దివ్యభారతి పేరు వినగానే ఆమె ఎలా మరణించిందనే వార్తే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఇంత వరకు ఆమె ఎలా చనిపోయారనే మిస్టరీని పోలీసులు ఛేదించలేదు. 1974 లో జన్మించిన ఆమె ఉత్తరాది నుండి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈమెను నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం ‘బొబ్బిలి రాజా’తో పరిచయం చేశారు.
ఈమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన ఆమే.. 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. ఈ సంవత్సరంలో వచ్చిన రెండు తెలుగు సినిమాలు ‘చిట్టెమ్మ మొగుడు’, ‘ధర్మక్షేత్రం’ ఉన్నాయి.
ఆ తర్వాత ఆమె అనేక సినిమాలకు సంతకం కూడా చేశారు. తర్వాత ఆమె ఓ సినిమా సెట్ దగ్గరకు వచ్చిన సాజిద్ ను చూసి.. ఆమె అప్పుడే ఇష్టపడింది. ఆ రోజు నుంచి ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకోవడం.. పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ విరిద్దరూ విభిన్నమైన మతాలకు చెందినవారు. సాజిద్ కెరీర్ లో అంతగా సెటిల్ కాలేదు. నిజానికి దివ్య మేజర్ అవడం కోసం వారు ఎదురు చూశారు. ఆమెకు పద్దెనిమిదేళ్లు నిండగానే మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలాను వివాహమాడింది.
సాజిద్ కోసం దివ్య ఇస్లాం మతంలోకి మారి, తన పేరును సన నదియడ్‌వాలాగా పేరు కూడా మార్చుకుంది. పెళ్లయ్యాక కూడా వారు దాన్ని సీక్రెట్‌గానే ఉంచారు. కానీ 1993 ఏప్రిల్ లో 19 ఏళ్ళ వయసులో ఆమె తను నివాసం ఉండే అపార్ట్‌మెంట్ 5వ ఫ్లోర్ ఫ్లాట్ నుంచి కిందపడిపోయి ఆకస్మికంగా చనిపోయారు. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి. ఇలా ఆమె తమ పెళ్లికి సంబందించి సీక్రెట్ ను బయట పెట్టకుండానే చనిపోయారు. ఇక ఆమె చనిపోయాక తెలుగులో విడుదలైన చిత్రం 1993లో తొలిముద్దు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…