Tag Archives: Dalita Bandhu

తెలంగాణలో వెంటనే బిసి బంధు అమలు చేయాలి_ ఆర్.కృష్ణయ్య

తెలంగాణలో బిసి బంధు అమలు చేయాలన్నారు బిసి సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య. బిసి బంధు పై సీఎం కేసీఆర్ మౌనం వీడాలని అన్నారు. ఈ నెల 24న అన్ని జిల్లాలో సత్యాగ్రహ దీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ బిసి బంధు పై ప్రకటన చేయకుంటే రాష్ట్రమంతటా ధర్నాలు ర్యాలీలు చేపడతామని హెచ్చరించారు. దళిత బంధు ఇచ్చినపుడు బిసి బంధు ఎందుకు ఇవ్వరని డిమాండ్ చేశారు. హుజరాబాద్ లో అమలు చేస్తున్న దళిత బంధును రాష్ట్రమంతటా అమలు చేయాలని కృష్ణయ్య పేర్కొన్నారు.

కేసిఆర్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి!

సీఎం కేసిఆర్ కి ప్రశ్నలు సంధించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళితులకు సీఎం పదవి ఏమైందన్నారు రేవంత్ రెడ్డి. దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం కేసిఆర్ కొంగ జపం చేస్తున్నారని ఎద్దేవ చేశారు.

కాగా హుజూరాబాద్ ఎన్నికల కోసమే కేసిఆర్ దళిత బంధు అంటున్నారని రేవంత్ విమర్శించారు. ఇవాళ జరిగిన సభలో కేసిఆర్ ఒక్క నిజం కూడా చెప్పలేదని మండిపడ్డారు. మరియమ్మను పోలీస్ కస్టడీలో చంపేశారని.. దళితులకు కేసిఆర్ క్షమాపణలు చెప్పారని రేవంత్ డిమాండ్ చేశారు.

దళిత బంధు కోసల్లే ప్రోగ్రాం కాదు_ ఈటల రాజేందర్

తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా కొసల్లే ప్రోగ్రాం కాదన్నారు. టిఆర్ఎస్ నేతలు గెలవలేమని నిర్ధారణకు వచ్చి చిల్లర పనులకు ఒడిగడుతున్నరని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పథకాలన్నీ నా వల్లే వస్తున్నాయని.. నాకే ఓటేస్తామని హుజరాబాద్ ప్రజలు అంటున్నారని ఈటెల స్పష్టం చేశారు.

కాగా హుజురాబాద్ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు తీసుకొచ్చారని అన్నారు ఈటెల. కేసిఆర్ ఎప్పుడు ఓట్ల కోణంలోనే ఆలోచిస్తారని.. ప్రజల కోణంలో ఆలోచించరని ధ్వజ మెత్తారు. సొంత పార్టీ నేతలను వెలకట్టే నీచానికి కేసీఆర్ దిగజారారని అన్నారు. అక్రమ సంపాదన ప్రభుత్వ ధనంతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది తానేనని ఈటెల పేర్కొన్నారు.

హుజరాబాద్ లో దళిత బందు కోసం దళితుల ఆందోళన!

హుజురాబాద్ పెద్ద పాపయ్యపల్లి లో దళితుల రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి.. అనర్హులను దళిత బంధు కేటగిరిలో చేర్చారని నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి దళిత బంధు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా హుజరాబాద్ లోని పలు మండలాల్లో సైతం దళితులు ఇదే తరహాలో ఆందోళన చేపట్టారు. స్థానికులను కాదని ఇతరులను జాబితాలో చేర్చి దళిత బంద్ కు అర్హులుగా ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో సీఎం కేసిఆర్ సభ ఉన్న నేపథ్యంలో దళితుల ఆందోళన తో అధికారులు ఆందోళన చెందుతున్నారు.