Featured

Manchu Manoj : మంచు కుటుంబంలో చిచ్చు… ఆస్తుల విభజన దిశగా… మనోజ్ రెండో పెళ్లి మోహన్ బాబు కి ఇష్టం లేదా.?

Manchu Manoj : నిన్నటి నుండి బాగా వైరల్ అవుతున్న మంచు మనోజ్ మౌనిక రెడ్డీల రెండో పెళ్లి వార్తలకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. మనోజ్ తన మొదటి భార్య ప్రణీత రెడ్డి కి విడాకులు ఇచ్చి సింగల్ గా ఉంటున్నాడు. ఇక ఇటు భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనిక రెడ్డి కూడా మొదటి భర్త గణేష్ రెడ్డికి విడాకులు ఇచ్చి ఇప్పుడు మనోజ్ తో పెళ్ళికి సిద్ధమైంది. ఇక వీరు ఇప్పటికే కలిసి ఉంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే వీరిద్దరూ కలిసి వ్యాపారభాగస్వాములుగా ఉన్నారు. హైదరాబాద్ లో కలిసి ఉంటున్న వీరిద్దరూ నిన్న సీతాఫల్ మండి లోని వినాయకున్ని దర్శించుకోడానికి కలిసి రావడంతో వీరిద్దరి గురించి బయటి ప్రపంచానికి తెలిసి వచ్చింది.

ఆస్తుల విభజన దిశగా…

ఇక భూమా నాగిరెడ్డి ఆయన భార్య శోభా నాగిరెడ్డి అకాల మరణం తరువాత అఖిల ప్రియ రాజకీయ ప్రవేశం చేసింది, అప్పటినుండి మౌనిక రెడ్డి అక్కకు సపోర్ట్ గా నిలిచింది. ఇటీవల భూమా అఖిల ప్రియ హైదరాబాద్ లో భూ వివాదంలో ఇరుక్కున్నపుడు కూడా తమ్ముడు, అక్క అరెస్ట్ అయినపుడు కూడా మౌనిక రెడ్డి వారికి సపోర్ట్ గా ఉండి కేటీఆర్ ను కలిసి సెటిల్ చేసింది. అప్పటికే భూమా ఇంట్లో అస్థి గొడవలు ఉన్నా మౌనిక అక్కకు సపోర్ట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు తమ్ముడు వీరి మీద ఆస్తుల విషయంలో కోర్ట్ లో కేసు వేశారు. ఇవన్నీ ఒకవైపు ఉంటే ఇక మౌనిక రెడ్డి తో మనోజ్ పెళ్ళికి మోహన్ బాబు సుముఖంగా లేడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాట్లాడుతూ మోహన్ బాబు వ్యతిరేకించాల్సిన పని లేదు, ఇక వారింట్లో ఆస్తుల విభజన ఎప్పుడో మొదలయింది. మోహన్ బాబు కూతురు, కొడుకులకు ఆస్తులను పంచడం ఎప్పుడో మొదలు పెట్టారు. ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు. ఇక ఇటీవల చంద్రబాబు నాయుడుని కలిసింది తాను ఏ పార్టీలోనూ లేను కేవలం న్యూట్రల్ గా ఉన్నానని చెప్పే ప్రయత్నమే. మనోజ్ రెండో పెళ్లి విషయంలో చర్చ వచ్చుండొచ్చు కానీ ఆ విషయం గురించే చంద్రబాబును కలిసి ఉండడు అంటూ భరద్వాజ అభిప్రాయ పడ్డారు.

ఇక మౌనిక రెడ్డికి తన మొదటి భర్తతో విడాకులు వచ్చినా వాళ్లకు ఒక కొడుకు ఉండటంవల్ల ఆ అబ్బాయి విషయంలో ఇంకా సెటిల్మెంట్ జరిగలేదు. మౌనిక భర్త తరుపున వాళ్ళు బిడ్డను అప్పగించమని అడగడం వల్ల ఇంకా సెటిల్మెంట్ నడుస్తోంది అలాగే భరణం విషయంలోను చర్చలు జరుగుతున్నాయి. బిడ్డను వారికి అప్పగిస్తే తనకు భరణం ఎలా అనే వాటిపై చర్చలు నడుస్తున్నాయి. అవి పూర్తయితే మౌనిక రెడ్డి, మనోజ్ లు పెళ్లి చేసుకుంటారు. ఇక వాళ్ళు ఎప్పటినుండో కలిసి ఉంటున్నా ఇప్పుడు బయటికి రావడానికి కారణం అందరికీ ఈ విషయం తెలిసి చర్చ జరగాలని కోరుకునివుండవచ్చు అంటూ అభిప్రాయ పడ్డారు భరద్వాజ.

Bhargavi

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

11 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

11 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

11 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

12 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

12 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

12 hours ago