Tag Archives: gandhi hospital

Medico Preethi: గాంధీ ఆసుపత్రికి ప్రీతి మృతదేహం… ఆందోళనకు దిగిన విద్యార్థులు!

Medico Preethi: మెడికో స్టూడెంట్ ప్రీతి మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. సీనియర్ విద్యార్థి వేధింపులను తాళలేక ప్రమాదకరమైన ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ప్రీతి గత ఐదు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.

అయితే ఈమె మరణం విషయంలో పెద్ద ఎత్తున హై డ్రామాలు నడిచాయని, కుట్రలు జరిగాయని, పలువురు ఆరోపణలు చేస్తున్నారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్నటువంటి ప్రీతి సీనియర్ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఐదు రోజుల పాటు మృత్యులతో పోరాడిన ఈమె మరణించిందని తెలియగానే ఒక్కసారిగా నిమ్స్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఒకవైపు ప్రీతి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గిరిజన సంఘాల నేతలు బిజెపి నాయకులు ఆసుపత్రి వాతావరణం ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే ప్రీతి మరణ వార్తను ప్రకటించడానికి ముందే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ప్రీతి మరణం పై కొన్ని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

Medico Preethi: విద్యాసంస్థలకు బంద్…

ఇక ప్రీతి మరణించడంతో విద్యార్థుల సైతం ఆందోళనకు దిగి నిందితులకు తప్పకుండా శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా నేడు విద్యాసంస్థలకు కూడా బంద్ ప్రకటించారు. ఇక ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. భయాందోళనలో రోగులు..!

సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఎంతో మంది రోగులు ఉంటారు. రైల్వే స్టేషన్ కు దగ్గరగా ఉండటంతో అక్కడికి ఎంతో మంది పేదలు వారి వైద్యానికి సంబంధించి ట్రీట్ మెంట్ కోసం వస్తుంటారు. ఈ రోజు ఉదయం అక్కడ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ లేబర్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వెంటనే అక్కడి ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో భారీ ప్రమాదం తప్పింది. భయంతో అక్కడి రోగులు బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. గాంధీ ఆసుపత్రిలో ఎప్పటిలాగే ఉద్యోగులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ రోజు ఉదయం అక్కడే ఉన్న లేబర్ రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‎ కారణంగా దవాఖాన నాలుగో అంతస్తులోని విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.

ఆ మంటలను అక్కడే ఉన్న ఆసుపత్రి సిబ్బంది గమనించి.. వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే వాళ్లు వచ్చే లోపే కొంతమంది రోగులు మంటల్లో చిక్కుకున్నారు. ఇలా అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు.

మొదట మంటలు వస్తున్న క్రమంలో అగ్నిమాపక సిబ్బంది రావడం ఆలస్యం కావడంతో.. ఆసుపత్రి సిబ్బందే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వాళ్లే అక్కడ ఉన్న చాలామంది రోగులను కాపాడారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు.. గాంధీ ఆస్పత్రిలో దిక్కు?

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కేసుల సంఖ్య అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మొదటి దశలో ఎక్కువగా వృద్ధులు మృత్యువాత పడగా రెండవ దశలో యువకులు సైతం అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. కానీ,ఇంతటి భయంకరమైన మహమ్మారి నుంచి 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించి ఎంతో ఆరోగ్యంగా బయటపడ్డాడు.

హైదరాబాద్ లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఎంతో మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే గాంధీ ఆస్పత్రిలో కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న 110 సంవత్సరాల రామానంద తీర్థ అనే వ్యక్తి కరోనాను జయించి ఆరోగ్యంగా ఉండడంతో ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

రామానంద తీర్థ(110) కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నారు. ఇటీవల ఆయనకు స్వల్ప కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచనల మేరకు ఏప్రిల్ 24న గాంధీ ఆస్పత్రిలో చేరిన రామానందతీర్థకు ఆక్సిజన్ స్థాయిలు 92 గా ఉండడంతో అతనికి ఐసియు వార్డులో కోవిడ్ చికిత్స అందించారు. దాదాపు మూడు వారాల చికిత్స అనంతరం రామానందతీర్థకి మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అతనికి నెగిటివ్ వచ్చింది.

110 ఏళ్ల వయసులో కరోనా బారినపడి విజయవంతంగా కరోనా నుంచి బయటపడిన రామతీర్థ కి ఇతర ఎటువంటి జబ్బులు లేకపోవడంతోనే అతను తొందరగా కరోనా నుంచి కోలుకొని బయటపడినట్లు
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు.