Tag Archives: Ganesh immersion ceremony

Allu Arjun: కూతురుతో కలిసి గణేష్ నిమజ్జన వేడుకల్లో సందడి చేసిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Allu Arjun:గణేష్ ఉత్సవాల నిమిత్తం సెలబ్రిటీల నుంచి సాధారణ వ్యక్తుల వరకు పెద్ద ఎత్తున వినాయకుడి ప్రతిమలను ప్రతిష్టించి పెద్ద ఎత్తున పూజలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే గణేష్ నిమజ్జనం సందర్భంగా సెలబ్రిటీలు సైతం నిమజ్జన కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.

 

 

 

ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి ఏడాది తన ఆఫీసులో వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తూ అనంతరం తన టీమ్ మెంబర్స్ తో కలిసి వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొంటారు.అల్లు అర్జున్ వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నిమజ్జన కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.

అయితే ఈసారి గణేష్ నిమజ్జన కార్యక్రమాలలో భాగంగా అల్లు అర్జున్ తన కూతురు అర్హతో కలిసి ఊరేగింపు కార్యక్రమంలో సందడి చేశారు. ఈ విధంగా అల్లు అర్జున్ అర్హ దగ్గరుండి నిమజ్జన కార్యక్రమాలలో పాల్గొనటమే కాకుండా స్వామివారి నిమర్జనానికి వెళ్లేముందు కొబ్బరికాయ కొట్టి అక్కడ తన టీమ్ మెంబర్స్ తో కలిసి చిందులు వేస్తూ సందడి చేశారు.

 

Allu Arjun: సాంప్రదాయాలకు విలువిస్తున్న బన్నీ…

ఇక తన కూతురుకు వినాయక చవితి ప్రత్యేకతలు నిమజ్జనం గురించి తెలియజేశారు.ఇలా అల్లు అర్జున్ స్టార్ సెలబ్రెటీ అయినప్పటికీ ఈయన దగ్గరుండి మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ మన సంప్రదాయాలను కూతురుకు వివరించారు. ఇలా అల్లు అర్జున్ ఈ వేడుకలలో పాల్గొనడం పట్ల చాలామంది ఈయన సంస్కృతి సాంప్రదాయాలకు ఇస్తున్న గౌరవం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.