Tag Archives: devi nagavalli

Babu Gogineni: దేవి నాగవల్లి వర్సెస్ విశ్వక్ సేన్ ఇద్దరిలో తప్పెవరిది… ఎవరు క్షమాపణ చెప్పాలి: బాబు గోగినేని

Babu Gogineni: గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో యాంకర్ దేవీ నాగవల్లి, విశ్వక్ సేన్ వ్యవహారం తీవ్ర స్థాయిలో ముదురుతూ వస్తోంది. ఈ వ్యవహారంలో తప్పు ఎవరిది ఎవరు క్షమాపణ చెప్పాలి అనే విషయం గురించి పెద్ద ఎత్తున పలువురు స్పందిస్తూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కొందరు దేవి నాగవల్లికి మద్దతు తెలపడం మరికొందరు హీరో విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలబడ్డారు. అయితే ఈ వ్యవహారంపై మానవ హక్కుల సంఘం కార్యకర్త బాబు గోగినేని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘ పోస్ట్ చేస్తూ క్షమాపణ చెప్పాలి అనే విషయం వెల్లడించారు.

Babu Gogineni: దేవి నాగవల్లి వర్సెస్ విశ్వక్ సేన్ ఇద్దరిలో తప్పెవరిది… ఎవరు క్షమాపణ చెప్పాలి: బాబు గోగినేని

ఈ సందర్భంగా బాబు గోగినేని మాట్లాడుతూ… విశ్వక్ సేన్ యాంకర్ ను అనకూడని మాట అన్నారు. అయితే ఈ వీడియో మాత్రమే విడుదల అయింది.విశ్వక్ సేన్ ఆ మాట అనడానికి ముందు యాంకర్ ఎలాంటి మాటలు మాట్లాడరు అనే విషయం గురించి వీడియో లేదు.

Babu Gogineni: దేవి నాగవల్లి వర్సెస్ విశ్వక్ సేన్ ఇద్దరిలో తప్పెవరిది… ఎవరు క్షమాపణ చెప్పాలి: బాబు గోగినేని

విశ్వక్ సేన్ తన ఫ్రాంక్ వీడియో డిబేట్ లో దేవి నాగవల్లి ఆయనని పాగల్ సేన్, డిప్రెషడ్ అంటూ సంబోధించారు. ఇలా మాట్లాడటం ఇండియన్ మెంటల్ యాక్ట్ ను ఉల్లంఘించినట్లు. యాంకర్ అలా మాట్లాడటంతో పదేపదే విశ్వక్ సేన్ మాటలు అదుపులో ఉంచుకొని డిప్రెషడ్ గురించి మాట్లాడే హక్కు లేదని తెలియజేశాడు.

విశ్వక్ సేన్ మాటలు నచ్చలేదు యాంకర్ తనని స్టూడియో నుంచి బయటకు వెళ్ళమని అరిచారు. ఆ సమయంలో హీరో విశ్వక్ సేన్ F*** అనే అభ్యంతరకర పదాన్ని ఉపయోగించారు. అసలు ఆయనని డిబేట్ ఆహ్వానించింది టీవీ9 వాళ్ళు రమ్మని ఆయన మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతూ బయటికి వెళ్ళడం తప్పు.

ఇలా జరిగిన ఈ మొత్తం వ్యవహారాన్ని టీవీ9 డిలీట్ చేసింది. అయితే ఈ వ్యవహారం జరగడానికి కారణం దేవి నాగవల్లి తనని డిప్రెషడ్ గెటవుట్ అనటం వల్లే తలెత్తింది. ఇక దేవి నాగవల్లి విశ్వక్ అన్న మాటలకు క్షమాపణ కూడా చెప్పారు. ఇక గతంలో జరిగిన విషయం గురించి ప్రస్తావిస్తూ డీజే టిల్లు సమయంలో దేవి నాగవల్లి ‘మీరు ఉమనైజరా? అని ప్రశ్నించడం ఎంతవరకు సబబు.

జర్నలిజం అనలేం…

స్టూడియోలో విశ్వక్‌సేన్‌ విషయంలో దేవి నాగవల్లి చేసిన పనికి.. ఆమెకు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాలి. దాంతోపాటు ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రవర్తించినందుకు విశ్వక్ సేన్ కూడా సారీ చెప్పాలి. చివరికి దేవి నాగవల్లి చేసిన దాన్ని జర్నలిజం అనలేం అంటూ బాబు గోగినేని ఈ వ్యవహారంపై స్పందించారు.

RGV: “ఇలాంటి మహిళను చూడలేదు” విశ్వక్ సేన్, టీవీ యాంకర్ వీడియో పై వర్మ కామెంట్స్..

RGV: విశ్వక్ సేన్,రుక్సార్​ దిల్లాన్ హీరోహీరోయిన్లుగా, విద్యాసాగర్ చింత దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో విశ్వక్సేన్ ఒక ఫ్రాంక్ వీడియో చేసిన విషయం మనకు తెలిసిందే.

RGV: విశ్వక్ సేన్, టీవీ యాంకర్ వీడియో పై స్పందించిన వర్మ.. ఇలాంటి మహిళను చూడలేదంటూ కామెంట్!

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై ఏకంగా ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్ కూడా నిర్వహించారు. ఈ డిబేట్ లో భాగంగా హీరో విశ్వక్ సేన్, ప్రముఖ యాంకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది.

RGV: విశ్వక్ సేన్, టీవీ యాంకర్ వీడియో పై స్పందించిన వర్మ.. ఇలాంటి మహిళను చూడలేదంటూ కామెంట్!

ఇలా వీరిద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఏకంగా టీవీ యాంకర్ హీరో విశ్వక్ సేన్ ను స్టూడియో నుంచి బయటకు వెళ్లాలి అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ క్రమంలోనే ఈ వీడియోపై కాంట్రవర్సి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు.

సర్కార్ కన్నా తక్కువేం కాదు…

ట్విట్టర్ ద్వారా వర్మ స్పందిస్తూ… ఒక పురుషుడు కన్నా ఒక మహిళ పవర్ ఫుల్ గా కనిపించడం నేను ఇంతవరకు చూడలేదు. ఆమె సర్కార్ కన్నా తక్కువేం కాదని వర్మ ట్వీట్ చేస్తూ..ఈ ట్వీట్ ను సదరు టీవీ యాంకర్ కి ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విశ్వక్సేన్ ఈ విధమైనటువంటి ఫ్రాంక్ వీడియో చేయడంతో ఈయనపై అడ్వకేట్ అరుణ్ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. మరి విశ్వక్సేన్ ఈ ఫ్రాంక్ వీడియో ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.

Devi Nagavalli: నా భర్త చాలా మంచివాడు… విడాకులు ఇవ్వడానికి కారణం అదే…టీవీ9 దేవి నాగవల్లి షాకింగ్ కామెంట్స్!

Devi Nagavalli: టీవీ9 న్యూస్ రీడర్ గా అందరికీ హిందూ సుపరిచితమైన దేవి నాగవల్లి గురించి అందరికీ తెలిసిందే. న్యూస్ రీడర్ గా యాంకర్ గా అందరికీ సుపరిచితమైన ఈమె బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. అయితే ఈమె ముక్కుసూటితనం కారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది.

Devi Nagavalli: నా భర్త చాలా మంచివాడు… విడాకులు ఇవ్వడానికి కారణం అదే…టీవీ9 దేవి నాగవల్లి షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా జర్నలిజం అంటే ఎంతో మక్కువ వున్న దేవి నాగవల్లి అదే ఫీల్డులో ఎంతో అద్భుతంగా రాణిస్తున్న సమయంలో తన ఇంట్లో ఆమెను బలవంతం చేసి అమెరికా సంబంధం రావడంతో బలవంతంగా పెళ్లి చేశారు. అయితే పెళ్లయిన తర్వాత తనతో పాటు అమెరికా వెళ్లి అక్కడ తన కుటుంబంతో కలపడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను.

Devi Nagavalli: నా భర్త చాలా మంచివాడు… విడాకులు ఇవ్వడానికి కారణం అదే…టీవీ9 దేవి నాగవల్లి షాకింగ్ కామెంట్స్!

ఇక పెళ్లయిన వెంటనే బాబు కూడా పుట్టాడని ఇక్కడ బయట అందరిలో కలిసి తిరుగుతూ.. ఉండి తనకు అక్కడ కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావాలంటే అసలు నచ్చలేదు. మనిషి అమెరికాలో ఉన్న మనసు మాత్రం జర్నలిజం వైపు ఉండేది. అందుకే ఈ విషయాన్ని వారితో చెప్పి తిరిగి ఇండియా వచ్చేయాలని ఎన్నో సార్లు అనుకున్నాను.

నాకెంతో ఇష్టమైన జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నా…

అయితే పెళ్లి అయిన వెంటనే ఈ విషయాన్ని వారికి చెబితే ఎలా స్వాగతిస్తారు అని నాలో నేనే అధైర్య పడ్డాను. నా భర్త, ఆయన కుటుంబం చాలా మంచి వారు. ఇలా ప్రతిరోజు నాలో నేనే బాధపడుతూ ఉండగా ఒక రోజు ధైర్యం చేసి తనకు అక్కడ ఉండాలి అనిపించడంలేదు అనే విషయాన్ని తన భర్తతో చెబితే తన అభిప్రాయానికి గౌరవం ఇచ్చారు. అలా మా ఇద్దరి మధ్య మ్యూచువల్ డైవర్స్ తీసుకొని తిరిగి ఇండియాకి వచ్చానని తెలిపారు. విడాకులకు అప్లై చేసిన కేవలం ఆరు నెలల్లోనే విడాకులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇప్పుడు అతను వేరే పెళ్లి చేసుకుని అమెరికాలో హ్యాపీగా సెటిల్ అయ్యాడని తెలిపారు. నేను కూడా ఇండియా వచ్చిన తర్వాత తిరిగి నాకెంతో ఇష్టమైన ఈ జర్నలిజం ఫీల్డులో స్థిరపడ్డారని తెలియజేశారు.