Tag Archives: first love

Samantha: చైతన్య సమంత ఫస్ట్ లవ్ కాదా… ఫస్ట్ లవ్ స్టోరీ బయటపెట్టిన సమంత?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు. ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పుష్కరకాలం పూర్తి అవుతున్న ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈమే సినిమాలో వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా మాయోసైటిసిస్ వ్యాధికి గురయ్యారు.

ఈ వ్యాధి కారణంగా ఈమె సినిమాలకు కాస్త విరామం ఇచ్చి ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి బయటపడే మార్గాలను వెతుకుతూ పలు దేశాలకు వెళుతూ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ వ్యాధి నుంచి సమంత క్రమక్రమంగా బయటపడుతున్నారని తిరిగి ఈమె ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంతా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా సమంత తన ఫస్ట్ లవ్ గురించి బయట పెట్టారు. సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల విడిపోయారు అయితే నాగచైతన్య కంటే ఈమె ముందు మరొకరిని ప్రేమించారు అంటున్న ప్రేమ గురించి బయటపెట్టారు తను స్కూల్ చదువుతున్న రోజులలో ఒక బస్సు మారి స్కూల్ కి వెళ్లాల్సి ఉండేదని తెలిపారు.

రెండేళ్లు వెంటపడ్డాడు..
ఇలా బస్ స్టాప్ లో ప్రతిరోజు ఒక అబ్బాయి తనని రెండు సంవత్సరాల పాటు ఫాలో అవుతూ వచ్చారని అయితే ఎప్పుడు దగ్గరకు రాలేదు కానీ తనని ఫాలో అయ్యే వాడిని తెలిపారు. ఇలా ఒకరోజు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అంటే నేను నిన్ను ఫాలో కావడం ఏంటి అనేసారు దీంతో నేను షాక్ అయ్యానని మరి అది ప్రేమ కాదా అనేది నాకు తెలియదు కానీ నాకు మాత్రం అదే ఫస్ట్ లవ్ స్టోరీ అంటూ తన ఫస్ట్ లవ్ బయటపెట్టారు.

పదవ తరగతిలోనే ప్రేమించి..ఇంటి నుంచి వెళ్లిపోయా అంటూ.. ఎమోషనల్ అయిన సిరి..

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం లవ్ స్టోరీలు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ప్రతి ఒక్కరు వారి జీవితంలో జరిగిన పస్ట్ లవ్ గురించి తెలియజేయాలి. ఇలా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ వారి మొదటి ప్రేమ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.. ఈ క్రమంలోనే సిరి తన ఫస్ట్ లవ్ గురించి చెప్పడంతో ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

సిరి పదవ తరగతిలో ఉన్నప్పుడే తన ఒక అబ్బాయిని ప్రేమించానని అతని పేరు విష్ణు.. అందరూ అతన్ని ముద్దుగా చిన్నా అని పిలిచేవారు. అతను మా ఇంటి ఎదురుగానే ఉండటం వల్ల మేమిద్దరం ప్రేమలో పడ్డామని అయితే నేను వేరే ఎవరితోనైనా మాట్లాడితే విష్ణు ఓర్చుకునే వాడుకాదు. ఈ విషయం గురించి మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోవాలని నిర్ణయించుకున్నాము. అప్పటికే ఇంట్లో సంబంధాలు కూడా చూస్తుండడంతో అతనిపై కోపంతో పెళ్లికి ఒప్పుకున్నాను.

తెల్లవారితే నిశ్చితార్థం అనగా విష్ణు ఆరోజు రాత్రి వచ్చి నా కాళ్ళ పై పడి తప్పు చేశాను నాకు నువ్వు కావాలి నన్ను క్షమించమని అడిగాడు. విష్ణు అంటే నాకు కూడా ఎంతో ఇష్టం ఇక తెల్లవారితే నిశ్చితార్థం చేసుకోవాలని ఆ రోజు రాత్రి విష్ణుతో కలిసి ఇల్లు వదిలి పారిపోయానని, ఆ తరువాత అమ్మ వాళ్లు నాతో మాట్లాడి నన్ను వెనక్కి తీసుకు వచ్చారని తెలిపింది.

ఈ విధంగా కొద్ది రోజులపాటు రిలేషన్ లో ఉన్న మేము తరచూ గొడవలు జరిగిన మా రిలేషన్ చాలా బాగుండేది. అయితే ఓ రోజు రాత్రి పడుకున్న తర్వాత తెలవారి 3 గంటలకు మెలుకువ వచ్చింది. లేసి కాసేపాగి మరి పడుకొని తిరిగి 8 గంటలకు నిద్ర లేచాను. అలా నిద్ర లేవగానే ఒక షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చిందని సిరి ఎమోషనల్ అయ్యింది. తెల్లవారుజామున 3 గంటలకు ఎప్పుడైతే మెలకువ వచ్చిందో సరిగ్గా ఆ సమయంలో విష్ణు రోడ్డు ప్రమాదంలో మరణించారనే విషయం తెలిసి సిరి కన్నీటి పర్యంతం అయ్యింది. తన మొదటి లవ్ గురించి చెప్పడంతో అది విన్న మిగతా కంటెస్టెంట్స్ కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు.