Tag Archives: dharmavarapu subramanyam

Dharmavarapu Subramanyam: బ్రహ్మానందం గారు ఇంటికి రావడానికి నాన్న ఒప్పుకునే వారు కాదు: ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు

Dharmavarapu Subramanyam: సీనియర్ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్నో సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, కామెడియన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా సినిమాల ద్వారా ఇప్పటికీ మన మధ్య ఉన్నాడు. యజ్ఞం, ఆలస్యం అమృతం వంటి సినిమాలకు బెస్ట్ కమెడియన్ నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాల వల్ల 2013 శ్వాస విడిచాడు.

ఇదిలా ఉండగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో అతను మాట్లాడుతూ..” ఈరోజు మేము ఇంత ఆనందంగా జీవిస్తున్నామంటే అందుకు కారణం మా నాన్న. కొన్ని వందల సినిమాలలో నటించి ఆయన సంపాదించిన ఆస్తి వల్లే మేము ఈరోజు ఏ కష్టం లేకుండా ఆనందంగా బ్రతుకుతున్నాము.

2001 లో ‘నువ్వు నేనూ ‘ సినిమా సక్సెస్ పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో తలమీద 21 కుట్లు పడ్డాయి. అలా 2001లో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత నాన్నకి ఉన్న సిగరెట్ అలవాటు వల్ల 2005లో లంగ్స్ పాడయ్యి తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. ఆ సమయంలో పది రోజులపాటు ఆయన కోమాలో ఉన్నారు. ఆ తర్వాత డాక్టర్లు మెరుగైన చికిత్స అందించడంతో కోమా నుండి బయటపడి ఆరోగ్యంగా కోలుకున్నాడు. ఇలా రెండుసార్లు మృత్యులతో పోరాడి గెలిచిన ఆయన మూడవసారి ప్రాణాలు కోల్పోయాడు.

Dharmavarapu Subramanyam:

2012లో దీపావళి తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నాన్నను పరిశీలించిన డాక్టర్లు ఆయన 11 నెలల కంటే ఎక్కువ బ్రతకరని తెలిపారు. తాను ఎక్కువకాలం బ్రతకనని నాన్నకి కూడా తెలుసు. ఊపిరితిత్తుల క్యాన్సర్ చివరి దశకు చేరుకోవటంతో 2013 డిసెంబర్ 7వ తేదీన నాన్న మరణించారు” అంటూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు వెల్లడించాడు.ఆ సమయంలో బ్రహ్మానందం గారు నాన్నని చూడటానికి వస్తానని ఎన్నిసార్లు అడిగినా నాన్న నువ్వు నన్ను చూస్తే తట్టుకోలేవు వద్దు తనని రాణించేవారు కాదని ఈ సందర్భంగా రవి బ్రహ్మ తేజ తెలిపారు.

నా తండ్రి సహాయం పొంది.. ఇప్పుడు నన్నే అవమానిస్తున్నాడు : ధర్మవరపు సుబ్రమణ్యం కొడుకు

ఏ సినిమాలో అయినా అన్ని యాంగిల్స్ ఉండాలి. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, పాటలు అన్నీ బాగుంటేనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సినిమాలో ముఖ్యంగా కామెడీని ఎక్కువగా ఇష్టపడే వారు ఉన్నారు. ఇలా కమెడియన్ గా తమ కెరీర్ ప్రారంభించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు.

అందులో ముఖ్యంగా రేలంగి దగ్గర నుంచి బ్రహ్మానందం వరకు అందరూ ప్రేక్షకులను మెప్పించినవారే. అయితే డిఫరెంట్ స్లాంగ్ తో .. స్టైల్ తో కడుపుబ్బా నవ్వించిన ధర్మవరపు సుబ్రమణ్యం గురించి అందరికీ తెలిసిందే. అతడు ఈ మధ్య కాలంలో మరణించాడు. ఆ లోటును ఎవరూ పూడ్చలేనిది. అయితే ఇటీవల ధర్మవరపు సుబ్రమణ్యం కొడుకు రవితేజ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఇంకా ఎన్నో విషయాలను చెప్పాడు. అందులో ముఖ్యంగా వాళ్ల నాన్న దగ్గర పనిచేసే ఓ వ్యక్తి గురించి చెబుతూ ఎంతో ఆక్రోశించాడు. తనకు సినిమాలో హీరో అవ్వాలని ఉంది.. తనకు యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం.. నాకు మీ రిఫరెన్స్ కావాలని అడిగినప్పుడు అతడు చెప్పిన మాటలకు ఎంతో బాధపడ్డానని అన్నాడు. నీ యాక్టింగ్ గురించి నాకు తెలియనప్పుడు నేను రిఫరెన్స్ ఎలా ఇస్తాను అంటూ అవమానంగా మాట్లాడాడని చెప్పాడు.

దాంతో అతడు ఎంతగానో బాధపడ్డాడని అన్నారు. ధర్మవరపు సుబ్రమణ్యం బతికి ఉన్న సమయంలో అతడికి ఎంతో సహాయం చేశాడని.. సహాయం తీసుకొని ఇప్పుడు తాము ఎవరో అన్నట్లు మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకరి సహాయంతో ఎంత ఎత్తుకు ఎదిగినా.. తిరిగి సహాయం చేసిన వాళ్లను.. వాళ్ల ఫ్యామిలీని గుర్తుపెట్టుకోవాలి.. లేదంట అతడు మనిషే కాదు అంటూ తన మనస్సులో అనుకున్నట్లు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు రవితేజ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు

అవకాశాలు తగ్గడంతో ఆ పాత్రలలో కూడా చేశాడు సుత్తి వేలు!

సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎప్పుడూ సంతోషంగా, ధనవంతులు గా ఉంటారు అనుకోవడం పొరపాటేనని చెప్పాలి. ఎందుకంటే వాళ్లు ఎప్పుడు ఒకేలా ఉండరు. పైగా అవకాశాలు లేనప్పుడు మాత్రం వారి పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది. ఇలా ఎంతో మంది నటులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోగా.. ఒకప్పటి తెలుగు సినీ నటుడు సుత్తి వేలు కూడా అవకాశాలు తగ్గడంతో ఆయన పరిస్థితి కూడా మరింత దారుణంగా మారింది.

ఒకప్పటి తెలుగు సినీ హాస్య నటుడు సుత్తివేలు పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని హాస్యనటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్ లో నటించాడు. ఇక ఈయన దాదాపు రెండు వందలకు పైగా సినిమాలలో నటించాడు.

ఇక ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎంత కష్టపడినా ఫలితాన్ని అందుకోలేకపోయాడు. పైగా సినిమాలలో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో.. తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం బుల్లితెర సీరియల్స్ పై ఆధారపడ్డాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన కామెడీ సీరియల్ ఆనందో బ్రహ్మ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా పలు సీరియల్స్ లో కూడా నటించాడు.

ఇక ఆయన చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడటంతో బుల్లితెరలో అంత ప్రాధాన్యం లేని పాత్రలలో కూడా నటించాడు. ఇక చివరి వరకు ఇండస్ట్రీతోనే తన జీవనాన్ని సాగించాడు. 2012 సెప్టెంబర్ లో ఆరోగ్య సమస్యల వల్ల మరణించాడు. అప్పుడు ఆయన వయసు 66 ఏళ్లు ఉండగా చూడటానికి 70 ఏళ్లకు పైగా ఉన్న వాడిలా మారిపోయాడు. ఇక ఈయన మరణాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ కూడా తట్టుకోలేకపోయింది. ఇక ఇప్పటికీ ఈయన సినిమాలను ఒకప్పటి తెలుగు ప్రేక్షకులే కాకుండా ఈ తరం ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడుతుంటారు.