Tag Archives: earn money

Sitara Ghattamaneni: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తున్న సితార.. చాలా గ్రేట్ అంటూ?

Sitara Ghattamaneni: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి చిన్న వయసులోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సెలబ్రిటీ పిల్లల్లో సితార ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిట్టి పాపకు సోషల్ మీడియాలో హీరోయిన్స్ లో అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా మామూలుగా సెలబ్రిటీ పిల్లలు అంటే కాస్త స్టైలిష్ గా మోడల్ గా ఉంటారు. కానీ సితార మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. అంతేకాకుండా పండుగ సమయాలలో లంగా ఓణి వంటివి ధరించి ట్రెడిషనల్ లుక్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

4

అలా ఈమె చిన్న వయసులోనే తన మంచి మనసుతో ఎంతోమందికి సహాయం చేస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. మొన్నటికి మొన్న ఒక జ్యువెలరీ యాడ్స్ లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ యాడ్ కాను సితార దాదాపుగా కోటి రూపాయల వరకు పారితోషికాన్ని అందుకుంది. ఇకపోతే ఇటీవల కాలంలో సితారకు సంబంధించిన ఏదో ఒక విషయం తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. మరి ముఖ్యంగా సితార తరచూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. అలా చిన్న ఏజ్ లోనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. తండ్రి మహేష్ బాబు బాటలోనే నడుస్తూ కొన్ని మంచి పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతోంది సితార.

లక్షల్లో సంపాదన..

చదువుతో పాటు మరో పక్క మన కల్చరల్ కి సంబంధించినవి అన్ని నేర్చుకుంటూ ఉంటుంది. ఈమె సింప్లిసిటీకి ప్రతి ఒక్కరూ కూడా ఫిదా అవ్వాల్సిందే. కాగా సితార యూట్యూబ్ ఛానల్ ద్వారా తన డాన్స్ వీడియోలతో పాటు తనకు సంబంధించిన అన్ని వీడియోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక కేవలం యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే కాకుండా ఇంస్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక యూట్యూబ్ లో, ఇంస్టాగ్రామ్ లో సితార ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగానే ఉందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా సితార తన ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ప్రమోషనల్ వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సితార నెల సంపాదన గురించి ఒక వార్త వైరల్ గా మారింది. సితార ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు సుమారుగా 30 లక్షల వరకు సంపాదిస్తోందట. ఈ వార్త వైరల్ అవ్వడంతో అభిమానులు నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఏంటి ఇంత చిన్న వయసులో కేవలం ఇంస్టాగ్రామ్ ద్వారా అన్ని లక్షలు సంపాదిస్తుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Nagashaurya: నాగశౌర్య కంటే రెండు రెట్లు అధికంగా సంపాదిస్తున్న అనూష శెట్టి.. నెల ఆదాయం ఎంతో తెలుసా?

Nagashaurya: సినీ నటుడు నాగశౌర్య ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా ప్రేక్షకులకు వచ్చారు అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ తరువాత వచ్చినటువంటి చలో సినిమా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయనకు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి.

ఇలా నాగశౌర్య ఏడాదికి ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఈయనకు మాత్రం సరైన స్థాయిలో సక్సెస్ అందలేకపోతుందని చెప్పాలి ఇప్పటివరకు ఈయన నటించిన సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమాలు పెద్దగా లేవు. ఇకపోతే నాగశౌర్య గత ఏడాది నవంబర్ నెలలో అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

అనూష శెట్టి బెంగుళూరుకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈమె బెంగళూరులో మాత్రమే కాకుండా హైదరాబాద్ లో కూడా ఎంతో పెద్దపెద్ద రెస్టారెంట్లతో పాటు ప్రముఖల ఇంటికి డిజైనర్ గా పనిచేస్తూ వచ్చారు. ఇలా క్షణం పాటు తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతూ ఉంటారు అంటూ ఇటీవల నాగశౌర్య తల్లి ఉష వెల్లడించిన సంగతి తెలిసిందే.

నెలకు 30 లక్షలు…

తాజాగా అనూష శెట్టి నెల ఆదాయం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె నెలకు ఎంత మొత్తంలో సంపాదిస్తారనే విషయం గురించి ఈ వార్త వైరల్ గా మారింది. అయితే ఈమె నాగశౌర్య కంటే ఏడాదికి రెండింతల ఆదాయం సంపాదిస్తుందని చెప్పాలి. నాగశౌర్య ఒక సినిమా చేస్తే దాదాపు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అయితే అనూష శెట్టి నెలకు 30 లక్షల వరకు ఆదాయం అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా ఈమె సంపాదన గురించి ఈ వార్త వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Kriti Shetty: ఇండస్ట్రీలోకి రాకముందే కృతి శెట్టి అలాంటి పనులు చేసేదా… అమ్మడు తెలివితేటలు మామూలుగా లేవుగా?

Kriti Shetty: అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టారు నటి కృతి శెట్టి. ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక మొదటి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

ఈ సినిమా తర్వాత కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలలో నటించే వరుస సక్సెస్ లు అందుకున్నారు. అయితే ఈమె తదుపరి నటించిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. ఇలా వరుస నాలుగు సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈమె కెరియర్ కాస్త ఇబ్బందులలో పడిందని చెప్పాలి.

ఈమె తక్షణమే ఒక హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకుంటేనే తనకు ఇండస్ట్రీలో మనుగడ ఉంటుందని లేకపోతే ఇండస్ట్రీలో కొనసాగడం కష్టతరం అవుతుందని పలువురు భావిస్తున్నారు.ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు అన్న విషయం గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kriti Shetty: యాడ్స్ చేస్తూ డబ్బు సంపాదించేవారు…


ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి పెద్ద ఎత్తున డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. ఈమె ఎన్నో యాడ్స్ చేస్తూ భారీగా డబ్బు సంపాదించారని తెలుస్తుంది. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. ఇలా పలు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూనే హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తూ ఉప్పెన సినిమా ద్వారా అవకాశం అందుకున్నారు.ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

Priya Bhavani Shankar: డబ్బు సంపాదించడానికే ఇండస్ట్రీలోకి వచ్చాను… తప్పేముంది… నటి కామెంట్స్ వైరల్!

Priya Bhavani Shankar: మనం ఏ పని చేసి కష్టపడిన అది కేవలం డబ్బు సంపాదించడానికి అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ బయటకు మాత్రం డబ్బుపై వ్యామోహంతో ఈ పని చేయలేదని కేవలం ప్రజాసేవ కోసమో లేదా తన పరపతి పెంచుకోవడం కోసమో ఇలా పనులు చేస్తున్నామని బయటకు చెప్పిన లోపల మాత్రం డబ్బు కోసమే పనులు చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే.

ఇలా డబ్బు కోసం పని చేసే వాటిలో సినిమాలు కూడా ఒకటి.డబ్బు కోసమే సినిమాలు చేస్తూ పెద్ద ఎత్తున బిజినెస్ లు చేస్తూ ఉంటారు. ఇక నటీనటులు కూడా సినిమాలు చేస్తూ డబ్బును సంపాదిస్తూ ఉంటారు. సినిమాలలోకి వచ్చినవారు పొరపాటున డబ్బు కోసమే ఇండస్ట్రీలోకి వచ్చామని చెబితే అదేదో పెద్ద తప్పు అన్నట్టు భావిస్తారు. ప్రస్తుతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పడంతో నటి ప్రియా భవాని శంకర్ ను పెద్ద ఎత్తున తప్పు పడుతున్నారు.

ఈమె చేసిన ఈ వ్యాఖ్యలపై కొన్ని మీడియా సంస్థలు నెగిటివ్ గా ప్రచారం చేయడంతో అసహనం వ్యక్తం చేసిన నటి ప్రియా భవాని శంకర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఎక్కువగా డబ్బు సంపాదించడానికి ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పడంలో తప్పేముంది? అందరూ డబ్బు కోసమే పని చేస్తున్నారు ఏం మీరు డబ్బు కోసం కాదా పనిచేస్తున్నది అంటూ ఈమె ప్రశ్నించారు.

Priya Bhavani Shankar: మీరు డబ్బు కోసం పని చేయడం లేదా…


యాక్టర్స్ డబ్బు గురించి మాట్లాడితే ఎందుకని అది ఏదో పెద్ద తప్పుగా భావిస్తారు నేనేదో నా పని చేసుకొని పోతుంటే కొన్ని పేరు మోసిన మీడియా సంస్థలు కూడా ఇది తప్పు అని చిత్రీకరించడం చాలా బాధాకరం. అంటూ ఈమె ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు.బుల్లితెర నటిగా తన ప్రయాణం మొదలు పెట్టిన ప్రియా భవాని శంకర్ అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకునే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈమె తెలుగులో రీసెట్ గా కళ్యాణం కమనీయం అనే సినిమాతో తెలుగు హీరోయిన్ గా డెబ్యూ చేశారు.

Income Plan: రూ.165 పొదుపు చేస్తే..! రూ.11 లక్షలు సొంతం చేసుకోవచ్చు..!

Income Plan: భవిష్యత్ అవసరాల కోసం చాలా మంది డబ్బులను పొదుపు చేసుకోవాలని అనుకుంటుంటారు. కొంతమంది ఆ డబ్బులను ఇన్వెస్ట్ మెంట్ రూపంలో బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే.. మరికొంత మంది వాటిని ఫ్లాట్ లేదా.. భూమి కొనుగోలులో పెడుతుంటారు.

అయితే ఏది ఏమైనా.. దేనిలో ఎన్వెస్ట్ చేసినా రిస్క్ అనేది ఉంటుంది. అయితే బ్యాంక్ లో డిపాజిట్ కు ఎలాంటి రిస్క్ లేకపోయినా.. వడ్డీ అనేది చాలా తక్కువగా వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు పొందాలనుకున్నే వారికి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..

మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిలో సిప్ రూపంలో డబ్బులను డిపాజిట్ చేయవచ్చు. దీంతో మనం ఊహించని రీతిలో లాభాలను పొందొచ్చు. ఉదాహరణకు దీనిలో రోజుకు రూ.165 ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్ల తర్వాత దాదాపు రూ.11లక్షల వరకు రిటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది.

రిస్క్ కు సిద్ధపడి డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని..


దీనిలో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు 12 శాతం నుంచి 20 శాతం వరకు రాబడి లభిస్తుంది. ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి పొందే మొత్తంలో మార్పులు ఉంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. దీనిలో ఇన్వెస్ట్ చేసే ముందు.. ఆ ఫండ్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో చేరాలంటే కనీసం రూ.500 లతో చేరవచ్చు. దీనిలో చేరే వారు ఈక్విటీ ఫండ్స్ ను ఎంచుకుంటే మంచిదని చెబతున్నారు. రిస్క్ కు సిద్ధపడి డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకుంటే మంచిదని నిపుణుల సూచన. ఆసక్తి ఉన్నవాళ్లు సమీప బ్యాంక్ బ్రాంచ్ లేదా ఏజెంట్లను సంప్రదిస్తూ పూర్తి వివరాలను వెల్లడిస్తారు.

Viral News: అడుక్కునే వారి ఆదాయం రోజుకు రూ. 16 వేలు.. ఏందయ్యా ఇది..?

Viral News: వాళ్లకు గంటకు రెండు వేల ఆదాయం. సాఫ్ట్ వేర్ ఎంప్లాయి లేదా .. ఫారెన్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నారా.. లేదా ఏదైనా పెద్ద కోటీశ్వరులు అనుకుంటుంన్నారా.. అస్సలు కానే కాదు. వాళ్లు ఇంటింటికి తిరిగి అడుకునే వాళ్లు.

అవును మీరు విన్నది నిజమే అడుకునే వాళ్లకు గంటకు రూ.2వేలు సంపాదిస్తున్నారు. ఈ మేరకు చూసుకుంటే.. 8 గంటల్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి దాదాపు రూ.16 వేలు రోజుకు సంపాదన. నెలకు దాదాపు రూ. 4.80లక్షలు. వామ్మో ఇదేందయ్యా ఇది.. సంవత్సరానికి వాళ్లకు రూ.60 లక్షలా.. అసలేంటి ఈ కథ. పూర్తి వివరాల్లోకి వెళ్తి తెలుసుకుందాం..

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కల్వల దిన్న (గంటవారి గూడెం) గ్రామంలో ఇద్దరు అడక్కునే వాళ్లు వచ్చారు. మామూలుగా అమ్మ బిచ్చం వెయ్యి అనే వాళ్లు కాదు.. చేతిలో పెద్ద తాడు.. ఆయనకు ఆయనే కొట్టుకుంటాడు. ఒంటినిండా రక్తపు గాట్లు.. పక్కనే డమ్ముతో వాయిస్తూ భార్య.. ఇలా ఇంటి ముందుకు వస్తే.. చాలు వాళ్ల పాటలతో చిరాకు పెట్టిస్తారు. వాళ్లను చూస్తే చిన్న పిల్లలు అయితే.. భయపడిపోతారు.

వాళ్లు అడిగినంత ఇవ్వకపోతే అంతే ఇక.. చుట్టుపక్కల వాళ్లు బిచ్చం వెయ్యడానికి ఎందుకు అంత.. ఎంతో కొంత ఇవ్వోచ్చు కదా అనే మాటలు మాట్లాడుతారు. ఇదంతా ఎందుకని.. ఎంతో కొంత ఇద్దామనుకుంటే పప్పులో కాలేసినట్లే.

ప్రతీ ఇంటికి రూ.50 డిమాండ్..


వాళ్లు డిమాండ్ ఇంటికి దాదాపు రూ. 50 ఇవ్వాల్సిదే. లేదంటూ నానా యాగీ చేసేస్తారు. ఆ ఇళ్లు అయిపోయిన తర్వాత పక్కిళ్లు. ఇలా వాళ్లు ఆ గ్రామంలో వాళ్ల రాకను కనిపెట్టి .. వాళ్లతో ఇబ్బంది ఎందుకులే అనుకొని.. ఇలా ఇంటికి రూ.50 చొప్పున ఇచ్చుకుంటూ వెళ్లారు. అక్కడే ఉన్న కొంత మంది యువకులు వాళ్లను గంట సేపు గమనించారు. తర్వాత వాళ్ల దగ్గరకు వెళ్లి.. ఎంత వసూలు అయినయో అడిగారు. గంటలో రూ. 2వేలు వచ్చాయి సార్ అని అన్నారు. దీంతో వాళ్లు అవాక్కయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలీకి వెళ్తే.. రూ.500 రాని ఈ రోజుల్లో ఇలా అడుక్కుంటూ రోజుకు రూ.16 వేలు సంపాదించడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

నెలకు లక్ష రూపాయలు సంపాదించే బిజినెస్ ఐడియా.. ఏం చేయాలంటే..?

దేశంలో యువత, నిరుద్యోగులు ఉద్యోగంతో పోలిస్తే బిజినెస్ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. యువత, నిరుద్యోగుల ఆలోచనలకు అనుగుణంగానే కొన్ని వ్యాపారాలు కళ్లు చెదిరే లాభాలను అందిస్తున్నాయి. అయితే కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టే వ్యాపారాల్లో కూడా కొన్నిసార్లు లాభాలు కొన్నిసార్లు నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

అందువల్ల ఇప్పటికే మంచి లాభాలను ఇస్తున్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే సులభంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. బనానా చిప్స్ బిజినెస్ ద్వారా నెలకు సులభంగా లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది. సాధారణంగా కొన్ని చిప్స్ ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. అయితే బనానా చిప్స్ మాత్రం ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంలో సహాయపడతాయి.

పల్లెల నుంచి పట్టణాల వరకు అన్ని ప్రాంతాల్లో బనానా చిప్స్ ను విక్రయిస్తూ ఉంటారు. పెద్దపెద్ద కంపెనీలు చిప్స్ ను విక్రయిస్తున్నా బనానా చిప్స్ ను మాత్రం విక్రయించడం లేదు. అందువల్ల ఈ చిప్స్ బిజినెస్ చేస్తే తక్కువ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 120 కేజీల అరటిపండ్లతో 50 కేజీల చిప్స్ తయారు చేయవచ్చు. బనానా చిప్స్ మెషీన్లు, అరటికాయలు, నూనె చిప్స్ తయారీ కోసం అవసరమవుతాయి.

50 కేజీల చిప్స్ ను 10,000 రూపాయలకు విక్రయిస్తే 7,000 రూపాయలు లాభం వస్తుంది. నెలలో 25 రోజులు పని చేసినా సులభంగా లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తం సంపాదించవచ్చు. అయితే బనానా చిప్స్ ను సరైన విధంగా మార్కెటింగ్ చేసుకుంటే మాత్రమే కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ రూపాయి కాయిన్ ఉంటే లక్షలు మీ సొంతం.. ఎలా అంటే..?

మనలో చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. సులభంగా డబ్బు సంపాదించడం తేలిక కాకపోయినా ఇంట్లో కూర్చుని ధనవంతులు కావడం పెద్ద కష్టం కూడా కాదు. ఒక్క రూపాయి కాయిన్ మీ దగ్గర ఉంటే సులభంగా మీరు లక్షాధికారులు అయ్యే అవకాశం ఉంది. మీ దగ్గర 1885 సంవత్సరం నాటి రూపాయి కాయిన్ ఉంటే ఆన్ లైన్ లో దానిని విక్రయించి 20 లక్షల రూపాయలకు పైగా పొందవచ్చు.

ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్లు తమ వెబ్ సైట్ల ద్వారా కాయిన్లను విక్రయించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇండియా మార్ట్, ఈబే వెబ్ సైట్లు తమ వెబ్ సైట్ల ద్వారా పాతకాలపు నాణేలను విక్రయిస్తున్నాయి. 1885 సంవత్సరం నాటి రూపాయి విలువ ఇప్పుడు 20 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో ఈ కాయిన్ విలువ మరింత పెరిగే లేదా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నాణెం కాకుండా ఇతర పాతకాలపు నాణేలు ఉన్నా కూడా సులభంగా లక్షల్లో సొంతం చేసుకోవచ్చు.

ప్రపంచంలో చాలామంది ధనవంతులు పాత కాలపు నాణేలను తమ దగ్గర ఉంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ నాణేల కోసం ఎంత మొత్తమైనా ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. మీ దగ్గర పాతకాలపు నాణేలు ఉంటే మాత్రం వీలైనంత త్వరగా ఆన్ లైన్ లో ఆ కాయిన్లను విక్రయిస్తే కళ్లు చెదిరే లాభాలను పొందే అవకాశం ఉంటుంది. వెబ్ సైట్లలో సెల్లర్ గా రిజిష్టర్ చేసుకుని సులభంగా కాయిన్లను విక్రయించవచ్చు.

రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత కాయిన్ ఫోటోలను కచ్చితంగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కాయిన్లు ఎంత పాతవైతే వాటి విలువ అంత పెరుగుతుంది. ఓఎల్ఎక్స్ లాంటి వెబ్ సైట్లు సైతం తమ సైట్ల ద్వార కాయిన్లను విక్రయించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

రూ. 35,000 పెట్టుబడితో లక్షలు సంపాదించే ఛాన్స్.. ఏం బిజినెస్ అంటే..?

మనలో చాలామందికి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్నా రోజురోజుకు పెరిగిపోతున్న ఖర్చుల వల్ల బిజినెస్ విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. అయితే కొన్ని బిజినెస్ ల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలిచ్చే బిజినెస్ లలో రైస్ మిల్ బిజినెస్ ఒకటి. ఈ బిజినెస్ గురించి కనీస అవగాహన ఉంటే లక్షల రూపాయల లాభాన్ని సులువుగా పొందవచ్చు.

ఈ బిజినెస్ ద్వారా తక్కువ సమయంలొనే ఎక్కువ రాబడి సొంతమవుతుంది. కొంత మొత్తం పెట్టుబడి పెడితే మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ స్కీమ్ ల ద్వారా సులభంగా పొందవచ్చు. 1000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న స్థలం ఉంటే సులభంగా రైస్ మిల్లును ఏర్పాటు చేసుకోవచ్చు. రైస్ మిల్లును ఏర్పాటు చేయాలంటే 3 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ప్రాంతాన్ని బట్టి ఈ ఖర్చులో స్వల్పంగా మార్పులు ఉంటాయి. ముద్రా లోన్ ద్వారా రైస్ మిల్లు ఏర్పాటు కోసం సులభంగా లోన్ లభిస్తుంది. కేంద్రం 80 నుంచి 90 శాతాన్ని లోన్ రూపంలో ఇస్తుంది కాబట్టి మీ దగ్గర 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయలు ఉన్నా సులువుగా ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు. ఖర్చుతో పోలిస్తే ఎక్కువ రాబడి ఇచ్చే బిజినెస్ కావడంతో ఈ బిజినెస్ ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది.

మిగతా బిజినెస్ లతో పోల్చి చూస్తే ఈ బిజినెస్ కు ఎక్కువ సంఖ్యలో వర్కర్లు కూడా అవసరం లేదు. తక్కువ సంఖ్యలో తక్కువ పెట్టుబడితో రైస్ మిల్ బిజినెస్ ద్వారా ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో రాణించాలని అనుకునేవారికి రైస్ మిల్ల్ బిజినెస్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.