Reliance Jio రిలయన్స్ జియోతో పాటు ఇతర ప్రధాన టెలికాం ఆపరేటర్లు కొన్ని రోజుల క్రితం తమ అనేక ప్లాన్‌ల ధరలను పెంచేశాయి. కొన్ని ప్లాన్లను నిలిపివేశారు కూడా. వాటితో పాటు సవరించిన ప్లాన్లను ప్రవేశపెట్టారు. తాజాగా ఆ ధరలను రిలయన్స్ జియో తగ్గించింది. వాటి వివరాలిలా ఉన్నాయి.
గత ఏడాది రూ. 499 ప్లాన్ ను రూ. 601 కి పెంచింది. తర్వాత దానిని మళ్లీ రూ.499కి తీసుకొచ్చింది. ఇక ఈ రూ. 499 ప్లాన్ ఇప్పుడు 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. పరిమితి తర్వాత.. వినియోగదారులు 64kbps స్పీడ్ తో డేటాను అందిస్తుంది. ఈప్లాన్ ప్రస్తుతం ఇప్పుడు 28 రోజుల కాలవ్యవధితో రిలయన్స్ జియో అందిస్తోంది.
అంతే కాకుండా.. Jio నుండి జియోకి , జియో నుంచి నాన్ జియోకి అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100ఎస్ఎంఎస్ లు , జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తుంది. రూ. 499 ప్లాన్ డిస్నీ + హాట్‌స్టార్ కాంబో సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. ఈ హాట్ స్టార్ ప్లాన్ అనేది ఎలాంటి రూపాయి కూడా చెల్లించకుండా సంవత్సరం వరకు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు.. ఉచితంగానే జియ్ టీవీ, జియో సినిమా వంటివి జియ్ యాప్ కలిగిని వారికి యాక్సెస్ ఉటుందని పేర్కొంది.
రిలయన్స్ జియో వార్షిక ప్లాన్‌పై హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ వ్యవధిని రూ. 2,545కి పెంచుతుందని రిలయన్స్ జియో ప్రకటించింది. ఆఫర్ గతంలో జనవరి 2 వరకు మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇది ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి 7 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆ తేదీకి ముందు రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు అదనపు ప్రయోజనాలను పొందగలరు. రూ. 2,545 ప్లాన్ అనేది అపరిమిత కాల్‌లు, రోజుకు 100 SMSలు మరియు 336 రోజుల వ్యవధిలో 1.5GB రోజువారీ డేటాను అందించే వార్షిక ప్లాన్. అయితే.. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌తో ప్లాన్ ఇప్పుడు అదనంగా 29 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఇది సాధారణ 336 రోజులకు బదులుగా పూర్తి 365 రోజులకు ఉపయోగపడుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…