తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. 570కు పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు.. విలన్ గా .. కామెడీ విలన్ గా .. హీరోగా విశ్వరూపం చూపించారు. విలక్షణ నటుడిగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. నిర్మాతగా అనేక చిత్రాలను నిర్మించి, వీలైనన్ని విజయాలను అందుకున్నారు. అంతేకాకుండా తన కుమారులు ఇద్దరినీ సినీ పరిశ్రమకు పరిచయం కూడా చేశారు.
మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా సోషల్ మీడియాల్లో తెగ యాక్టివ్ గా ఉంటారు. ఇదిలా ఉండగా.. మోహన్ బాబు తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో తన కెరియర్ గురించి ముచ్చటించారు. అతడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆ కార్యక్రమలో పంచుకున్నాడు. సినిమాల్లో నటించడానికి ఒక దారి దొరుకుతుందనే ఉద్దేశంతో నేను ఒకరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరానని.. అలా ఆరునెలలు పని చేసిన తరువాత జీతంగా రూ. 50 ఇచ్చారన్నారు.
అదేంటి ఇంత తక్కువ ఇస్తున్నారు అని అడిగితే.. టీలు, టిఫిన్ లు అన్నీ ఇక్కడే చేస్తున్నావ్ గా అని అన్నారట. దీంతో ఎంతో బాధకలిగిందని తన అనుభవాలను పంచుకున్నాడు. ఇక దీనిలోనే అలీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏ సినిమాలో అయినా విలన్ లేకుండా.. కమెడియన్ లేకుండా సినిమా ఉండదని.. అలా తీస్తే ఆ సినిమా హిట్ కావడం కష్టం అంటూ చెప్పాడు.
అయితే తన సినిమాల్లో అలీని కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో తీసుకున్నానని.. కానీ ఈ మధ్య అలీకి పొగరు ఎక్కువ అయింది .. అందుకే వద్దనుకున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పర్మినెంట్ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నప్పుడు రూ. లక్ష, రూ. రెండు లక్షల వద్ద బేరాలు ఆడకూడదని.. అందుకే అలీని కట్ చేయాల్సి వచ్చిందని గుర్తుచేశాడు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…