Allu Arjun:గణేష్ ఉత్సవాల నిమిత్తం సెలబ్రిటీల నుంచి సాధారణ వ్యక్తుల వరకు పెద్ద ఎత్తున వినాయకుడి ప్రతిమలను ప్రతిష్టించి పెద్ద ఎత్తున పూజలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే గణేష్ నిమజ్జనం సందర్భంగా సెలబ్రిటీలు సైతం నిమజ్జన కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.
ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి ఏడాది తన ఆఫీసులో వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తూ అనంతరం తన టీమ్ మెంబర్స్ తో కలిసి వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొంటారు.అల్లు అర్జున్ వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నిమజ్జన కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.
అయితే ఈసారి గణేష్ నిమజ్జన కార్యక్రమాలలో భాగంగా అల్లు అర్జున్ తన కూతురు అర్హతో కలిసి ఊరేగింపు కార్యక్రమంలో సందడి చేశారు. ఈ విధంగా అల్లు అర్జున్ అర్హ దగ్గరుండి నిమజ్జన కార్యక్రమాలలో పాల్గొనటమే కాకుండా స్వామివారి నిమర్జనానికి వెళ్లేముందు కొబ్బరికాయ కొట్టి అక్కడ తన టీమ్ మెంబర్స్ తో కలిసి చిందులు వేస్తూ సందడి చేశారు.
ఇక తన కూతురుకు వినాయక చవితి ప్రత్యేకతలు నిమజ్జనం గురించి తెలియజేశారు.ఇలా అల్లు అర్జున్ స్టార్ సెలబ్రెటీ అయినప్పటికీ ఈయన దగ్గరుండి మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ మన సంప్రదాయాలను కూతురుకు వివరించారు. ఇలా అల్లు అర్జున్ ఈ వేడుకలలో పాల్గొనడం పట్ల చాలామంది ఈయన సంస్కృతి సాంప్రదాయాలకు ఇస్తున్న గౌరవం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…