Tag Archives: death mystery

Director Teja: ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయారో అందరికీ తెలుసు… నాటకాలు ఆడుతున్నారు: తేజ

Director Teja: సినీ దర్శకుడు తేజ ఎంతో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా తేజ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో ప్రేమకథ సినిమాలు ఇప్పటికీ చాలా కొత్తదనంగానే అనిపిస్తాయి. ఇలా తేజ డైరెక్షన్లో ఎన్నో ప్రేమకథ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఇక తాజాగా తేజ అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ ఉదయ్ కిరణ్ మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. ఇద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధము ఉంది అయితే ఉదయ్ కిరణ్ మరణం గురించి ఈయన మాట్లాడుతూ తన మరణించడం చాలా పాపం అంటూ తెలియజేశారు. ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ తనకు తెలుసని అయితే చనిపోయే లేపు ఆ విషయాన్ని బయటపెట్టి చనిపోతానని తేజ వెల్లడించారు.

Director Teja: ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయారో తెలుసు…


తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు ఉదయ్ కిరణ్ మరణం గురించి మరో ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు తేజ సమాధానం చెబుతూ ఉదయ్ కిరణ్ ఎలా మరణించారు అనే విషయం అందరికీ తెలుసు కానీ ప్రతి ఒక్కరు నాటకాలు ఆడుతున్నారని ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మరణం గురించి తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఒకప్పటి అందాల నటి దివ్యభారతి గుర్తుందా.. ఆమె చావు ఇప్పటికి మిస్టరినే?

దివ్యభారతి పేరు వినగానే ఆమె ఎలా మరణించిందనే వార్తే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఇంత వరకు ఆమె ఎలా చనిపోయారనే మిస్టరీని పోలీసులు ఛేదించలేదు. 1974 లో జన్మించిన ఆమె ఉత్తరాది నుండి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈమెను నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం ‘బొబ్బిలి రాజా’తో పరిచయం చేశారు.

ఈమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన ఆమే.. 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. ఈ సంవత్సరంలో వచ్చిన రెండు తెలుగు సినిమాలు ‘చిట్టెమ్మ మొగుడు’, ‘ధ‌ర్మ‌క్షేత్రం’ ఉన్నాయి.

ఆ త‌ర్వాత ఆమె అనేక సినిమాల‌కు సంత‌కం కూడా చేశారు. తర్వాత ఆమె ఓ సినిమా సెట్ దగ్గరకు వచ్చిన సాజిద్ ను చూసి.. ఆమె అప్పుడే ఇష్టపడింది. ఆ రోజు నుంచి ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకోవడం.. పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ విరిద్దరూ విభిన్నమైన మతాలకు చెందినవారు. సాజిద్ కెరీర్ లో అంతగా సెటిల్ కాలేదు. నిజానికి దివ్య మేజ‌ర్ అవ‌డం కోసం వారు ఎదురు చూశారు. ఆమెకు ప‌ద్దెనిమిదేళ్లు నిండ‌గానే మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలాను వివాహమాడింది.

సాజిద్ కోసం దివ్య ఇస్లాం మ‌తంలోకి మారి, త‌న పేరును స‌న న‌దియ‌డ్‌వాలాగా పేరు కూడా మార్చుకుంది. పెళ్ల‌య్యాక కూడా వారు దాన్ని సీక్రెట్‌గానే ఉంచారు. కానీ 1993 ఏప్రిల్ లో 19 ఏళ్ళ వయసులో ఆమె తను నివాసం ఉండే అపార్ట్‌మెంట్ 5వ ఫ్లోర్ ఫ్లాట్ నుంచి కింద‌ప‌డిపోయి ఆక‌స్మికంగా చనిపోయారు. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి. ఇలా ఆమె తమ పెళ్లికి సంబందించి సీక్రెట్ ను బయట పెట్టకుండానే చనిపోయారు. ఇక ఆమె చనిపోయాక తెలుగులో విడుదలైన చిత్రం 1993లో తొలిముద్దు.