దేవుళ్లు మన కంటికి కనిపించరు.. కానీ మన కంటికి కనిపించే దేవుళ్లు మాత్రం డాక్టర్లు అంటారు పెద్దలు. కరోనా సమయంలో వారు దానిని నిరూపించారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడి తమ వైద్య వృత్తికి న్యాయం చేశారు. ఆ డాక్టర్ల యొక్క నిజ జీవితాలను మన కళ్ల ముందుంచే ప్రయత్నమే ‘డాక్టర్ సాబ్’ మూవీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్‌పై డి.ఎస్.బి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘డాక్టర్ సాబ్’ మూవీలో శోభన్ హీరోగా నటిస్తున్నాడు. నిత్యం డాక్టర్లు ఎదుర్కొనే ఇబ్బందులు, పరిస్థితుల నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. దీనికి అమ్మపండు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సనిమా గురించి ఎస్.పీ వివరాలను తెలియజేశారు.
తన స్నేహితుడు డి.ఎస్.బి ఈ కథను రెడీ చేశాడని.. స్క్రిప్ట్ బాగా కుదిరిందని తెలియజేశాడు. ఇటీవల ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా.. అనుకున్నది అనుకున్నట్లు తీశామని.. మరో షెడ్యూల్‌ను తర్వలోనే ప్లాన్ చేస్తామన్నారు. ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలను ఎంత వీలుంటే అత త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది తమ ప్రయత్నమన్నారు.
ఈ సినిమాలో ఫైట్స్, డ్యాన్స్ ల విషయంలో హీరో శోభన్ ఎక్కడా తగ్గలేదని.. ట్రైనింగ్ తీసుకొని మరీ కష్టపడి చేశాడని ప్రశంసించాడు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగోను రెండు నెలల క్రితం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అన్ని రకాల ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ గా ఎం మురళీకృష్ణ పనిచేస్తుండగా.. పాటలు నర్సింగరావు అందిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…