పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లా డాక్టర్ సాబ్.. ఇందులో ఎవరికీ న్యాయం చేస్తారో?

0
240

దేవుళ్లు మన కంటికి కనిపించరు.. కానీ మన కంటికి కనిపించే దేవుళ్లు మాత్రం డాక్టర్లు అంటారు పెద్దలు. కరోనా సమయంలో వారు దానిని నిరూపించారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడి తమ వైద్య వృత్తికి న్యాయం చేశారు. ఆ డాక్టర్ల యొక్క నిజ జీవితాలను మన కళ్ల ముందుంచే ప్రయత్నమే ‘డాక్టర్ సాబ్’ మూవీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్‌పై డి.ఎస్.బి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘డాక్టర్ సాబ్’ మూవీలో శోభన్ హీరోగా నటిస్తున్నాడు. నిత్యం డాక్టర్లు ఎదుర్కొనే ఇబ్బందులు, పరిస్థితుల నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. దీనికి అమ్మపండు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సనిమా గురించి ఎస్.పీ వివరాలను తెలియజేశారు.

తన స్నేహితుడు డి.ఎస్.బి ఈ కథను రెడీ చేశాడని.. స్క్రిప్ట్ బాగా కుదిరిందని తెలియజేశాడు. ఇటీవల ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా.. అనుకున్నది అనుకున్నట్లు తీశామని.. మరో షెడ్యూల్‌ను తర్వలోనే ప్లాన్ చేస్తామన్నారు. ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలను ఎంత వీలుంటే అత త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది తమ ప్రయత్నమన్నారు.

ఈ సినిమాలో ఫైట్స్, డ్యాన్స్ ల విషయంలో హీరో శోభన్ ఎక్కడా తగ్గలేదని.. ట్రైనింగ్ తీసుకొని మరీ కష్టపడి చేశాడని ప్రశంసించాడు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగోను రెండు నెలల క్రితం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అన్ని రకాల ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ గా ఎం మురళీకృష్ణ‌ పనిచేస్తుండగా.. పాటలు న‌ర్సింగ‌రావు అందిస్తున్నారు.