Heroine Ester : ‘వెయ్యి అపద్ధాలు’ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎస్తర్ ఆ తరువాత ‘భీమవరం బుల్లోడు’ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఎస్తర్ సినిమాలు చేస్తూనే రాపర్, సింగర్ నోయెల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే మొదట్లో బాగానే ఉన్నా వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. విడిపోయాక ఎస్తర్ మళ్ళీ సినిమాల్లో బిజీగా ఉంది. అయితే ఇప్పటికీ నోయెల మాజీ భార్య అంటూ చాలా వెబ్ సైట్స్ లో రాయడం వంటి వాటిపై స్పందించారు ఎస్తర్. ఇక బిగ్ బాస్ షో గురించి కామెంట్స్ చేసింది.
నా డివోర్స్ తో బిగ్ బాస్ వాళ్లకు పనేంటి…
సోషల్ మీడియాలో నెగెటివిటీకే ప్రచారం ఎక్కువ. జనాలు కూడా ఒకరి లైఫ్ లో నెగెటివ్ విషయాల గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం చూపుతారు కానీ పాజిటివ్ అంశాలను చూడాలని అనుకోవడం లేదు. యూ ట్యూబ్ ఛానెల్స్ లో ఉన్నదీ లేనిదీ కలిపి ఒకరి జీవితం లోని బాధాకరం విషయాలను బాగా హైలైట్ చేసి చూపుతుంటారు, అలాంటి వాటిని చూసి జనాలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు చూస్తున్నారని యూట్యూబ్ ఛానెల్స్ అలాంటి వార్తలను రాస్తారా లేకపోతే వాళ్ళు రాస్తున్నారు కాబట్టి ఇలాంటి వార్తలను జనాలు చూస్తున్నారా అంటే కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నలాగా తయారవుతుంది.
ఇప్పటికీ నన్ను నోయెల్ మాజీ భార్య అనడంలో వారికి వచ్చే ఆనందం ఏమిటో అర్థం కాదు, నా కొత్త సినిమా ట్రైలర్ కింద నోయెల్ మాజీ భార్య కొత్త సినిమా ట్రైలర్ అని ఉంది, ఆ వీడియో లింక్ ను మళ్ళీ నాకే పెడతారు. ఎందుకు అలా నోయెల్ మాజీ భార్య అనే ట్యాగ్ అంటే అతను బిగ్ బాస్ వెళ్లొచ్చాడు కదా అంటూ చెప్తున్నారు. వివాదాలతో అయినా సరే ఫేమస్ అయితే చాలు అనే ధోరణి ఇప్పుడు ఎక్కువ ఉంది కానీ నేను అలా భావించడం లేదు. నా పనికి గుర్తింపు వచ్చి అలా నేను ఫేమస్ అయితే ఆనందిస్తా కానీ ఇలా నా విడాకుల ఇష్యూ వల్ల ఫేమ్ వస్తుందంటే అది నాకు వద్దు. బిగ్ బాస్ లో మా డివోర్స్ గురించి ఎందుకు అంటూ ఎస్తర్ అభిప్రాయపడింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…