Tag Archives: dead

Sreekanth: నేను చనిపోయినట్లు వార్తలు రాశారు… చాలా బాధేసింది… నటుడు శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్!

Sreekanth: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత కేవలం వారి చానల్స్, వెబ్ సైట్ వ్యూస్ కోసం పెద్ద ఎత్తున తప్పుడు వార్తలను రాస్తూ సెలబ్రిటీలను ఎంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇక చాలామంది బ్రతికున్న నటీనటులను కూడా చంపేస్తూ వార్తలు రాయడం చాలా బాధాకరం. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలను ఇలా చనిపోయారంటూ వార్తలు రాయగా చివరికి వారు స్పందించి మేము బ్రతికే ఉన్నాము అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది.

గత రెండు రోజుల క్రితం కోటా శ్రీనివాసరావు మరణించారని వార్తలు రావడంతో ఆయన షాక్ అవుతూ ఒక వీడియోని విడుదల చేసి నేను బ్రతికే ఉన్నానని చెప్పుకున్నారు.అయితే మార్చి 23వ తేదీ నటుడు శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీకాంత్ సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ఘాటుగా స్పందించారు.

కేవలం వ్యూస్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల పై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఈయన మండిపడ్డారు. గత కొద్ది రోజుల క్రితం తాను చనిపోయానంటూ వార్తలు రాశారు. ఆ విషయం తనని చాలా బాధ పెట్టిందని శ్రీకాంత్ తెలిపారు. ఇక ఇలాంటి వార్తలు కుటుంబ సభ్యులకు తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు ఏదైనా జరగరాని అనర్థాలు కూడా జరగవచ్చు. ఇలాంటివి ఆగాలి అంటే వార్తలు రాసేవారిలో మార్పు రావాలని తెలిపారు.

Sreekanth: ఇద్దరం కలిసే ఫంక్షన్లకు వెళ్తున్నాం…


ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన విడాకులు వార్తలపై కూడా స్పందించారు. నేను ఊహ విడాకులు తీసుకోబోతున్నామని వార్తలు రాశారు. అయితే ఈ వార్తలు వచ్చినప్పటి నుంచి ఊహకు ఇష్టం లేకపోయినా తనని బయట ఫంక్షన్లకు తనతో పాటే తీసుకు వెళుతున్నాను అంటూ ఈ సందర్భంగా శ్రీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు.. కానీ ఆ నవవధువు అనూహ్య రీతిలో దారుణంగా..!

జీవితంపై ఎన్నో ఆశలతో.. ఎంతో కలలు కని ఆమె అత్తారింట్లో అడుగుపెట్టింది. భర్తతో కలిసి జీవితాన్ని సంతోషంగా గడపాలని అనుకుంది. కానీ అనూహ్యంగా ఆమె విగతజీవిగా కనిపించింది. అసలు ఏం జరిగిందంటే.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఓ తండాకు చెందిన పీనాబాయి జుక్కల్‌ మండలం దోస్త్‌పల్లి తండాకు చెందిన వీరేశంతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. కానీ ఉన్నట్టుండి షీనబాయి మృతి చెందింది.

ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ప్రతీ ఒక్కరూ వివిధ రకాలుగా చెబుతున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆమె కుటుంబసభ్యులు మాత్రం ఆమెది హత్య అని ఆరోపిస్తున్నారు.

షీనాబాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అదనపు కట్నం కోసం తమ కూతురును విపరీతంగా చిత్రహింసలకు గురిచేసి చంపేశారని.. ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసమే అత్తింటి వారే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మృతురాలి కుటుంబ సబ్యులు, బంధువులు భారీగా జుక్కల్ పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. గ్రామంలోని ప్రతీ ఒక్కరు కూడా ఇది హత్యే అంటూ ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టు మార్టమ్ రిపోర్టు రాగానే నిజనిర్ధారణ చేసి నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

15 సెకన్లలో కరోనా వైరస్ ఖతం.. ఎలా అంటే…?

ప్రపంచ దేశాల ప్రజలను గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే సెకండ్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థవంతమైన వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తే తప్ప పరిస్థితులు అదుపులోకి రావని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు వైరస్, వ్యాక్సిన్ గురించి వేర్వేరు ప్రయోగాలు చేస్తున్నారు.

శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా కరోనాకు కొన్ని తాత్కాలిక పరిష్కార మార్గాలను చూపిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన నరసింహాచారి అనే యువశాస్త్రవేత్త ఎక్కువ తీక్షణతతో కూడిన అతినీలలోహిత కిరణాలను వెదజల్లే ఒక యంత్రాన్ని తయారు చేశారు. ఈ యంత్రం ప్రత్యేకత ఏమిటంటే కేవలం 15 సెకన్లలో కరోనా వైరస్ ను సులభంగా నిర్వీర్యం చేయగలదు. వస్తువులు, కూరగాయల ద్వారా కరోనా సోకకుండా ఈ యంత్రంతో నిర్వీర్యం చేయవచ్చని నరసింహాచారి చెబుతున్నారు.

తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సహాయసహకారాలతో నరసింహాచారి ఈ యంత్రాన్ని తయారు చేశారు. కరోనా వైరస్ తో పాటు ఇతర సూక్ష్మజీవులను సైతం ఈ యూవీ యంత్రంతో నిర్వీర్యం చేయొచ్చని నరసింహాచారి చెబుతున్నారు. కరోనా వైరస్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోయినా శాస్త్రవేత్తలు చేస్తున్న వినూత్న ప్రయోగాలు త్వరలోనే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో పెంచుతుండటం గమనార్హం.

మరోవైపు కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు జరగుతుండగా కొన్ని వ్యాక్సిన్లు వాలంటీర్లపై దుష్ప్రభావాలను చూపుతున్నాయి. దీంతో పలువురు శాస్త్రవేత్తలు సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టవచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.