Tag Archives: Director Gopichand

Mokshagna -Balakrishna: ఘనంగా మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు.. వేడుకలలో పాల్గొన్న సినీ సెలబ్రిటీస్?

Mokshagna -Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు ఎన్టీఆర్ నుంచి మొదలుకొని హరికృష్ణ బాలకృష్ణ వంటి హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం వీరి వారసులుగా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా కొనసాగుతున్నారు.ఇకపోతే త్వరలోనే బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని గత కొన్ని సంవత్సరాల నుంచి వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే తాజాగా బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ 28వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పలుచోట్ల నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ కేక్ కట్ చేసే మోక్షజ్ఞ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. బాలయ్య తన నివాసంలో కుమారుడికి పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేయడంతో పెద్ద ఎత్తున సీనీ సెలెబ్రెటీలు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ క్రమంలోనే బాలయ్య తన కొడుకుకి కేక్ తినిపిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు బాలకృష్ణ ఇంటికి వెళ్లి తన కుమారుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్ర బృందం వేడుకలలో పాల్గొన్నారు.

 

Mokshagna -Balakrishna: ఈ ఏడాది పక్కా ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వనున్న మోక్షజ్ఞ..

ఇకపోతే ఈయన పుట్టినరోజు వేడుకలలో భాగంగావంటి ఇతర సెలబ్రిటీలు ఈ వేడుకలలో పాల్గొన్నట్టు తెలుస్తుంది.ఇక మోక్షజ్ఞ 28వ పుట్టినరోజు జరుపుకోవడంతో ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకపోవడం పట్ల అభిమానులలో కొంత పాటి నిరాశ ఉన్నప్పటికీ తప్పకుండా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఈ ఏడాది మాత్రం కచ్చితంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.