Viral News: వాళ్లకు గంటకు రెండు వేల ఆదాయం. సాఫ్ట్ వేర్ ఎంప్లాయి లేదా .. ఫారెన్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నారా.. లేదా ఏదైనా పెద్ద కోటీశ్వరులు అనుకుంటుంన్నారా.. అస్సలు కానే కాదు. వాళ్లు ఇంటింటికి తిరిగి అడుకునే వాళ్లు.
అవును మీరు విన్నది నిజమే అడుకునే వాళ్లకు గంటకు రూ.2వేలు సంపాదిస్తున్నారు. ఈ మేరకు చూసుకుంటే.. 8 గంటల్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి దాదాపు రూ.16 వేలు రోజుకు సంపాదన. నెలకు దాదాపు రూ. 4.80లక్షలు. వామ్మో ఇదేందయ్యా ఇది.. సంవత్సరానికి వాళ్లకు రూ.60 లక్షలా.. అసలేంటి ఈ కథ. పూర్తి వివరాల్లోకి వెళ్తి తెలుసుకుందాం..
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కల్వల దిన్న (గంటవారి గూడెం) గ్రామంలో ఇద్దరు అడక్కునే వాళ్లు వచ్చారు. మామూలుగా అమ్మ బిచ్చం వెయ్యి అనే వాళ్లు కాదు.. చేతిలో పెద్ద తాడు.. ఆయనకు ఆయనే కొట్టుకుంటాడు. ఒంటినిండా రక్తపు గాట్లు.. పక్కనే డమ్ముతో వాయిస్తూ భార్య.. ఇలా ఇంటి ముందుకు వస్తే.. చాలు వాళ్ల పాటలతో చిరాకు పెట్టిస్తారు. వాళ్లను చూస్తే చిన్న పిల్లలు అయితే.. భయపడిపోతారు.
వాళ్లు అడిగినంత ఇవ్వకపోతే అంతే ఇక.. చుట్టుపక్కల వాళ్లు బిచ్చం వెయ్యడానికి ఎందుకు అంత.. ఎంతో కొంత ఇవ్వోచ్చు కదా అనే మాటలు మాట్లాడుతారు. ఇదంతా ఎందుకని.. ఎంతో కొంత ఇద్దామనుకుంటే పప్పులో కాలేసినట్లే.
వాళ్లు డిమాండ్ ఇంటికి దాదాపు రూ. 50 ఇవ్వాల్సిదే. లేదంటూ నానా యాగీ చేసేస్తారు. ఆ ఇళ్లు అయిపోయిన తర్వాత పక్కిళ్లు. ఇలా వాళ్లు ఆ గ్రామంలో వాళ్ల రాకను కనిపెట్టి .. వాళ్లతో ఇబ్బంది ఎందుకులే అనుకొని.. ఇలా ఇంటికి రూ.50 చొప్పున ఇచ్చుకుంటూ వెళ్లారు. అక్కడే ఉన్న కొంత మంది యువకులు వాళ్లను గంట సేపు గమనించారు. తర్వాత వాళ్ల దగ్గరకు వెళ్లి.. ఎంత వసూలు అయినయో అడిగారు. గంటలో రూ. 2వేలు వచ్చాయి సార్ అని అన్నారు. దీంతో వాళ్లు అవాక్కయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలీకి వెళ్తే.. రూ.500 రాని ఈ రోజుల్లో ఇలా అడుక్కుంటూ రోజుకు రూ.16 వేలు సంపాదించడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…