలు కూడా సంభవించాయి.ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినప్పటికీ ఈ వైరస్ వేరియంట్లను మార్చుకుంటూ ప్రజలపై పంజా విసురుతుంది. తాజాగా ఇండియాలో కొత్తగా 44,111 పాజిటివ్ కేసులు రాగా… మొత్తం కేసుల సంఖ్య 3,05,02,362కి చేరింది. దేశంలో కొత్తగా 738 మంది మరణించారు.మొత్తం మరణాల సంఖ్య 4,01,050కి చేరింది. మరణాల రేటు ఇండియాలో 1.3 శాతం ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.

కరోనా నెగిటివ్ వచ్చిన వాళ్లకు షాకింగ్ న్యూస్..?

గడిచిన ఏడు నెలలుగా శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అగ్ర రాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారి వల్ల గజగజా వణుకుతోంది. ప్రపంచ దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ మహమ్మారి గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకుని నెగిటివ్ వచ్చిన వాళ్లిన షాకింగ్ విషయాలను వెల్లడించారు.

కరోనా నుంచి వాళ్లలో కొందరు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లకు గురవుతున్నారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. వైరస్ బారిన పడి కోలుకున్న రోగుల్లో 7 నుంచి 8 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణ కరోనా రోగులతో పోల్చి చూస్తే వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్న రోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వెల్లడించారు.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లు గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల రక్తనాళాలు గడ్డ కట్టే సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తోందని కోలుకున్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కరోనా సోకి నెగిటివ్ వచ్చిన వాళ్లు మూడు నెలల పాటు యాంటీ కో ఆగ్యుగేషన్ మందులను వాడాలని సూచనలు చేస్తున్నారు. చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ను ఉపయోగిస్తే వాటి ఫాలో అప్ మందులను వాడాలని చెబుతున్నారు.

మెడిటేషన్, యోగా, వ్యాయామం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. పోషకాలతో కూడిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని.. యోగా, మెడిటేషన్ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ను తరచూ పరిశీలించుకుంటూ ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు.