Tag Archives: curry leaves

Curry Leaves Benifits: ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

Curry Leaves Benifits: సాధారణంగా ఆకుకూరలు కూరగాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి ఒక్క రకం ఆకుకూరలు ఒక్కో రకం పోషక విలువలు దాగి ఉంటాయి. ప్రతి వంటగదిలో కొత్తిమీర, కరివేపాకు తప్పనిసరిగా ఉంటాయి. వీటివల్ల ఆహారానికి మంచి సువాసన రుచి అందిస్తాయి. కరివేపాకు మనం తినే ఆహారంలో గత చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కర్వేపాకు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

Curry Leaves Benifits: ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

ప్రతిరోజు మనం చేసే వంటలలో కరివేపాకును ఖచ్చితంగా ఉపయోగిస్తుంటాం. కర్వేపాకు వేయటం వల్ల రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా కరివేపాకు వంటలలో వేసుకొని తినటమే కాకుండా పచ్చి కరివేపాకు తినటం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపునే పచ్చి కరివేపాకు తినటం లేదా జ్యూస్ చేసుకొని తాగటం వల్ల కాలేయాన్ని సంరక్షిస్తుంది.

Curry Leaves Benifits: ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

కరివేపాకు ప్రధానికి కొంచెం చక్కెర కలిపి ప్రతి రోజూ ఉదయం ఖాళీకడుపుతో తాగటం వల్ల వాంతులు, వికారం ,కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. కర్వేపాకు ప్రతిరోజు ఉదయం తినడం వల్ల శరీరంలో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడి అజీర్తి సమస్యలు తగ్గుతాయి.

చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు..

స్థూలకాయం సమస్యతో బాధపడే వారు కూడా ప్రతిరోజు పచ్చి కరివేపాకు తినటం ఎంతో శ్రేయస్కరం. కరివేపాకు ప్రతిరోజూ ఖాళీకడుపుతో తినటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి, శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కరివేపాకులు విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటిచూపు సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

ఉదయాన్నే కరివేపాకును తినడంతో.. ఆ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు!

మనం వండే వంటకాల్లో కరివేపాకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఎందుకంటే ఏ కూర తాలింపు వేసినా కరివేపాకు కచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి ప్రత్యేకత ఉంది కరివేపాకుకు. కరివేపాకు మొక్కను ఎక్కడ వేసినా నాటుకుంటుంది. ఆకుపచ్చని రంగులో ఉండే కరివేపాకు అందరికీ అందుబాటులోనే ఉంటుంది. అయితే కూరలో కరివేపాకు కనపడితే చాలామంది తీసి బయట వేస్తుంటారు. కానీ వాటివళ్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని కరివేపాకులను తింటే ఎంతో ఆరోగ్యం. ఇవి మన చర్మం, జుట్టు, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడగలవు. ఉదయం లేచి ఖాళీ కడుపుతో కొన్ని కరివేపాకు ఆకుల్ని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మొదట్లో చేదుగా అనిపిస్తుంది. తర్వాత అలవాటు అయిపోతుంది. కరివేపాకులో సాధారణంగా కార్బోహైడ్రేట్స్, పాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, అలాగే ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి.

ఇంకా దీనిలో విటమిన్ ఏ, బి, సి, ఈ లు కూడా అధికంగా ఉంటాయి. కరివేపాకుని రోజు తీసుకోవటం వలన జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా ఉంటుందో మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని బయటికి పంపిస్తుంది. కరివేపాకు ఎక్కడ వుంటే అక్కడ దోమలు మరియు క్రిమి కీటకాలు ఉండవు. కరివేపాకులో అతి ఎక్కువ ఐరన్ శాతం వుంది.

రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో ఐరన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇలా రోజూ 4 నుండి 5 కరివేపాకులు నేరుగా తినటం అలవాటు చేసుకోవటం వలన మధుమేహవ్యాధిని కొద్దివరకు నియంత్రించుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల జుట్టురాలడం కూడా ఆగతుంది. మలబద్దకంతో బాధపడే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కంటిచూపు, బరువు తగ్గాలనుకునే వారికి కూడా కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఆహారంలో ఇవి తప్పనిసరి?

ప్రతిరోజు వివిధ రకాల కూరల్లో వాడే కరివేపాకును చాలామంది సువాసన కోసమే అని భావించి తినకుండా పక్కన పడేస్తుంటారు. అది పొరపాటే! ఎందుకంటే కరివేపాకులో మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, క్యాల్షియం, పాస్ఫరస్‌, ఫైబర్ ,ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, బీటా కెరటిన్‌,మాంసకృత్తులు,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అలాగే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న కరివేపాకును ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్లభవిష్యత్తులో వచ్చే ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

కరివేపాకును ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకులో సమృద్ధిగా ఉన్న విటమిన్ ఎ కంటి సమస్యలను దూరంచేసి కంటిచూపును మెరుగు పరుస్తుంది.అలాగే జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.నీటిలో కరివేపాకును బాగా మరిగించి కాస్త నిమ్మరసం,చక్కెర కలిపి ‘టీ’ రూపంలో ప్రతిరోజు తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది. అలాగే శరీరంలో మలినాలు తొలగించి అతి బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.

కరివేపాకులో ఉన్న ఔషధగుణాలు క్లోమ గ్రంథిని ఉత్తేజపరిచి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగు పరుస్తుంది.దాంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి ప్రమాదకర డయాబెటీస్ వ్యాధి నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ పొందవచ్చు. కరివేపాకులో అధికంగా ఉన్న ఐరన్, ఫైబర్, ఫోలిక్‌యాసిడ్‌ ప్రమాదకర రక్తహీనత, కిడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యల,గుండె జబ్బులు వంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.